
చూస్తుండగానే వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం లాగే ఈసారి కూడా వరుసగా మూడు రోజులు రావడం సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు కూలీ, వార్-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది.
మరోవైపు ఈ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం, ఆ తర్వాత శ్రీ కృష్ణ జన్మాష్టమి, సండే సెలవులు కావడంతో ఓటీటీ ప్రియులు సైతం చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వారంలో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఒక్క రోజే సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్లో కాజోల్ నటించిన మా, అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ డ్రామా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సూపర్ మ్యాన్ హాలీవుడ్ మూవీ, పలు వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమా ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో చూసేయండి మరి.
నెట్‌ఫ్లిక్స్
రోల్ మోడల్స్(మూవీ)- ఆగస్టు 15
అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్) సీజన్-7- ఆగస్టు 15
ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15
సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)-ఆగస్టు 15
లవ్ ఈజ్ బ్లైండ్ యూకే(సీజన్-2)- ఆగస్టు 15
సాంగ్స్ ఫ్రమ్ ది హోల్(మూవీ)- ఆగస్టు 15
ఫిక్స్డ్(మూవీ)- ఆగస్టు 15
ఫిట్ ఫర్ టీవీ(రియాలిటీ షో)- ఆగస్టు 15
మిస్ గవర్నర్- (సీజన్-1)- ఆగస్టు 15
ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15
ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15
మా(హిందీ మూవీ)- ఆగస్టు 15
అమెజాన్ ప్రైమ్
సూపర్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 15
ఎంఎక్స్ ప్లేయర్
సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్- ఆగస్టు 15
జియో హాట్‌స్టార్
కృష్ణ కో లవ్ స్టోరీ(మూవీ)- ఆగస్టు 15
మోజావే డైమండ్స్ (మూవీ)- ఆగస్టు 15
బ్యూటీఫుల్ డిజాస్టర్ (మూవీ)- ఆగస్టు 15
ఏలియన్ ఎర్త్ (మూవీ)- ఆగస్టు 15
లిమిట్‌లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15
బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17
జీ5
జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15
సన్ నెక్స్ట్..
గుడ్ డే-(తమిళ మూవీ) ఆగస్టు-15
గ్యాంబ్లర్స్ (తమిళ మూవీ)- ఆగస్టు 15
అక్కేనామ్ (తమిళ మూవీ)- ఆగస్టు 15
ఆహా తమిళం..
యాదుమ్ అరియాన్- ఆగస్టు 15
మూవీ సెయింట్స్
కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15
ఆపిల్ ప్లస్ టీవీ
స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15