
మగబిడ్డ జననం.. పీవో దంపతులకు అభినందనలు
భద్రాచలం టౌన్: భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తన సతీమణి మనీషా కు భద్రా చలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. ఈమేరకు ఆమె శుక్రవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రు ల్లో మెరుగైన వైద్యం అందుతోందని ప్రజలకు భరోసా కల్పించేందుకు.. గతంలో భద్రాద్రి కలెక్టర్‌గా పనిచేసిన అనుదీప్, ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తమ సతీ మణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించడం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్స వం రోజు బిడ్డకు జన్మనిచ్చిన రాహుల్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు రామకృష్ణ, విజయ్ బృందం ఆధ్వర్యంలో మనీషాకు ప్రసవం చేశారు.