వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్‌ అవ్వాల్సిందే..

Chandrababu Naidu Tongue Slip on Independence Day Speech - Sakshi

సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. సోమవారం అమరావతిలో చంద్రబాబు పలుమార్లు తడబడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బాబు ప్రసంగంలో పొరపాట్లను గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయిందని తప్పుగా వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఆయన మాటల్లో తప్పులను ఇంకా గమనిస్తే.. కరోనా వచ్చినపుడు అందరూ లాక్‌డౌన్‌ పెట్టారు. కానీ కరోనాను కూడా లెక్క పెట్టుకోకుండా అంటూ మరోసారి టంగ్‌స్లిప్‌ అయ్యారు. ఇక దైనందిన కార్యక్రమాలు అని పలకాల్సిన చోట దైనందిక అంటూ.. గోదావరి నదిలో నీళ్లు చెప్పాల్సిన చోట గంగానదిలో నీరు అని అన్నారు. తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పాల్సిన చోట తెలుగు జాతికి కారణం అంటూ ప్రసంగించారు. చివరికి చంద్రబాబు ప్రసంగం ముగిశాక తెలుగు తమ్ముళ్లు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: (టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడు?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top