అభాగ్యుల సేవే సాయి తత్వం | ai philosophy abhagyula seve | Sakshi
Sakshi News home page

అభాగ్యుల సేవే సాయి తత్వం

Nov 21 2014 12:52 AM | Updated on Sep 2 2017 4:49 PM

అభాగ్యుల సేవే సాయి తత్వం

అభాగ్యుల సేవే సాయి తత్వం

అర్థించే అభాగ్యులకు సేవ చేయడమే సత్యసాయి తత్వమని అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్ పేర్కొన్నారు.

‘సత్యసాయి’ జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్
 
పుట్టపర్తి: అర్థించే అభాగ్యులకు సేవ చేయడమే సత్యసాయి తత్వమని అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్ పేర్కొన్నారు. సత్యసాయి 89వ జయంతి వేడుకలలో భాగంగా మూడవరోజు గురువారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

వివిధ దేశాలకు చెందిన సభ్యులు సత్యసాయి మహాసమాధి చెంత పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. ఈ సంధర్బంగా నెవెల్లి ఫెడ్రిక్స్ మాట్లాడుతూ సత్యసాయి భోదించిన ప్రేమ, శాంతి, సేవా మార్గాలు మానవాళిని శాంతి జీవనం వైపు పయనింప జేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాలలో సత్యసాయి సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement