breaking news
Sathya Sai
-
శ్రీ సత్యసాయి బాబా సూక్తులు
→ ఆశలకోసం కాదు, ఆశయాలకోసం జీవించు→ నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలని ఆశిస్తావో ముందు నీవు వారిని ఆ రీతిగా గౌరవించు.→ అతి భాష మతిహాని, మితభాష అతిహాయి→ సత్యం నా ప్రచారం, ధర్మం నా ఆచారం, శాంతి నా స్వభావం, ప్రేమ నా స్వరూపం.→ ప్రార్థించే పెదవులకన్న సేవచేసే చేతులు మిన్న→ గ్రామసేవే రామ సేవ, జనసేవే జనార్దన సేవ→ హరికి దాసులు కండి, సిరికి కాదు.→ విద్య జీవిత పరమావధికే గానీ జీవనోపాధికి కాదు→ భక్తి అనేది దేవుని కోసం కన్నీరు పెట్టడం కాదు, దేవుని సంతోషం కోసం జీవించడం.→ భక్తి అంటే నిరంతర ప్రేమ, ప్రతిఫలం ఆశించని ప్రేమ.→ నా భక్తుల ప్రేమే నాకు ఆహారం, వారి సంతోషమే నా శ్వాస.→ నీ దినచర్యను ప్రేమతో ప్రారంభించు, ప్రేమతో నింపు, ప్రేమతో అంత్యం గావించు. దైవ సన్నిధికి మార్గం ఇదే.→ ప్రేమే నా స్వరూపం, సత్యమే నా శ్వాస, ఆనందమే నా ఆహారం.→ ఉన్నది ఒకే కులం – మానవ కులం. ఉన్నది ఒకే మతం –ప్రేమమతం. ఉన్నది ఒకే భాష – హృదయ భాష. ఉన్నది ఒకటే దైవం – ఆయన సర్వాంతర్యామి.→ భగవంతుడు బాహ్యప్రియుడు కాదు. భావ ప్రియుడు→ మతులు మంచివైతే అన్ని మతములూ మంచివే.→ భగవంతుడు నీ మతమును చూడడు, నీ మతిని చూస్తాడు.→ ప్రేమతో ‘సాయీ’ అని పిలిస్తే ‘ఓయీ’ అని పలుకుతాను→ నా జీవితమే నా సందేశం. -
కొనసాగుతున్న బాబా ఆశయాలు
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ç2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్‌లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది. ‘కరోనా’ కాలంలో సేవలు‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్‌లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
సత్యసాయి బోధనలు విశ్వ శాంతికి మార్గదర్శకాలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు, మానవతా విలువలు విశ్వశాంతికి మార్గదర్శకాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. విశ్వశాంతి సాధనకు ప్రతి సాయి భక్తుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శత జయంతి వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరానికి వచ్చారు. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆమె సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అంటూ సత్యసాయి ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకమన్నారు. సత్యసాయి బోధనలు, సేవా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు. సాయి ఇచ్చిన లవ్ ఆల్.. సర్వ్ ఆల్.. నినాదం ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడి పోయిందన్నారు. బాబా బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి మానవతా విలువలు భక్తుల మదిలో పాఠ్యాంశాలుగా నిలిచిపోయాయని తెలిపారు. విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందించిన సత్యసాయి ఎందరో పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారని కొనియాడారు. మహిళా సాధికారతకూ పాటుపడ్డారని, ఇందుకు 1969లో అనంతపురంలో నెలకొల్పిన మహిళా క్యాంపస్ నిదర్శనం అని గుర్తు చేశారు. ఉచిత విద్యతో పాటు నయా పైసా ఖర్చులేని నాణ్యమైన వైద్యం, కరువు ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు అమోఘమన్నారు. ఇదే స్ఫూర్తితో భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలన్నారు. దేశాభివృద్ధిలో ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు, ఎన్జీఓలు, ప్రయివేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సత్యసాయి శత జయంతి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి శత జయంతి వేడుకలలో భాగంగా ప్రపంచ శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 140 దేశాల గూండా పయనించే శాంతి కాగడాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెలిగించారు. సత్యసాయి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి సత్యసాయి బోధనలను ప్రతి ఒక్కరూ అచరించడం ద్వారా ఉత్తమ సమాజాన్ని స్థాపించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి స్ఫూర్తిని ప్రతి సాయి భక్తుడూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి సౌభాగ్యం కోసం సత్యసాయి చేపట్టిన తాగునీరు, ఉచిత వైద్యం, విద్య ప్రాజెక్టులు ఆదర్శనీయమన్నారు. రాబోయే రోజుల్లో సత్యసాయి సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తొలుత ఆర్జే రత్నాకర్ రాజు ప్రారంబోపన్యాసం చేస్తూ సత్యసాయి ట్రస్ట్ చేపట్టిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, డాక్టర్ మోహన్, నాగానంద తదితరులు పాల్గొన్నారు.ముగిసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటనసాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పుట్టపర్తికి వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వీడ్కోలు పలికారు. కాగా, ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన 2వ ‘భారతీయ కళా మహోత్సవం’ప్రారంభించారు. నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్లో జరిగే శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పుట్టపర్తి వెళ్లేందుకు సీఎం రేవంత్ శనివారం రాత్రి బెంగళూరుకు విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఆదివారం ఉదయం పుట్టపర్తికి వెళ్లనున్నారు. -
మంత్రివర్యులూ.. ప్రత్యేక విమానాల్లోనే..
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు సర్కార్‌లో అందరూ ‘ప్రత్యేక’ విమానమే ఎక్కుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో విహరిస్తుండగా..తామేం తక్కువ కాదంటూ మంత్రులూ ఇప్పుడు ప్రజాధనంతో ‘ప్రత్యేక’ బాట పట్టారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో వేసిన కమిటీలో సవిత, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ ఉన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష కోసం మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం పుట్టపర్తికి వచ్చి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. తిరుగు ప్రయాణంలోనూ ప్రత్యేక విమానాన్నే ఉపయోగించారు. కాగా, ప్రత్యేక విమాన ప్రయాణ అవకాశం రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విహరిస్తుండటం గమనార్హం. -
సత్యసాయి జిల్లా మైనర్ బాలిక ఘటనపై సాకే శైలజానాథ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
సత్యసాయి జిల్లాలో అమానుషం.. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి..
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ మండలంలోని మునిమడుగు గ్రామంలో అమానుష ఘటన జరిగింది. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడి పైశాచికంగా ప్రవర్తించారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మడకశిర మండలం బేగార్లపల్లిలో బాలిక కిడ్నాప్
-
తెలంగాణకు మణిహారం.. తెలుగు ప్రజలకు సంజీవని
సాక్షి, సిద్దిపేట: మరణం అంచుకి వెళ్లిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, తెలుగు ప్రజలకు సంజీవనిలా సత్యసాయి ఆస్పత్రి సేవలందిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్, రీసెర్చ్‌లో తొలిసారి గుండె ఆపరేషన్లు జరగ్గా.. శనివారం హరీశ్‌రావు సందర్శించిన అనంతరం మాట్లాడారు. దేశంలో 5వ ఆస్పత్రిని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేయని పనిని సత్యసాయి ట్రస్ట్, మధుసూదన్ సాయి చేస్తున్నారని కొనియాడారు. గుండె ఆపరేషన్ల కోసం రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఉచితంగా సర్జరీలు చేయడం అభినందనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 5.77 లక్షల మందికి ఓపీ, 33,600 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు సర్జరీలు పూర్తి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని కొనియాడారు. మధుసూదన్ సాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమానికి వచి్చనప్పుడు ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2022లో కోరానని, దీంతో స్పందించి 2023లో ఓపీ ప్రారంభించారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో అనుభూతి కంటే గుండె ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందన్నారు.శ్రీసత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట కొండపాకలో యంగ్ అడోల్సెంట్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా.. హరీశ్‌రావు చొరవతో ఇక్కడ గుండె శస్త్రచికిత్సల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కఫొటోతో బాడీ ప్రొఫైల్ వచ్చే విధంగా హెచ్డీ స్టెత్‌తో గుండె పనితీరు తెలుసుకునే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆరు నెలల కిందట తెలిసింది నా బిడ్డ పేరు రక్ష. వయసు పదేళ్లు. ఆర్నెల్ల కిందట నిలోఫర్‌లో డాక్టర్లు పరిశీలించి గుండెలో హోల్ ఉందని చెప్పారు. బయట ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు అవుతాయన్నారు. అయితే సిద్దిపేటలో ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేస్తారని నిలోఫర్ డాక్టర్లు చెప్పారు. దీంతో అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ డాక్టర్లకు, ట్రస్ట్‌కు మేము రుణపడి ఉంటాం. నా బిడ్డ కూడా డాక్టర్ అయి ఇలా ఉచితంగా సేవలందిస్తుంది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేంమాది మెదక్ జిల్లా చిన్నశంకరంపే ట. మెకానిక్ గా పని చేస్తా. నా బిడ్డ వయసు ఆరేళ్లు. దగ్గు, జలుబు, వాంతులు అయ్యా యి. అప్పుడు వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. వారు చూసి గుండె స్పీడ్ గా కొ ట్టుకుంటోంది అని చెప్పారు. దీంతో నిమ్స్, నిలోఫర్ ఆ స్పత్రులు తిరిగాం. ఇక్కడ ఫ్రీగా చేస్తారని తెలిసింది వెంటనే వచ్చాం. నా బిడ్డకు పునర్జన్మనిచి్చన డాక్టర్లు, ట్రస్ట్ వారికి ఏమిచి్చనా రుణం తీర్చుకోలేం. -
బాలుడిని కిడ్నాప్ చేసి.. ఆస్తి కోసం మేనమామ దారుణం
-
టీడీపీ వర్గీయుల దాష్టీకం.. రైతుకు కోలుకోలేని నష్టం
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయుల దాష్టీకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఓ దళిత రైతు మల్బరీ పంటపై పురుగు మందు పిచికారీ చేసి, అతనికి తీరని నష్టం కలిగించారు. పరిటాల కుటుంబం అండతోనే టీడీపీ వర్గీయులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాధిత రైతు వాపోతున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గరిమేకలపల్లికి చెందిన హరిజన కొల్లప్ప వైఎస్సార్సీపీలో చురుకైన కార్యకర్త. కొల్లప్పకు ఇటీవల పార్టీ సచివాలయ కన్వీనర్ బాధ్యతలు కూడా అప్పగించారు. కొల్లప్ప స్థానికంగా వైఎస్సార్సీపీని మరింతగా పటిష్ట పరచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు రెండెకరాల్లో అతను సాగు చేస్తున్న మల్బరీ పంటపై శనివారం పురుగు మందు పిచికారీ చేశారు. మూడు రోజుల్లో పట్టు గూళ్ల ఉత్పత్తి మొదలవుతుందనగా ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం పట్టు పురుగులు చనిపోయి ఉండడంతో కొల్లప్ప తోటను పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర జరిగిన సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. రామగిరి ఎస్ఐ జనార్ధన్ నాయుడు ఆదివారం బాధిత రైతు మల్బరీ తోటను పరిశీలించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్: కల చెదిరె..కడుపుకోత మిగిలే!
స్టెత్ వేసుకోవాల్సిన వాడు... మెడకు తాడు బిగించుకున్నాడు ఆస్పత్రిలో ఉండాల్సిన వాడు మార్చురీలో పడుకున్నాడు తెల్లకోటులో ఉండాల్సిన వాడు.. తెల్లగుడ్డలో దూరిపోయాడు అల్లారుముద్దుగా పెంచితే అందనంత దూరం పోయాడు తండ్రి పోగుపోగునూ కలుపుతూ బంధం అల్లుతుంటే తనేమో బంధం తెంపుకుని వెళ్లిపోయాడు గాయానికి కట్టుకట్టాల్సిన వాడు... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు జీవితమనే పరీక్షలో ఫెయిలై ఉరితాడుకు వేలాడాడు ధర్మవరం అర్బన్: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ధర్మవరం పట్టణం తారకరామాపురంలో బుధవారం చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తారకరామాపురానికి చెందిన రామాంజనేయులు, రాజమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించే రామాంజనేయులు ఆడ పిల్లలిద్దరికీ వివాహాలు జరిపించాడు. చిన్న కుమారుడైన ముక్తాపురం నవీన్‌కుమార్ (23)ను వైద్యుడిగా చూడాలని కలలు కనేవాడు. ఈక్రమంలోనే ఖర్చుకు వెనకాడకుండా కుమారుడిని చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే ఇంటర్, నీట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రాశారు. అయితే ఇటీవల వచ్చిన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీన్ని నవీన్‌కుమార్ అవమానంగా భావించాడు. తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పలేక మదనపడ్డాడు. ఉగాది పండుగ నేపథ్యంలో మంగళవారం ధర్మవరానికి వచ్చిన నవీన్‌కుమార్...రాత్రి తల్లిదండ్రులతో కులాసాగా కబుర్లు చెప్పాడు. అనంతరం తండ్రి రామాంజనేయులు వద్దే పడుకున్న నవీన్‌కుమార్... అందరూ నిద్రపోయాక ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులోని ఇనుపరాడ్డుకు ఉరివేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన తండ్రి పక్కలో ఉండాల్సిన కుమారుడు కనిపించకపోవడంతో బయటకు వెళ్లి చూశాడు. అప్పటికే కసువు ఊడ్చేందుకు షెడ్డులోకి వెళ్లిన రాజమ్మ ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో రామాంజనేయులు కూడా పరుగున వెళ్లి ఇరుగూ పొరుగు సాయంతో కుమారుడిని కిందకు దించి చూడగా, అప్పటికే నవీన్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. వైద్యుడిగా చూడాలన్న కలను... కల్లలు చేసి వెళ్లిపోయావా అంటూ రామాంజనేయులు ఏడుస్తుంటే అతన్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న టూటౌన్ ఏఎస్ఐ డోణాసింగ్, జమేదార్ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉగాది రోజున ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం: హైవే ప్రాజెక్టుల హైస్పీడ్‌లో భూసేకరణ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలను కలపడంతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లాలో 1,452 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 623 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికే అనంతపురం జిల్లాలో 312 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించింది. శ్రీసత్యసాయి జిల్లాలో 216 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా ముందుకెళుతున్నారు. రోడ్లతో పాటు పలు ప్రాంతాల్లో వంతెనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులు మొత్తం 2024 సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ జరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల వివరాలు.. = ఉరవకొండ – అనంతపురం – కదిరి – మదనపల్లి – కుప్పం – కృష్ణగిరి వరకూ మొత్తం 197 కిలోమీటర్ల రోడ్డుకు సేకరణ పూర్తి చేయనున్నారు. = ధార్వాడ్ – హుబ్లి – గదగ్ –కొప్పలæ – హొసపేటె– బళ్లారి – గుత్తి – తాడిపత్రి – ముద్దనూరు – మైదుకూరు – బద్వేల్ – ఆత్మకూరు – నెల్లూరు – కృష్ణపట్నం వరకూ జాతీయ రహదారి–67లో మొత్తం 118 కిలోమీటర్లు చేపడుతున్నారు. = అనంతపురం – తాడిపత్రి – బనగానపల్లి – గాజులపల్లి – గిద్దలూరు – కంభం – వినుకొండ – నరసరావుపేట – గుంటూరు వరకూ జాతీయ రహదారి 544డీలో భాగంగా భూ సేకరణ చేపడుతున్నారు. = కొడికొండ – లేపాక్షి – హిందూపురం – మడకశిర వరకూ 544ఈ జాతీయ రహదారిలో 102 కిలోమీటర్ల రోడ్డు చేపడుతున్నారు. = ముదిగుబ్బ జంక్షన్ ఏర్పాటు చేస్తూ కనెక్టింగ్ ఏర్పాటులో భాగంగా పుట్టపర్తి మీదుగా ఎన్‌హెచ్–44లో కోడూరు వద్ద కలుపుతారు. = జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 716లో ముద్దనూరు – పులివెందుల – కదిరి – ఓబుళదేవర చెరువు – గోరంట్ల – పాలసముద్రం క్రాస్ నుంచి హిందూపురం ఎన్‌హెచ్ 544ఈకి అనుసంధానిస్తారు. వేగంగా భూసేకరణ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఏర్పాటవుతున్న పలు జాతీయ రహదారులకు భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలామటుకు పూర్తిచేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. కొంత అటవీ భూములను కూడా డైవర్షన్ చేశారు. –మధుసూదన్‌రావు, ఈఈ, జాతీయ రహదారులు -
ఇక ఉచితంగా బాలల గుండె శస్త్ర చికిత్సలు
కొండపాక(గజ్వేల్): ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు అందించేందుకు నెలకొల్పిన బాలల శస్త్ర చికిత్స పరిశోధనాస్పత్రి అపర సంజీవనిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రిని సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందమంది పిల్లల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకోవడం కంటే సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందేలా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రూ.50 కోట్లతో 100 పడకలు, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంత పేద పిల్లలకు వైద్యాలయం ద్వారా గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తామన్నారు. నవంబరు 23 రోజున సత్యసాయి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైద్యాలయ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, సిద్దిపేట జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పర్యటన.. మద్యానికి ఎగబడ్డ ‘తమ్ముళ్లు’
సాక్షి, చెన్నేకొత్తపల్లి(శ్రీ సత్యసాయి): ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటనకు జనాలను తరలించేందుకు టీడీపీ నాయకులు నానా తంటాలు పడ్డారు. పచ్చ కండువా వేసుకుని వస్తే మద్యంతో పాటు డబ్బు అందజేస్తామని జనాన్ని నమ్మించి మండల కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే జనాలు రాకపోవడంతో చివరకు ధర్మవరం నియోజకవర్గం నుంచి తరలించారు. ఈ క్రమంలో స్థానిక దుకాణం వద్ద వాహనాలను ఆపగానే మద్యం కోసం తెలుగు తమ్ముళ్లు ఎగబడ్డారు. హంగామాపై జనాగ్రహం.. సోమందేపల్లి: చంద్రబాబు పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో కార్యకర్తులు రోడ్డుపై హంగామా సృష్టించారు. దీంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు, ప్రయాణికులు, అసహనం వ్యక్తం చేశారు. పలువురు ఎన్‌హెచ్ ట్రోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ట్రాఫిక్ జామ్ కావడం పై ఫిర్యాదు చేశారు. రెండు అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నా.. టీడీపీ కార్యకర్తలు స్పందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఈ హంగామా ఏమిటంటూ మండిపడ్డారు. చదవండి: Monkey Selfie: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి.. -
లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా?
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్ చేయించారు. చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే.. అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్‌రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది. కుటుంబానికి చెడ్డపేరు రాకుండా.. రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్‌రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు. కందికుంట తీరుపై ప్రజల అసహనం లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
మీలోనే దైవం ఉన్నాడు
నవంబర్ 22 సత్యసాయి జయంతి మానవసేవే మాధవ సేవ, గ్రామసేవే రామసేవ, పల్లెసేవే పరమాత్ముని సేవ అని యావత్ప్రపంచానికి చాటిచెప్పిన దార్శనికుడాయన. ‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అనే ప్రబోధంతో తన భక్తులందరినీ ఏకతాటిపై నడిపించిన భగవత్స్వరూపుడాయన. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలనే ఆదర్శాన్ని తాను ఆచరించి, తన భక్తులతో ఆచరింప చేసిన పరమాత్ముడాయన. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. నవంబర్ 22న ఆయన జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మంచి మాటలను మరోసారి మననం చేసుకుందాం... ఒకటే మతం ఉంది. అదే ప్రేమ మతం. భాష ఒకటే ఉంది. అదే హృదయ భాష. ఒకే కులం.... అదే మానవత. ఒకే న్యాయం- అదే కర్మ అనేది. ఒకే దేవుడు. ఆయన ఒక్కడేశక్తిమంతుడు. మీ దినచర్యను ప్రేమతో ప్రారంభించండి. రోజంతా ప్రేమగానే గడపండి. మీరు చేసే ప్రతి పనినీ ప్రేమగా చెయ్యండి. దినచర్యను ముగించడం కూడా ప్రేమగా ముగించండి. మన ఆలోచనల్లో ప్రేమ ఉంటే అవి నిజమైన ఆలోచనలు. మనం చేసే పని పట్ల ప్రేమ ఉంటే దానిని మించిన ఉత్తమ ప్రవర్తన మరొకటి లేదు. ఎవరినైనా ప్రేమగా అర్థం చేసుకోవడానికి మించిన శాంతం లేదు. అందరిపట్లా ప్రేమ భావను కలిగి ఉండటాన్ని మించిన అహింస మరొకటి లేదు. అసలు ప్రతివారితోనూ ప్రేమగా మసిలేవాడికి హింసతో పనేముంది? మతాలన్నీ భగవంతుని చేరుకునే మార్గాన్ని దర్శింప చేసేవే కాబట్టి అన్ని మతాలనూ గౌరవించు. మన కంటికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేనట్లు కాదు. నువ్వు చూసే వెలుగు భగవంతునిదే. నువ్వు దేవుని గురించి విననంత మాత్రాన ఆయన లేనట్లుకాదు. ఎందుకంటే నువ్వు వినే ప్రతి శబ్దమూ దైవం చేసే శబ్దమే. దేవుడు ఎవరో నీకు తెలియక పోతే ఆయన లేడని కాదు, ఈ క్షణంలో నువ్వు ఆలోచిస్తున్నావంటే, వింటున్నావంటే, చూస్తున్నావంటే, జీవించి ఉన్నావంటే భగవంతుడు ఉన్నట్లే. ఆయన వల్లనే నీవు ఏ పనినైనా చేయగలుగుతున్నావు. నువ్వు చేసే పనిని ఎవరూ చూడటం లేదనుకోవడానికి మించిన అవివేకం మరొకటి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన వెయ్యి కనులతో నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటాడు. నిస్వార్థ బుద్ధితో నువ్వు చేసే ప్రతి పనినీ భగవంతుడు ఇష్టపడతాడు. ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు. నువ్వు వండే వంటను ప్రేమభావనతో చేస్తే ఆ వంట కచ్చితంగా రుచిగా ఉంటుంది. అన్నింటినీ సహనంతో భరించు, ప్రత్యపకారం చేయనే వద్దు. నీపై వేసే ప్రతి నిందనూ మౌనంగా విను. నీ వద్ద ఉన్నదానిని ఇతరులతో పంచుకో.భగవంతుని కృప బీమా రక్షణ వంటిది. ఆయనను ఎప్పటికీ మరచి పోకుండా ప్రతి క్షణం సేవిస్తూ ఉండు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు అంతులేనంతటి రక్షణను, భద్రతను కల్పిస్తాడు. ప్రేమతో చేసే పనికి మించిన సత్ప్రవర్తన లేదు. ప్రేమతో మాట్లాడు. ప్రేమగా ఆలోచించు. ఫలితం అనుకూలంగా ఉంటుంది. నిన్ను వంచించిన నిన్న వెళ్లిపోయింది. రేపు... వస్తుందో రాదో తెలియని అతిథి వంటిది. నేడు... నీ ముందున్న ప్రాణస్నేహితుడు. కాబట్టి నేటిని జాగ్రత్తగా కాపాడుకో. నీ దగ్గర ఉన్నది నీ సంపద కాదు. ఇతరులకు పంచినప్పుడే అది నీదవుతుంది. నీ హృదయం సుందరంగా ఉంటే శీలం బాగుంటుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనీ అందంగా ఉంటుంది.మౌన ం మీ జన్మహక్కు. దీనిలో నుంచి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పసిపిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. పెరిగి పెద్దవుతున్నకొద్దీ ఆ పసిముఖంలో ఆనందం తగ్గుతూ పోతుంది. అందుకే మౌనంగా ఉండి మీలో నింపిన వ్యర్థపదార్థాలను బయటకు నెట్టెయ్యండి. తద్వారా మహత్తరమైన ఆత్మశక్తి అందుతుంది. అప్పుడు అంతులేనంతటి ఆనందాన్ని అనుభవించగలుగుతారు. పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువై పొంగుతూ ఉంటుంది. అందుకనే ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని అనుభవించండి, మీలోని దైవాన్ని కనుగొనండి. - డి.వి.ఆర్ -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ప్రశాంతినిలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. సాయంత్రం విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీలో భాగంగా సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు. సత్యసాయి చిత్రపటాన్ని జోలలో ఉంచి ఊపుతూ భక్తి గీతాలాపన చేశారు. కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బృందం సంగీత కచేరీ నిర్వహించింది. మధుర స్వరాలొలికిస్తూ భక్తులను అలరించింది. మంగళహారతితో జయంతి వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో ‘నారాయణ సేవ’ నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఓంశాంతి సంస్థ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో ప్రపంచ శాంతి సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను స్థానిక శివాలయం వద్ద రాష్ట్ర ఉపముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. 108 శివలింగాకృతులను పుట్టపర్తిలో ఊరేగించారు. నవధాన్య, నవరత్న నిర్మిత శివలింగాలను సైతం ఊరేగించారు. -
పుటపర్తిలో ఘనంగా సత్యసాయిబాబా వేడుకలు
అనంతపురం:పుటపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి ట్రస్ట్ వార్షిక నివేదికను కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా విడుదల చేయగా, రూ.80 కోట్లతో చేపట్టిన సత్యసాయి తాగునీటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 128 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. శనివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్నిపుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. -
కన్నుల పండుగ
ఘనంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం పుట్టపర్తి టౌన్ : సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్ని శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. ఉదయం 10.35 గంటలకు విద్యార్థుల బ్రాస్‌బ్యాండ్ వాయిద్యం నడుమ యూనివర్సిటీ బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్, అకడమిక్ కౌన్సిల్ బృందాన్ని, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలను, ముఖ్య అతిథి కస్తూరి రంగన్‌ను యజుర్ మందిరం నుంచి స్నాతకోత్సవ వేదికైన సాయికుల్వంత్ సభామందిరానికి తీసుకొచ్చారు. 10.45కు యూనివర్సిటీవిద్యార్థులు వేదపఠనం గావించారు. 10.48కి వైస్ ఛాన్సలర్ శశిధర్ ప్రసాద్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీ వ్యవస్థాపక కులపతి అయిన సత్యసాయిని ప్రార్థించారు. ‘నేను ప్రారంభిస్తున్నాను’ అంటూ సత్యసాయి వాణిని డిజిటల్ స్క్రీన్ల ద్వారా వినిపించారు. అనంతరం వీసీ శశిధర్ ప్రసాద్ యూనివర్సిటీ విద్యావిధానం, ఛాన్సలర్ జస్టిస్ వెంకటాచలయ్య, ముఖ్యఅతిథి కస్తూరి రంగన్ల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రశాంతి నిలయం, ముద్దనహళ్లి, బృందావన్, అనంతపురం క్యాంపస్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ఏడుగురు పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ఛాన్సలర్ విశ్రాంత జస్టిస్ వెంకటాచలయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. ‘తాము ఆర్జించిన జ్ఞానంతో సత్కర్మలను అచరిస్తామం’టూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథి కస్తూరి రంగన్ ఉపన్యసించారు. విలువలతో కూడిన సనాతన విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పడం గర్వించదగ్గ విషయమన్నారు. 21వ శతాబ్దపు సమాజ అవసరాలకు అనుగుణంగా సత్యసాయి విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరించారు. విద్యావంతులైన యువత నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు మూలమైన పరిశోధనల వైపు విద్యార్థులను తీసుకెళ్లాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందని అభిప్రాయపడ్డారు. మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. జాతీయ గీతాలాపనతో స్నాతకోత్సవం ముగిసింది. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, మద్రాస్ శ్రీనివాస్, నాగానంద, ఎస్వీ గిరి, టీకేకే భగవత్, ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్ రావు, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, జేఎన్టీయూ(ఏ) వైస్ ఛాన్సలర్ లాల్‌కిశోర్, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, గాయని సుశీల, కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, విశ్రాంత డీజీపీలు హెచ్‌జే దొర, అప్పారావు, ప్రశాంతి నిలయం కౌన్సిల్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
అభాగ్యుల సేవే సాయి తత్వం
‘సత్యసాయి’ జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్ పుట్టపర్తి: అర్థించే అభాగ్యులకు సేవ చేయడమే సత్యసాయి తత్వమని అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్ పేర్కొన్నారు. సత్యసాయి 89వ జయంతి వేడుకలలో భాగంగా మూడవరోజు గురువారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన సభ్యులు సత్యసాయి మహాసమాధి చెంత పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. ఈ సంధర్బంగా నెవెల్లి ఫెడ్రిక్స్ మాట్లాడుతూ సత్యసాయి భోదించిన ప్రేమ, శాంతి, సేవా మార్గాలు మానవాళిని శాంతి జీవనం వైపు పయనింప జేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాలలో సత్యసాయి సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు.


