
బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రూనై తెలుగు సంఘం, గర్వంగా పాల్గొంది.
ఈ వేడుకల్లో సంఘానికి చెందిన పిల్లలు దేశభక్తి గీతాలకు నృత్యాలు, భారత మాత వేషధారణ, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భారత హైకమిషనర్ శ్రీ రాము అబ్బగాని గారు భారత గౌరవనీయ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని వాచించారు మరియు కొత్తగా ప్రారంభించిన భారత హైకమిషన్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట రమణ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు: ఈ చారిత్రాత్మక వేడుకలో భాగం కావడం మా గర్వకారణం. ఇది మన చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, భారతదేశం మరియు బ్రూనై దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. భారతీయ సాంస్కృతిక సంపదను విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలలో బ్రూనై తెలుగు సంఘం చురుకుగా పాల్గొంటూనే ఉందని తెలిపారు.