రష్యాపై ట్రంప్‌ వైఖరి దురదృష్టకరం | Donald Trump Russia sanctions waiver wrong says Volodymyr Zelenskyy | Sakshi
Sakshi News home page

రష్యాపై ట్రంప్‌ వైఖరి దురదృష్టకరం

Oct 18 2026 6:23 AM | Updated on Oct 18 2026 6:23 AM

Donald Trump Russia sanctions waiver wrong says Volodymyr Zelenskyy

లిండ్సే గ్రాహం చట్టానికి అందరూ మద్దతు తెలపాలి  

ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ వినతి 

కీవ్‌: రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలను నిలిపివేయడాన్ని ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ తప్పు పట్టారు. ట్రంప్‌ వైఖరి చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మెరుగవుతున్న సంగతి తెలిసిందే. రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని గతంలో విధించిన ఆంక్షలను ట్రంప్‌ నిలిపివేశారు. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనే దేశాలపై సుంకాలు విధించే చట్టాన్ని సైతం తాత్కాలికంగా ఆపేశారు. 

ఈ పరిణామాలను ఉక్రెయిన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై నిజంగా తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావాల్సిన లిండ్సే గ్రాహం చట్టాన్ని ట్రంప్‌ పూర్తిగా విస్మరించాలని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యాపై కొత్త ఆంక్షలను తిరిగి అమలు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

లిండ్సే గ్రాహం చట్టం అమల్లోకి రావాలన్నారు. దీనికి మద్దతుగా అందరూ మాట్లాడాలని శనివారం కోరారు. శుక్రవారం రాత్రి జరిగిన రష్యా దాడుల్లో అంబులెన్స్‌ డ్రైవర్‌తో సహా కనీసం నలుగురు మరణించారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని ఉక్రెయిన్‌అధికారులు తెలిపారు. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ దాడి చేసిందని, దేశవ్యాప్తంగా 15కు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా దాడుల వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement