breaking news
femina magazine
-
విమెన్ వారియర్స్ ఆర్మీ అధికారులతో ఫెమినా ఇండియా వీడియోవైరల్
ఫెమినా ఇండియా ( Femina India )అంటే అందాల పోటీలు మాత్రమే కాదు. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత క్లిష్టమైన సమయాల్లో దేశానికి సేవచేసే ధీర వనితలను గౌరవించుకోవడం కూడా. ఫెమినా ఇండియా ఆగస్టు 2025 కవర్ పది మంది భారత ఆర్మీ మహిళా అధికారులతో రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. “ప్రతి వందనం వెనుక ఒక ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ మూలల నుండి విభిన్నమైన, అద్భుతమైన కథలు. వారి గ్లామర్ కోసం కాదు అత్యంత ధైర్యసాహసాలకోసం..అంటూ సాగే ఈవీడియోను విశేషంగా నిలుస్తోంది.వారియర్ ఉమెన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ శీర్షికతో 1997-బ్యాచ్ IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన శక్తివంతమైన వీడియోను ఫెమినా ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కేవలం ఫ్యాషన్ షూట్ కాదు-యూనిఫాంలో అధికారులుగా దేశాన్ని రక్షించే మహిళలకు ఒక బోల్డ్ సెల్యూట్. ఇండియన్ ఆర్మీలో మహిళల ఇమేజ్ను ముఖ్యంగా, పది మంది విశిష్ట మహిళా అధికారులకు గొప్ప గౌరవ సూచకంగా దీన్ని రూపొందించింది. ఈ శక్తివంతమైన వీడియోలో, మ్యాగజైన్ కవర్ షూట్ దేశంలోని మహిళా యోధులకు సెల్యూట్ చేసింది. కల్నల్ల నుండి లాన్స్ నాయక్ వరకు పది మంది భారతీయ ఆర్మీ అధికారులు తమ ఆలివ్-గ్రీన్ యూనిఫామ్‌లలో సగర్వంగా ఇందులో కనిపిస్తారు. ప్రతీ ఫ్రేమ్‌లో వారి ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో అడ్డంకులను ఛేదించి, ఈ స్థాయికి చేరి దేశానికి గౌరవంగా సేవ చేస్తూ అచంచలమైన దేశభక్తి నిదర్శనంగా ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చేట్టుగా, దేశ సేవ ద్వారా తమ ధైర్యాన్ని పట్టుదలను నూరిపోసేట్టుగా ఉందీ వీడియో. View this post on Instagram A post shared by Femina (@feminaindia) ఈ వీడియోలో కల్నల్ సోఫియా ఖురేషి, కల్నల్ మేఘనా డేవ్, కల్నల్ పోనుంగ్ డోమింగ్, SM, కల్నల్ అన్షు జామ్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ కృతికా పాటిల్, మేజర్ ద్విపన్నిత కలిత, కెప్టెన్ ఓజస్విత శ్రీ, కెప్టెన్ శ్రద్ధా శివదావ్కర్, లాన్స్ నాయక్ ఆషిక, లాన్స్ నాయక్ మంజును చూడవచ్చు.కల్నల్ సోఫియా ఖురేషి: సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి ఆపరేషన్ సిందూర్ సమయంలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్‌కు నాయకత్వం వహించి వార్తల్లోనిలిచిన ధీర.మేజర్ డాక్టర్ దీపన్విత (ద్విపన్నిత) కలిత: అస్సాం మొట్టమొదటి మహిళా పారాట్రూపర్, ఆగ్రాలో శిక్షణ పొంది 2023లో ధేకియాజులి నుండి ఫెమినా ఇండియా కవర్ వరకు ఆమె ప్రయాణం ప్రేరణ యొక్క స్మారక చిహ్నంగా మారింది. ల్నల్ పోనుంగ్ డోమింగ్: అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన మొదటి మహిళా కల్నల్. -
'సన్నబడాలంటే కడుపు మాడ్చుకోను'
బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ ఈ మధ్య కాస్త సన్నబడింది. ఫెమినా కవర్ పేజీ మీద ఫొటో కోసం బాగా నాజూగ్గా తయారవుతోంది. అయితే.. దీనికోసం తాను కడుపు మాత్రం మాడ్చుకోవట్లేదని ఆమె స్పష్టంగా చెబుతోంది. ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారానే ఇవన్నీ సాధిస్తున్నట్లు తెలిపింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమాలో ఆమె వంపుసొంపులు చాలా కొత్తగా కనిపించాయి. ఇందుకోసం తాను తిండిని మాత్రం మానుకోలేదని హుమా స్పష్టంగా చెప్పింది. తనకు ఆహారం అంటే చాలా చాలా ఇష్టమని, ప్రతి పదినిమిషాలకోసారి తన ట్రైనర్ తనకు బ్రేక్ ఇచ్చి, తనకు ఏం కావాలంటే అది తినమంటారని తెలిపింది. అయితే, ఇప్పుడు తాను జంక్ ఫుడ్ తినడం మాత్రం మానేశానని, దాదాపు ప్రతిరోజూ యోగా చేయడం, వ్యాయామాలు, కొంత వరకు పరుగు తీయడం అలవాటు చేసుకున్నానని వివరించింది. సన్నబడటం కోసం ఒకేసారి తిండి మానేయడం సరికాదని, అది చాలా అనారోగ్యకరం అవుతుందని హుమా అంటోంది. ఫెమినా కవర్ పేజీమీద కనిపించడం అంటే అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమని, అలాంటి అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని సంబరపడుతూ చెప్పింది. -
కార్తీక్ నచ్చాడు కానీ... క్రికెటర్లు కాదు!
న్యూఢిల్లీ: భారత టాప్-50 అందగత్తెల్లో ఒకరిగా ‘ఫెమినా’ గుర్తించిన స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ నిశ్చితార్ధం ఇటీవలే క్రికెటర్ దినేశ్ కార్తీక్‌తో జరిగింది. అయితే కార్తీక్ పరిచయమయ్యే వరకు తనకు క్రికెటర్లు అంటే అస్సలు నచ్చేవారు కాదని ఆమె వెల్లడించింది. అయితే ఇప్పుడూ ఆమె ఆలోచన ధోరణిలో మార్పు లేదు కానీ... కార్తీక్‌ను క్రికెటర్‌గా కాకుండా అతని మంచి మనసు వల్లే ప్రేమించానని చెప్పింది. ‘క్రికెటర్లకు లభించే పేరు, ప్రాచుర్యం ఇతర ఆటలను దెబ్బ తీస్తున్నాయనేది నా నమ్మకం. అది ఇప్పుడూ మారలేదు. అయితే కుటుంబ విలువలు తెలిసిన, భేషజాలకు పోని అబ్బాయి కావడంతోనే కార్తీక్‌ను ప్రేమించాను. అతను క్రికెటర్ అయితే నేనేమీ చేయలేను. ఈ విషయంలో నా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటే సరదాగా ఉంది’ అని దీపిక చెప్పింది. ఐదేళ్ల క్రితమే తొలిసారి తాము కలిసినా గత ఫిబ్రవరిలోనే ప్రేమ మొదలైందని పల్లికల్ గుర్తు చేసుకుంది. ప్రస్తుత బిజీ షెడ్యూల్ కారణంగా తాము 2015లో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వరల్డ్ నం. 12 ప్లేయర్ దీపిక చెప్పింది.