శ్రీ సత్యసాయి బాబా సూక్తులు | Quotes of Bhagavan Sri Sathya Sai Baba | Sakshi
Sakshi News home page

శ్రీ సత్యసాయి బాబా సూక్తులు

Nov 23 2025 6:41 AM | Updated on Nov 23 2025 6:41 AM

Quotes of Bhagavan Sri Sathya Sai Baba

→ ఆశలకోసం కాదు, ఆశయాలకోసం జీవించు
→ నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలని ఆశిస్తావో ముందు నీవు వారిని ఆ రీతిగా గౌరవించు.
→ అతి భాష మతిహాని, మితభాష అతిహాయి
→ సత్యం నా ప్రచారం, ధర్మం నా ఆచారం, శాంతి నా స్వభావం, ప్రేమ నా స్వరూపం.
→ ప్రార్థించే పెదవులకన్న సేవచేసే చేతులు మిన్న
→ గ్రామసేవే రామ సేవ, జనసేవే జనార్దన సేవ
→ హరికి దాసులు కండి, సిరికి కాదు.
→ విద్య జీవిత పరమావధికే గానీ జీవనోపాధికి కాదు
→ భక్తి అనేది దేవుని కోసం కన్నీరు పెట్టడం కాదు, దేవుని సంతోషం కోసం జీవించడం.
→ భక్తి అంటే నిరంతర ప్రేమ, ప్రతిఫలం ఆశించని ప్రేమ.
→ నా భక్తుల ప్రేమే నాకు ఆహారం, వారి సంతోషమే నా శ్వాస.
→ నీ దినచర్యను ప్రేమతో ప్రారంభించు, ప్రేమతో నింపు, ప్రేమతో అంత్యం గావించు. దైవ సన్నిధికి మార్గం ఇదే.
→ ప్రేమే నా స్వరూపం, సత్యమే నా శ్వాస, ఆనందమే నా ఆహారం.
→ ఉన్నది ఒకే కులం – మానవ కులం. ఉన్నది ఒకే మతం –ప్రేమమతం. ఉన్నది ఒకే భాష – హృదయ భాష. ఉన్నది ఒకటే దైవం – ఆయన సర్వాంతర్యామి.
→ భగవంతుడు బాహ్యప్రియుడు కాదు. భావ ప్రియుడు
→ మతులు  మంచివైతే అన్ని మతములూ మంచివే.
→ భగవంతుడు నీ మతమును చూడడు, నీ మతిని చూస్తాడు.
→ ప్రేమతో ‘సాయీ’ అని పిలిస్తే ‘ఓయీ’ అని పలుకుతాను
→ నా జీవితమే నా సందేశం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement