Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి | Pakistans Independence day Turns Deadly Glbs | Sakshi
Sakshi News home page

Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి

Aug 14 2025 8:27 AM | Updated on Aug 14 2025 11:55 AM

Pakistans Independence day Turns Deadly Glbs

కరాచీ: పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే నగరంలో జరుగుతున్న దోపిడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు హతమయ్యారు.

కరాచీలోని పలు ప్రాంతాలలో వైమానిక కాల్పులు జరిగినట్లు పాక్‌ మీడియా తెలిపింది. వివిధ ఘటనల్లో 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురి నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక కాల్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు

వైమానిక కాల్పుల కారణంగా కరాచీలో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక, మరొక యువకుడు మరణించారని రెస్క్యూ అధికారులు పాకిస్తాన్ జియో న్యూస్‌కు తెలిపారు. నగరం అంతటా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో 64 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్‌లలో వైమానిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులకు, ప్రైవేట్ వైద్య కేంద్రాలకు పోలీసులు తరలించారు.  వైమానిక కాల్పులకు పాల్పడినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement