కేజ్రీవాల్‌ జైలు నిబంధనలు ఉల్లంఘన! | Tihar jail official reacts on independence Day Flag Hoisting Row | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ జైలు నిబంధనలు ఉల్లంఘన: తిహార్‌ జైలు అధికారులు

Aug 12 2024 7:08 PM | Updated on Aug 12 2024 8:06 PM

Tihar jail official reacts on independence Day Flag Hoisting Row

ఢిల్లీ: ఢిల్లీ​ లిక్కర్‌ పాలసీ కేసులో తిహార్‌ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సెనాకు లేఖ రాయడాన్ని జైలు అధికారులు తప్పు పట్టారు. జైలు నిబంధనలు ఉల్లంఘించటమేని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయజెండాను ఎగరవేస్తారని తెలుపుతూ సీఎం కేజ్రీవాల్‌ ఎల్జీకి లేఖ రాసినట్లు  తీహార్‌ జైలు అధికారులు తెలిపారు. దీనిపై తిహార్‌ జైలు నంబర్‌ 2, సుపరింటెండెంట్‌ స్పందించారు. 

సీఎం కేజ్రీవాల్‌ ఎల్జీకి లేఖ రాసి ఢిల్లీ జైలు నింబంధనలు-2018ను ఉల్లంఘించారని అ‍న్నారు. ఆయన రాసిన లేఖకు సంబంధించిన సమాచారం మీడియాలో రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనుమతిలేని చర్యలు పాల్పడితే.. జైలులో సీఎంకు ఉన్న అధికారాలను కూడా కుదించాల్సి వస్తుందని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్‌ ఆగస్టు 6వ తేదీన ఎల్జీకి లేఖ రాసినట్లు జైలు అధికారులు నిర్ధారించారు. 

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ  మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం. ఇక. ఈడీ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు ఆయను  బెయిల్‌ మంజూరు చేసింది. అయితే  ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ఆరెస్ట్ చేయగా ఆయన ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. మరోవైపు.. అరవింద్‌ కేజ్రీవాల్‌ రాసిన లేఖ తమకు చేరలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొనటం గమనార్హం​. ఇదిలా ఉండగా..​  స్వాతంత్ర్య దినోత్సవం (అగస్టు15) సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారని పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌  వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఓ  ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement