చంద్రబాబు పర్యటన.. మద్యానికి ఎగబడ్డ ‘తమ్ముళ్లు’

Chandrababu Naidu Public Meeting Tdp Karyakartha Over Action Anantapur - Sakshi

సాక్షి, చెన్నేకొత్తపల్లి(శ్రీ సత్యసాయి): ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటనకు జనాలను తరలించేందుకు టీడీపీ నాయకులు నానా తంటాలు పడ్డారు. పచ్చ కండువా వేసుకుని వస్తే మద్యంతో పాటు డబ్బు అందజేస్తామని జనాన్ని నమ్మించి మండల కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే జనాలు రాకపోవడంతో చివరకు ధర్మవరం నియోజకవర్గం నుంచి తరలించారు. ఈ క్రమంలో స్థానిక దుకాణం వద్ద వాహనాలను ఆపగానే మద్యం కోసం తెలుగు తమ్ముళ్లు ఎగబడ్డారు.  

హంగామాపై జనాగ్రహం.. 
సోమందేపల్లి: చంద్రబాబు పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో కార్యకర్తులు రోడ్డుపై హంగామా సృష్టించారు. దీంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు, ప్రయాణికులు, అసహనం వ్యక్తం చేశారు. పలువురు ఎన్‌హెచ్‌ ట్రోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి ట్రాఫిక్‌ జామ్‌ కావడం పై ఫిర్యాదు చేశారు. రెండు అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నా.. టీడీపీ కార్యకర్తలు స్పందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఈ హంగామా ఏమిటంటూ మండిపడ్డారు. 

చదవండి: Monkey Selfie: సెల్‌ఫోన్‌ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top