కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశం.. 17 రాష్ట్రాల్లో ఇక ఎస్‌ఎస్‌ఆర్‌ | Election Commission Orders Special Summary Revision Of Electoral Rolls In 17 States | Sakshi
Sakshi News home page

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశం.. 17 రాష్ట్రాల్లో ఇక ఎస్‌ఎస్‌ఆర్‌

Oct 15 2026 7:46 PM | Updated on Oct 15 2026 8:34 PM

Election Commission Orders Special Summary Revision Of Electoral Rolls In 17 States

సాక్షి,న్యూఢిల్లీ: అర్హులైన వారు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌–ఎస్‌ఎస్‌ఆర్‌) చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను మెరుగుపరచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సరిచేయడం ఎన్నికల సంఘం చేపట్టే సాధారణ ప్రక్రియలో భాగం. కొత్తగా ఓటు హక్కు పొందినవారు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాల్లోని వివరాల్లో తప్పులను సరిచేసుకునేందుకు ఇటువంటి సవరణలు అవకాశం కల్పిస్తాయి. ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఓటర్ల జాబితాల్లో పేర్ల నమోదు, వ్యక్తిగత వివరాల సవరణ, అర్హత కోల్పోయిన లేదా మరణించిన ఓటర్లకు సంబంధించిన వివరాల పరిశీలన వంటి అంశాలు ఉంటాయి.

ఈ రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌ఆర్‌: అస్సాం, అండమాన్‌-నికోబార్‌, గోవా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, కేరళ, మణిపూర్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాలు, ఇటీవల పూర్తైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ షెడ్యూల్‌ను తర్వాత ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రకటిస్తామని పేర్కొంది. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీల పదవీకాలం 2027లో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement