
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా'.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి నాలుగు (విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్‌టీ) కొత్త కాన్సెప్ట్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ నాలుగు కార్లు సరికొత్త డిజైన్ కలిగి.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
మహీంద్రా ఆవిష్కరించిన కొత్త ''విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్‌టీ'' కార్లు.. ఎన్యూ.ఐక్యూ (NU.IQ) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి.

మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్‌టీ
మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్‌టీ రెండూ కూడా చూడటానికి కొంత థార్ మాదిరిగా ఉంటాయి. విజన్ టీ కారు బాక్సీ బాడీని కలిగి ఉండగా, విజన్ ఎన్ఎక్స్‌టీ డెక్‌లోని స్పేర్ వీల్స్‌కు అనుగుణంగా ఉండే.. ట్రక్ లాంటి క్యాబిన్‌ను పొందుతుంది. మొత్తం మీద ఈ కార్లు దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీటికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
మహీంద్రా విజన్ ఎస్
మహీంద్రా విజన్ ఎస్ అనేది బాక్సీ అవుట్‌లైన్ పొందుతుంది. ఎల్ఈడీ లైట్స్, ట్విన్ పీక్స్ లోగో, హెడ్‌ల్యాంప్ కోసం సరికొత్త డిజైన్ వంటివి గమనించవచ్చు. ఇది ఆఫ్ రోడ్ మాదిరిగా అనిపిస్తుంది. కాబట్టి రూప్ మీద లైట్స్, దృఢమైన బంపర్, వీల్ ఆర్చ్‌లతో సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటివన్నీ గమనించవచ్చు. విజన్ ఎస్ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్ట్రీమ్‌లైన్డ్ ఓఆర్‌వీఎం, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు.
ఇదీ చదవండి: పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..
మహీంద్రా విజన్ ఎక్స్
మహీంద్రా విజన్ ఎక్స్ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో సన్నని హెడ్‌ల్యాంప్, పొడవుగా ఉండే హుడ్ వంటివి ఈ కారులో గమనించవచ్చు. పైకప్పు క్రిందికి వాలుగా ఉంటుంది, ఇది కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. విజన్ ఎక్స్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉన్న వెనుక బంపర్ పొందుతుంది.