
దేశంలో ఎటు చూసినా.. పంద్రాగస్టు సంబరాల కోలహలమే. చారిత్రక ప్రదేశాల్లో ఈ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులతో సందడిగా ఉంది. ఎందరో అమర వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. ఆ సమరయోధుల అందర్నీ స్మరిస్తూ..సగర్వంగా ఈ వేడుకుని జరుపుకోనుంది భారతదేశం. ఈ వేడుక ఢిల్లీ ఎర్రకోటలో మరింత ప్రత్యేకం. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైభవానికి అర్థంపట్టేలా విభిన్న శకటాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయుధ దళాల సాహస విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలు ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ కట్టిపడేసేలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదీగాక ఈ వేడుకల్లో దేశ విదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొంటారు. వారందరి సమక్షంలో ఈ వేడుకలను తిలకిస్తే కలిగే ఆ అనుభవం వేరెలెవెల్ . పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరువేసిన తదనంతరం ఇచ్చే స్పీచ్‌ని ప్రత్యక్షంగా చూడాలని చాలామంది కోరుకుంటారు. ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మోదీ స్పీచ్‌ని వీక్షించాలనుకుంటే జస్ట్ ఇలా చేయండి చాలు..
ఎర్రకోట వద్ద జరిగే స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. టిక్కెట్ల అమ్మకాలు ఆగస్టు 13, 2025 నుండి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్‌లలో ప్రారంభమవుతాయి. అదెలాగంటే..
ఆన్‌లైన్ ప్రక్రియ..
అధికారిక వెబ్‌సైట్ aamantran.mod.gov.in లేదా e-invitations.mod.gov.in. సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవం 2025 టికెట్ బుకింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
వివరాలను ఇలా పూరించాలి..
పేరు, మొబైల్ నంబర్, టిక్కెట్ల సంఖ్య పూర్తి చేయాలి
వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో IDని డౌన్‌లోడ్ చేసుకోండి.
టికెట్ కేటగిరీని ఎంచుకోవాలి: రూ. 20 (జనరల్ కేటగిరీ), రూ. 100 (మధ్యతరగతి), రూ. 500 (ప్రీమియం కేటగిరీ)
ఆ తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసి QR కోడ్ సీటింగ్ వివరాలతో ఇ-టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దీన్ని ఫోన్‌లో డిజిటల్ కాపీ లేదా ప్రింటవుట్ కాపీని ఉంచండి — అది గేట్ వద్ద అవసరం.
ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఎలా
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ సేవలే వినియోగిస్తున్నప్పటికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 10, 12 తేదీల్లో ఎంపిక చేసిన ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. దీన్ని సాధారణంగా ప్రభుత్వ భవనాలు, వార్తాపత్రికలు, అధికారికి వెబ్‌సైట్‌లో ప్రకటిస్తుంది
ఆఫ్‌లైన్ బుకింగ్ కోసం..
చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి (ఆధార్, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్) తీసుకెళ్లాలి.
టికెట్ ధరను (రూ. 20, రూ. 100, లేదా రూ. 500) నగదుగా లేదా డిజిటల్ చెల్లింపుల్లో చెల్లించండి.
టిక్కెట్‌ను తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి.
ఆఫ్‌లైన్ టికెట్లు పరిమిత సంఖ్యలో దొరకుతాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
ఏవిధంగా చేరుకోవాలంటే..
ఎర్రకోట చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అత్యంత అనుకూలమైన మార్గం. అందుకోసం లాల్ ఖిలా లేదా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ఈ మెట్రో సేవలు ఉదయం: 4.00 గంటలకు ప్రారంభమవుతాయి. కార్యక్రమం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 6:30–7:00 గంటల మధ్య చేరుకునేలా ట్రావెల్‌ని ప్లాన్ చేసుకోవాలి.
ప్రవేశానికి ముందు చాలా కఠినతరమైన భద్రత ఉంటుందనేది గుర్తు ఎరగాలి.
చివరగా ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఎర్రకోట నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం త్వరితగతిన టికెట్లు బుక్ చేసుకుని టైమ్‌కి చేరుకునేలా చక్కగా ట్రావెల్‌ని ప్లాన్ చేసుకోవాలనేది గ్రహించండి.
(చదవండి: Goa Tourism 2025 Rules: గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...)