
ఫెమినా ఇండియా ( Femina India )అంటే అందాల పోటీలు మాత్రమే కాదు. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత క్లిష్టమైన సమయాల్లో దేశానికి సేవచేసే ధీర వనితలను గౌరవించుకోవడం కూడా. ఫెమినా ఇండియా ఆగస్టు 2025 కవర్ పది మంది భారత ఆర్మీ మహిళా అధికారులతో రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. “ప్రతి వందనం వెనుక ఒక ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ మూలల నుండి విభిన్నమైన, అద్భుతమైన కథలు. వారి గ్లామర్ కోసం కాదు అత్యంత ధైర్యసాహసాలకోసం..అంటూ సాగే ఈవీడియోను విశేషంగా నిలుస్తోంది.
వారియర్ ఉమెన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ శీర్షికతో 1997-బ్యాచ్ IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన శక్తివంతమైన వీడియోను ఫెమినా ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కేవలం ఫ్యాషన్ షూట్ కాదు-యూనిఫాంలో అధికారులుగా దేశాన్ని రక్షించే మహిళలకు ఒక బోల్డ్ సెల్యూట్. ఇండియన్ ఆర్మీలో మహిళల ఇమేజ్‌ను ముఖ్యంగా, పది మంది విశిష్ట మహిళా అధికారులకు గొప్ప గౌరవ సూచకంగా దీన్ని రూపొందించింది. ఈ శక్తివంతమైన వీడియోలో, మ్యాగజైన్ కవర్ షూట్ దేశంలోని మహిళా యోధులకు సెల్యూట్ చేసింది. కల్నల్‌ల నుండి లాన్స్ నాయక్ వరకు పది మంది భారతీయ ఆర్మీ అధికారులు తమ ఆలివ్-గ్రీన్ యూనిఫామ్‌లలో సగర్వంగా ఇందులో కనిపిస్తారు. ప్రతీ ఫ్రేమ్‌లో వారి ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో అడ్డంకులను ఛేదించి, ఈ స్థాయికి చేరి దేశానికి గౌరవంగా సేవ చేస్తూ అచంచలమైన దేశభక్తి నిదర్శనంగా ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చేట్టుగా, దేశ సేవ ద్వారా తమ ధైర్యాన్ని పట్టుదలను నూరిపోసేట్టుగా ఉందీ వీడియో.
ఈ వీడియోలో కల్నల్ సోఫియా ఖురేషి, కల్నల్ మేఘనా డేవ్, కల్నల్ పోనుంగ్ డోమింగ్, SM, కల్నల్ అన్షు జామ్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ కృతికా పాటిల్, మేజర్ ద్విపన్నిత కలిత, కెప్టెన్ ఓజస్విత శ్రీ, కెప్టెన్ శ్రద్ధా శివదావ్కర్, లాన్స్ నాయక్ ఆషిక, లాన్స్ నాయక్ మంజును చూడవచ్చు.
కల్నల్ సోఫియా ఖురేషి: సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి ఆపరేషన్ సిందూర్ సమయంలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్‌కు నాయకత్వం వహించి వార్తల్లోనిలిచిన ధీర.
మేజర్ డాక్టర్ దీపన్విత (ద్విపన్నిత) కలిత: అస్సాం మొట్టమొదటి మహిళా పారాట్రూపర్, ఆగ్రాలో శిక్షణ పొంది 2023లో ధేకియాజులి నుండి ఫెమినా ఇండియా కవర్ వరకు ఆమె ప్రయాణం ప్రేరణ యొక్క స్మారక చిహ్నంగా మారింది. ల్నల్ పోనుంగ్ డోమింగ్: అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన మొదటి మహిళా కల్నల్.