
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నో ఫోన్ అవర్’ అనే సరికొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. నో ఫోన్ అవర్ ఒక సాధారణ ప్రచారం మాత్రమే కాదు.. నేటి అధునాతన జీవనశైలిలో స్వేచ్ఛను అన్వేషించుకునే ఆత్మీయ పిలుపు అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోం అప్లయన్స్ బ్రాండ్ కెన్‌స్టార్ ఆధ్వర్యంలో ఈ ‘నో ఫోన్ అవర్’లో భాగంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆ సమయాన్ని గడపాలని పిలుపునిస్తోంది.
ఇందులో భాగంగా డిజిటల్ ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి, నిజమైన ఆనందాన్ని, అనుబంధాన్ని మళ్లీ ఆస్వాదించేలా కెన్‌స్టార్ ఆహ్వానిస్తోంది. కెన్‌స్టార్ సీఈఓ సునిల్ జైన్ మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరులుగా మన మూలాలను గుర్తుచేసుకుంటూ, ముఖ్యమైన వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.
ఈ డిజిటల్ యుగంలో మనకు వేలాది ఆన్‌లైన్ ఫాలోవర్స్ ఉన్నా, మనుషులతో కలిసుండాలన్న కోరిక ఇంకా బతికే ఉంది. ‘నో ఫోన్ అవర్’ ఆ కోరికను తీర్చగలిగే సరికొత్త ప్రయత్నమని తెలిపారు. ఈ అనుభవాలను సోషల్ మీడియాలో # NoPhoneHour హ్యాష్‌ట్యాగ్‌తో కథలు, వీడియోలు, ఆడియో సందేశాల రూపంలో పంచుకోవాలని పేర్కొన్నారు.
(చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే)