దుబాయ్‌లో పాకిస్తాన్‌కు ఘోర అవమానం 

Pakistanis Meltdown Burj Khalifa Not Display Flag on Independence Day - Sakshi

దుబాయ్: ఏదైనా దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటే వారికి శుభాకాంక్షలు చెబుతూ బుర్జ్ ఖలీఫాపై ఆ దేశపతాకాన్ని గౌరవ ప్రదర్శనగా లైట్లతో ప్రదర్శించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ఆవిష్కృతమైంది. భారత దేశానికి ఒక రోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న పాకిస్తాన్ తమ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను అక్కడ ఆవిష్కరించలేదు. నిరాశ చెందిన పాకిస్తానీయులు దుబాయ్ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.           

ఆగస్టు 15, భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్న వేళ దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై లైట్ల వెలుగు జిలుగులతో భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ అంతకు ముందు రోజున భారతదేశం లాగే పాకిస్తాన్ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను ఆవిష్కరించలేదు. 

దీంతో నిరాశ చెందిన పాకిస్తానీయులు బుర్జ్ ఖళీఫా అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేళా సంఖ్యలో వచ్చి బుర్జ్ ఖలీఫా వద్ద గుమికూడిన పాకిస్తాన్ దేశీయులు 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. ఇప్పుడు సమయం 12.01, కానీ బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండాను ఆవిష్కరించడం లేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఇప్పుడిది మాకు పరువు సమస్యగా మారింది. 

అక్కడితో ఆగకుండా వేలాది సంఖ్యలో పాకిస్తానీయులు ఇక్కడ చేరి నినదిస్తున్నారు.. అయినా కూడా వారు పట్టించుకోవడంలేదు. ఇది పాకిస్తాన్ దేశాన్ని అవమానించడమేనని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top