
Independence Day 2025 Inspiring Quotes: ఆగస్టు 15న దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం చేయనున్నారు. భరతమాత స్వేచ్ఛకోసం ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారు. వారి అమరత్వాన్ని, మరెందో త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ సమరయోధులు చెప్పిన గొప్ప సూక్తులను, నినాదాలను మననం చేసుకుందాం.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తులు, స్వాతంత్య్రం గురించి వారు చెప్పిన కొన్ని అభిప్రాయాలు
బాలగంగాధర్ తిలక్ : ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను.’
మహాత్మా గాంధీ: స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం కాదు, ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం కూడా.
జవహర్‌లాల్ నెహ్రూ: ‘స్వాతంత్య్రం అనేది ఒక అవకాశం, ఒక బాధ్యత. మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి.’
సర్దార్ వల్లభాయ్ పటేల్: ‘ఒకే దేశంగా ఉండాలంటే ఐక్యత ముఖ్యం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఐక్యతను కాపాడు కోవాలి.’
సుభాష్ చంద్ర బోస్: ‘మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను.’
రాజగోపాలాచారి: ‘స్వాతంత్య్రం అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవడం, మన విధి విధానాలను మనమే నిర్ణయించు కోవడం.’
భగత్ సింగ్: ‘నా జీవితం దేశం కోసం, నా మరణం కూడా దేశం కోసమే. నా మరణం తర్వాత కూడా నా ఆశయం బ్రతికే ఉంటుంది.’
జైహింద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదం ఇప్పటికీ ప్రతి భారతీయుడి పెదవులపై ఉంటుంది.
వందేమాతరం : బంకించంద్ర ఛటర్జీ
రాంప్రసాద్ బిస్మిల్ : స్వాతంత్య్రం కోరిక ఇప్పుడు మన గుండెల్లో ఉంది, ఆ పక్క ఎంత బలం ఉందో చూడండి.
చంద్రశేఖర్ ఆజాద్ : శత్రువుల తూటాలను ఎదుర్కొంటాం, మనం స్వేచ్ఛగా ఉంటాం.
భగత్ సింగ్ : బాంబులు, తుపాకులు విప్లవాన్ని తీసుకురావు, విప్లవ ఖడ్గానికి ఆలోచనల అంచున పదును పెడతారు -
లాల్ బహదూర్ శాస్త్రి : త్రివర్ణ పతాకం మనకు గర్వకారణం, భారతీయులకు గర్వకారణం.జై జవాన్ జై కిసాన్ -
నేతాజీ సుభాష్ చంద్రబోస్: ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత, వెయ్యి జీవితాల్లో అవతరించుతుంది.