కీవ్: రష్యాలోని వోరోనెజ్ వైమానిక స్థావరంపై దాడి చేసి నాలుగు ఎస్యూ-34 యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని, మరో రెండు యుద్ధ విమానాలను కూడా దెబ్బతీశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడిలో నెప్ట్యూన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు.
రష్యాలోని ఒరియోల్ ప్రాంతంలో డ్రోన్ల నిల్వ, ప్రయోగ కేంద్రంపై, నల్ల సముద్రంలో మరో టార్గెట్పై కూడా తాము దాడులు చేసినట్లు పేర్కొన్నారు. అయితే రష్యా దాడులకు ప్రతిచర్యగానే ఈ చర్యలు చేపట్టామని, యుద్ధం కొనసాగినంత కాలం తమ దాడులు ఇలానే కొనసాగుతాయని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశం.. 17 రాష్ట్రాల్లో ఇక ఎస్ఎస్ఆర్


