ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని

Aug 15 2023 1:22 AM | Updated on Aug 15 2023 7:38 AM

పుష్పావతి - Sakshi

పుష్పావతి

సాక్షి, బళ్లారి: నేడు ఢిల్లీలోని ఎర్రకోటపై జరగనున్న 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఓ సామాన్య మహిళకు అవకాశం దక్కింది. కర్ణాటకలోని హావేరి జిల్లాకు చెందిన పుష్పావతి సోమప్ప అనే మహిళ రాణిబెన్నూరు తాలూకా చిక్కకురువత్తి గ్రామ పంచాయతీలో నీరుగంటి(వాటర్‌ఉమెన్‌)గా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది.

భర్త సోమప్ప గతంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో ఆ ఉద్యోగం భార్య పుష్పావతికి దక్కింది. పుష్పావతి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు బెంగళూరు కూడా చూడలేదన్నారు. ప్రస్తుతం విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు తనకు పిలుపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement