పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ ఆర్జేడీలో విస్త్రత చీలికను తెచ్చిపెట్టింది. ప్రధానంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు.
లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మీ రాగిణి, చంద్రలు ఆ కుటుంబాన్ని వీడారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వయల్దేరివెళ్లిపోయారు. రోహిణి శనివారం(నవంబర్ 15వ తేదీ) నాడు కుటుంబాన్ని వీడి వెళ్లిపోగా, ఇప్పుడు మరో ముగ్గురు కూతుళ్లు పట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది.
ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపదాదుతో పాటు, ఇప్పుడు కూతుళ్లు ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్లిపోవడం లాలూను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఒకప్పుడు బిహార్‌లో ప్రధాన రాజకీయ కేంద్రంగా వెలిగిన లాలూ ఇల్లు.. ఇప్పుడు బోసిపోయింది. ప్రస్తుతం లాలూ వెంట పెద్ద కూతురు మీసా భారతి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది,.
లాలూ-రబ్రీదేవిల సంతానంలోమీసా భారతి పెద్ద కుమార్త కాగా, రోహిణి, చంద్ర, రాగిణి యాదవ్, హేమా యాదవ్, అనుష్కా రావు(ధన్ను), రాజ్యలక్ష్మీలు మిగతా కుమార్తెలు. కాగా, తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌లు కుమారులు. వీరిద్దరూ బిహార్ రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. ఇందులో తేజస్వి యాదవ్ ఆర్జేడీలోనే కొనసాగుతుండగా, తేజ్‌ప్రతాప్ యాదవ్ మాత్రం జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి వేరి కుంపటి పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.


