బాలీవుడ్‌ తారలు.. నిజ జీవితంలో సైనికులు.. | Independence 2025: Here Is A List Of Celebrities Who Served In The Army | Sakshi
Sakshi News home page

ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీలు వీళ్లే! మేజర్‌గా.. యుద్ధంలోనూ పాల్గొని..

Aug 15 2025 11:11 AM | Updated on Aug 15 2025 11:54 AM

Independence 2025: Here Is A List Of Celebrities Who Served In The Army

పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్‌ హీరో అనిపించుకున్న తారలకు సెల్యూట్‌ చేద్దాం..

కెప్టెన్‌ రాజు
80's, 90'sలో విలన్‌గా రాణించిన కెప్టెన్‌ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్‌గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.

సునీల్‌ శెట్టి
సునీల్‌ శెట్టి సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఆర్మీలో సేవలందించారు.

నానా పటేకర్‌
నానాపటేకర్‌ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు.

సంజయ్‌ దత్‌
1947లో జరిగిన ఇండో పాక్‌ యుద్ధంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ పాల్గొన్నాడు.

అచ్యుత్‌ పోట్‌దార్‌
నటుడు అచ్యుత్‌ చదువు పూర్తవగానే ఆర్మీలో చేరారు. ఆ తర్వాత సినిమాల్లో రంగప్రవేశం చేశారు.

బిక్రంజీత్‌ కన్వర్‌పాల్‌
బిక్రంజీత్‌ నటుడు కాకముందు ఒక జవాన్‌.. మేజర్‌గా ఉన్నప్పుడే ఆర్మీ నుంచి వైదొలిగారు.

గుఫి పైంటల్‌
మహాభారతం సీరియల్‌లో శకునిగా నటించిన గుఫి ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. భారత్‌-చైనా సరిహద్దులో జవాన్‌గా విధులు నిర్వర్తించారు.

మహ్మద్‌ అలీ షా
తండ్రి బాటలోనే నడుస్తూ అలీ షా కూడా సైన్యంలో చేరాడు. ఆర్మీలో మేజర్‌గా పని చేశారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.

రుద్రశిష్‌ ముజందార్‌
చిచోరే, జెర్సీ ఫేమ్‌ రుద్రశిష్‌ ముజందార్‌ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్‌గా ఉన్నప్పుడే రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు.

మనోజ్‌ బాజ్‌పాయ్‌
సత్య నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee)కు ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్‌గా నటించాడు.

చదవండి: ‘కూలీ’ కంటే ‘వార్‌ 2’కే తక్కువ కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement