Delhi Liquor Scam
-
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్‌పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్‌పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చింది.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే, తాను బీజేపీ ఆఫర్‌ను నిరాకరించినందుకే ఎక్కువ సమయంలో జైలు ఉన్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి.తాజాగా ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ఆప్‌పై బీజేపీ చేసిన కుట్రలు ఎవరికీ తెలియవు. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ వారి విధానం. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుంటారు.. వాళ్ల మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. ప్రజా సంక్షేమం, స్కూల్స్, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో కాషాయ పార్టీ నేతలకు అవసరం లేదు. కేవలం అధికారం కోసమే బీజేపీ ఆరాటపడుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో నన్ను అన్యాయంగా జైలులో పెట్టారు.నేను జైలులో ఉన్న సమయంలో బీజేపీ నాకు సీఎం పదవిని ఆఫర్ చేసింది. బీజేపీలో చేరాలని.. అలా అంగీకరిస్తే , ఆప్ ఎమ్మెల్యేలను విడగొట్టి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ నిరాకరిస్తే ఎక్కువ కాలం కటకటాల వెనుక ఉంచుతామని బీజేపీ చెందిన ఒంక నేత బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ ఆఫర్ నిరాకరించిన కారణంగానే ఎక్కువ రోజులు జైలులో ఉన్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారాయి.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశరాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు జైలుకు వెళ్లారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా 2023లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంలో జైలు నుంచి విడుదలయ్యారు. ఇక, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్‌పురా నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు.మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో కొద్దిరోజులే సమయంలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. ఎనిమిదో తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి. -
కేజ్రీవాల్‌కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంతలోనే కేజ్రీవాల్‌ను మరో కష్టం చుట్టుముట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఈ అనుమతిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీకి అనుమతినిచ్చింది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌పై అభియోగాల నమోదుపై స్టే విధించింది. ఇందుకోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతి లేకుండానే ట్రయల్ కోర్టు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకుందని కేజ్రీవాల్ వాదించారు. సీబీఐ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇందుకు అనుమతి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టులో అవసరమైన ఆమోదం పొందింది. అయితే ఈడీ ఇందుకు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ స్వయంగా కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్లో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ 'సౌత్ గ్రూప్' నుండి లంచం తీసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బృందం దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు, పంపిణీని పర్యవేక్షించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్ విధానం నుంచి ఈ బృందం లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఢిల్లీ రాష్ట్ర పరిధిలో అమలుకోసం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంబంధిత కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికను జాతీయ మీడియా బయటపట్టింది. లీక్ అయిన కాగ్ నివేదికలో పలు విస్మయకర విషయాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఎక్సైజ్ విధానంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని, నిబంధనలకు నీళ్లొదిలేశారని, ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారని కాగ్ నివేదిక పేర్కొంది. తమకు అనుకూలంగా పనిచేసే మ ద్యం విక్రయ సంస్థలకు అయాచిత లబ్ధిచేకూరేలా ఎక్సయిజ్ పాలసీలో మార్పులుచేర్పులు, సవరణ లు చేశారని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయ లై సెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతు లు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది. జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదా యం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది. అయితే కాగ్ నివేదిక ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి: బీజేపీ ఆప్ తెచ్చిన మద్యం విధానం లోపభూయిష్టమని కాగ్ నివేదించిన నేపథ్యంలో శనివారం బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్గేట్’కు సూత్రధారి, ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాలి. 11 ఏళ్ల క్రితం అవినీతిపై సమాధానం చెప్పాలని సోనియాగాందీని పదేపదే డిమాండ్‌చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు’’అని ఠాకూర్ అన్నారు. ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి.. -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దింపుతున్న ఏక్నాథ్ షిండే
-
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
ఢిల్లీ లిక్కర్ కేసు: అభిషేక్ బోయిన్‌పల్లికి ఊరట
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. సోమవారం ఆయనకు సుప్రీంకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్‌కు ఈ ఏడాది మార్చి 6న సుప్రీం కోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ వచ్చింది.తాజాగా అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. “కేసులోని మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారు. ఈ విషయం అంత వివాదాస్పదం ఏం కాదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేం అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని తీర్పు ఇచ్చింది.బెయిల్ కోసం షరతులు విధించటంపై ట్రయల్ కోర్టు జడ్జికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది.2023, జూలై 3వ తేదీన ఢిల్లీ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అభిషేక్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మార్చిలో అభిషేక్ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. దానిని చివరిసారిగా ఆగస్టులో పొడిగించింది. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేడు అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే.. అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.ఇక.. ఆప్ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే! -
Arvind Kejriwal: రెండ్రోజుల్లో రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలవడం తెలిసిందే. ఆదివారం భార్య సునీతతో కలిసి ఆయన ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంంను ఎంపిక చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారంటే... నేరస్తుడినని భావిస్తే నాకు ఓటేయకండి ‘‘దేశ ప్రజలను, ఢిల్లీవాసులను అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడా? లేక నేరస్తుడా? ప్రజలే తీర్పు చెప్పాలి. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ప్రతి గల్లీకి, ప్రతి గడపకూ వెళ్తాను. నిజాయితీపరుడని అనుకుంటే నాకు ఓటేయండి. నేరస్తుడినని భావిస్తే వేయకండి. మీరు వేసే ప్రతి ఓటూ నా నిజాయతీకి సర్టిఫికెట్. ఆప్‌కు ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై, మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా.సీతలా నాకు అగి్నపరీక్ష ‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగి్నపరీక్ష ఎదుర్కోవాల్సి వచి్చంది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగి్నపరీక్షకు సిద్ధంగా ఉన్నాను. కేజ్రీవాల్ చోర్, అవినీతిపరుడు, భరతమాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు. నేను ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అనే ఆటాడేందుకు రాలేదు. దేశానికి మంచి చేద్దామని వచ్చా. ఆప్‌ను విచి్ఛన్నం చేసేందుకే నన్ను జైలుకు పంపించారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం, సీబీఐ, ఈడీలతో భయపెట్టడం, తప్పుడు కేసులు, జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.. ఇలా ఒక ఫార్మూలా రూపొందించుకున్నారు. నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆప్ విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు. కానీ మా పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆప్‌కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జైలులో ఉండగా పీఎం పదవికి రాజీనామా చేయలేదు’’.భార్యను సీఎం చేయడానికే డ్రామాలు: బీజేపీ భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెర తీశారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన్ని ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఆప్‌లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఆప్ కొత్త సీఎం ఎవరు? కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిశీ, గోపాల్ రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో దళితులు, ముస్లింల ప్రాబల్యంగా అధికం గనుక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని పరిశీలకులు అంటున్నారు. -
టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం.. పోలీసుల కేసు నమోదు
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంతో శుక్రవారం జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఆప్ ముఖ్య నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని సీఎంకు ఘన స్వాగతం పలికారు.కాగా సీఎం విడుదలపై ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నార్త్ ఢిల్లీలోని సివిల్స్ లైన్స్‌లో సీఎం ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాలు కాల్చి కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం నివాసం వెలుపల బాణాసంచా పేల్చడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి తెలిపారు.ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక స్వాగతం పలికేందుకు ఆయన నివాసం వెలుపల పటాకులు పేల్చడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.చదవండి: దంచికొట్టిన వానలు.. మెరుగుపడిన ఢిల్లీ గాలి నాణ్యతకాగా లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని.. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. -
కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కాం కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కడంతో ఆప్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వాళ్లకు అభివాదం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘వర్షంలోనూ నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను జైల్లో బంధించి నా మనోస్థైర్యం దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు నా బలం, నాలో ధైర్యం వంద రేట్లు పెరిగింది’’ ఆయన పేర్కొన్నారు. నేను నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడునన్ను జైల్లో వేస్తే బలహీనపడతానని అనుకున్నారుజైలు గోడలు నన్ను బలహీనపర్చలేవు దేశాన్ని అమ్మే.. విచ్ఛిన్నం శక్తులకు వ్యతిరేకంగా పోరాడతాదేశానికి నా సేవ కొనసాగిస్తాకేజ్రీవాల్కు స్వాగతం పలికిన వాళ్లలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మంత్రి అతీషి, సీనియర్ నేత మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. తదితరులు ఉన్నారు. #WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greets party workers and leaders outside Tihar Jail in DelhiThe Supreme Court granted him bail in the Delhi excise policy case today pic.twitter.com/Ydwlmu6CLN— ANI (@ANI) September 13, 2024 లిక్కర్ స్కాం కేసులో.. మనీలాండరింగ్ అభియోగాలపై ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు.ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.అయితే.. దీనిపై ఈడీ (ED) అభ్యంతరం వ్యక్తంచేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఇక.. ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ.. ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది.దాదాపు ఆరు నెలలపాటు లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్.. ఎట్టకేలకు బయటకు వచ్చారు. -
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్‌కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్‌పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్‌పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అంతకముందు విధించిన క స్టడీ నేటితో ముగియడంతో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌ను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. వాదనల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇకఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జూలైలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులు బెయిల్‌పై బయటకి వచ్చారు. -
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
‘ఈరోజుల్లో ట్రంప్ అంటే’.. సుప్రీం కోర్టులో సరదా ఘటన
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరిపింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటున్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా వాదనలు మళ్లీ ప్రారంభించాలని కేజ్రీవాల్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పట్టుపట్టారు. జీవించే హక్కు, స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన చాకచక్యంగా ఈ రోజుల్లో ట్రంప్ అనే పదం చాలా ప్రమాదకరంగా మారిందని చమత్కరించారు. ట్రంప్ అనే పదంపై సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యతో ఒక్కసారిగా కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులు నవ్వారు.ఇక.. ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది. -
కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదించారు. ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.సింఘ్వీ వాదనలు..ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మూడు కోర్టు ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా బీమా అరెస్టు కింద( ఆకస్మిక) సీబీఐ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుంది. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ జైలులో ఉంచవచ్చని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.41ఏ కింద కేజ్రీవాల్‌ను నిందితుడిగా విచారించాలని సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అరెస్ట్ చేయాలని ముందుగా అనుకోలేదు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పుడు కేవలం ఆయన్ను విచారించేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది.41ఏ దరఖాస్తు ప్రకారం సీబీఐ సీఎంను మూడు గంటలు విచారించారు. కానీ వారి దగ్గర 41ఏ నోటీసు లేదు. మరి అంత అకస్మాత్తుగా కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట చేశారు. ఇది బీమా అరెస్ట్, హడావిడి అరెస్ట్ కాకుంటే మరెంటీ?కేజ్రీవాల్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడా? అతను సాక్షులను ప్రభావితం చేస్తాడా? సుప్రీంకోర్టు మూడు ప్రశ్నల గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి.సీబీఐ అరెస్టుకు ప్రధాన కారణం కేజ్రీవాల్ సహకరించకపోవడమే. ఒక వ్యక్తి తనను తాను నేరారోపణ చేసుకోవాలని ఎలా అనుకుంటారు.అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఎక్కడికి పారిపోలేడు. ట్యాంపరింగ్ కుదరదు, లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఐదు చార్జిషీట్లు దాఖలయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండదు. బెయిల్ కోసం మూడు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నాయి.కేజ్రీవాల్‌కు రెండుసార్లు బెయిల్ పొందారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద సుప్రీంకోర్టు ఓసారి బెయిల్ ఇచ్చింది. కేవలం ఇన్సురెన్స్ (ముందస్తు, హడావిడీ) అరెస్టు మాత్రమే. అతని అరెస్ట్‌ను సమర్ధించేందుకు అంతకుముంచి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఈ కేసులో మిగతా నిందితులందరూ(విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చి బాబు, సంజయ్ సింగ్, కవిత) విడుదలయ్యారు.లిక్కర్ పాలసీకి సబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఒకరు కస్టడీలో ఉన్నప్పుడు .. మళ్లీ అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లో ఏదో ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.సీబీఐ సెక్షన్ 41, 41ఏ లను పాటించకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం ముందు మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం తిరిగి ట్రయల్ కోర్టుకు వెళ్లండి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన కేసులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.కేజ్రీవాల్ ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించాడు. ఇది నా ప్రాథమిక అభ్యంతరం. మెరిట్ల దృష్ట్యా ట్రయల్ కోర్ట్ దీనిని మొదట విచారించాల్సి ఉంది. అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుంది. సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.కేజ్రీవాల్ ముందు సుప్రీంకోర్టుకు వచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు, ఇప్పుడు ఇక విషయాన్ని ఈ కోర్టు నిర్ణయించాలి. ఈ మేరకు కవిత కేసును ప్రస్తావిస్తూ.. ముందుగా ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ తిరస్కరణ ఎదురవ్వడంతో హైకోర్టు మెట్లెక్కారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.ఎస్పీ రాజు వాదనలపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ..ఒకరిని ట్రయల్ కోర్టుకు పంపాలనుకుంటే అప్పుడే హైకోర్టు నిర్ణయాత్మకంగా ఆలోచించాల్సి ఉండేది. ఇక్కడ మెయింటెనబిలిటీకి సంబంధించిన ప్రశ్న కూడా నిర్ణయించుకోవాలి.చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ ప్రత్యేక వ్యక్తులు కారు. ఏ వ్యక్తికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు. కేవలం ముఖ్యమంత్రి కావడం వల్లే కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ ప్రజలు ట్రయల్ కోర్టుకు వెళతారు. వారంతా సుప్రీంకోర్టుకు రాలేరు.కేజ్రీవాల్ రిమాండ్ దరఖాస్తును అందించాం, అందులో అరెస్టుకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసిప్పుడు లేదా సాక్షులను బెదిరించినప్పుడు. వారెంట్ లేకుండా సరైన దర్యాప్తు కోసం అరెస్టు చేయవచ్చు. ఈ కేసు ఆ వర్గంలోకి వస్తుంది.అరవింద్ కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ కాపీని జతచేయలేదు. దానిని దాచినందున అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, అది ఢిల్లీ హైకోర్టును నిలదీసినట్టే’ అంటూ వాదనలు వినిపించారు.అయితే లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో సీఎంకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ కేసులోనూ సుప్రీం ముఖ్యమంత్రి బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కమ్యూనికేషన్ ఇంచార్జి, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష, విచారణలో జాప్యాన్ని కీలక కారణాలుగా చూపుతూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.కాగా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న నాయర్.. 23 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అండర్ ట్రయల్‌గా అతన్ని ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని, విచారణ శిక్షగా మారకూడదని సుప్రీం న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. న్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయిందని, దాదాపు 350 మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో ఇతర నిందితులైన మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పరిగణలోకి తీసుకుంది.‘30 అక్టోబర్ 2023న 6 నుంచి 8 నెలల్లో విచారణ ముగిస్తామని ఈడీ కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే విచారణ ఇంకా ప్రారంభం కాలేదని అర్థం అవుతోంది.ఈ కేసులో దాదాపు 40 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు 350 మంది సాక్షులను విచారించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.ఈ కేసులో పిటిషనర్ 23 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు. విచారణ ప్రారంభించకుండా అతనిని అండర్ ట్రయల్‌గా నిర్బంధించడం శిక్షా విధానం కాదు. పిటిషనర్‌ను విచారణ ప్రారంభించకుండానే జైలులో ఉంచితే బెయిల్ రూల్, జైలు మినహాయింపు అనే సార్వత్రిక నియమం ఓడిపోతుంది.ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కు అనేది ఒక పవిత్రమైన హక్కు. ఇది పీఎంఎల్ఏ వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం కఠినమైన నిబంధనలు రూపొందించబడిన సందర్భాల్లో కూడా దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీ కేసులో విజయ్ నాయర్ నిందితుడిగా ఉన్నారు. నవంబర్ 2022లో సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. కానీ ఈడీ కేసులో గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై తాను చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచి్చన కథనాలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని, కోర్టు భావనను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆగస్టు 29, 2024న పలు పత్రికల్లో నా పేరిట వచి్చన వార్తల ఆధారంగా గౌరవ న్యాయస్థానం విచక్షణను నేను ప్రశ్నించినట్టుగా కోర్టు భావించడాన్ని అర్థం చేసుకోగలను. న్యాయ ప్రక్రియ పట్ల నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని మరోమారు తెలియజేస్తున్నాను. పత్రికల్లో ఆ వ్యాఖ్యలను అసందర్భంగా నాకు ఆపాదించారు. న్యాయవ్యవస్థ, ఆ వ్యవస్థకున్న స్వతంత్రతపై నాకు అపార గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే నేను న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను..’ అని సీఎం పేర్కొన్నారు. -
కవిత కేసు వాదించిన లాయర్ ఎవరు?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ సర్కార్ లేకపోతే కాంగ్రెస్ దేశాన్ని ఏడు ముక్కలు చేసేదని సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ప్రతీ ఒక్కరినీ బీఆర్ఎస్ మర్చిపోయిందన్నారు. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు.కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ పార్టీలో కొత్త తరం రావాలి. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతీ కార్యకర్త భాగస్వామ్యం కావాలి. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఎంఐఎపీ లేకుండా చేయాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలి. బీజేపీ లేకుంటే దేశాన్ని కాంగ్రెస్ ఏడు ముక్కలు చేసేది. చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యం. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగింది. పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతీ కార్యకర్తను బీజేపీ గుర్తుంచుకుంటుంది. సభ్యత్వం చేయాలని కోరే హక్కు బీజేపీకి మాత్రమే ఉంది. సభ్యత్వ నమోదు చేసిన వారికే భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కోసం త్యాగం చేసిన కార్యకర్తలను ఆ పార్టీ నేతలు గుర్తించుకోరు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ బీఆర్ఎస్ మరిచిపోయింది. కాంగ్రెస్‌కు గుర్తుకువచ్చేది కేవలం నెహ్రూ, రాజీవ్ గాంధీలే. బీఆర్ఎస్కు గుర్తుకు వచ్చేది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులే. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా కంపెనీ అంటూ సెటైర్లు వేశారు.కవితకు బెయిల్ రావడం బీజేపీకి ఏం సంబంధం?. రాజకీయ నాయకులు భయపడేది కేవలం న్యాయస్థానాలకే. వ్యక్తులు చెబితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయా?. న్యాయస్థానాలను అగౌరవపరచవద్దు. కవిత బెయిల్ కోసం వాదించింది అభిషేక్ సింఘ్వీ. ఆయననే ఎందుకు రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది?. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోవడం ఖాయం. బీజేపీ కొట్లడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. అలాగే, న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉంది అంటూ సీఎం కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉంది. నా వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు వక్రీకరించాయి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశ్యం నాకు లేదు. ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. పత్రికల్లో వార్తల పట్ల బేషరతుగా నా విచారం వ్యక్తం చేస్తున్నాను. అలాంటి తప్పుడు వ్యాఖ్యలను నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. I have the highest regard and full faith in the Indian Judiciary. I understand that certain press reports dated 29th August, 2024 containing comments attributed to me have given the impression that I am questioning the judicial wisdom of the Hon’ble Court.I reiterate that I am…— Revanth Reddy (@revanth_anumula) August 30, 2024 ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలను, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. రాజకీయాల్లోకి కోర్టులను ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా? అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోబోమని తేల్చిచెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. -
నా బిడ్డొచ్చింది.. కవితను హత్తుకుని భావోద్వేగానికి గురైన శోభమ్మ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/శంషాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, భర్త అనిల్, కుమారుడితో పాటు పార్టీ కీలక నేతలతో కలిసి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత.. సాయంత్రం 5.30కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్ పోర్టు వద్ద కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కవిత సాయంత్రం ఏడు గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.అమ్మకు పాదాభివందనం.. సోదరుడికి రాఖీ.. కవిత రాకకు మునుపే ఆమె నివాసానికి కేసీఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కవితను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది. డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ ఇంటికి చేరుకున్న కవితకు శోభమ్మ, శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గుమ్మడి కాయతో దిష్టితీసి హారతి పట్టారు. తల్లి, వదినను కవిత ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శోభమ్మకు పాదాభివందనం చేశారు. కేటీఆర్ సోదరి కవిత చేయిపట్టుకుని కార్యకర్తల నినాదాల నడుమ ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కవిత గురువారం ఎర్రవల్లి నివాసానికి వెళ్లనున్నారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసీఆర్‌తో కవిత భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. కాగా ఆమె రెండు రోజుల పాటు ఎర్రవల్లి నివాసంలో తన తల్లిదండ్రులతోనే ఉండనున్నారు. మరోవైపు గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే నేతలకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా: కవితప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను ఏ విషయంలోనూ, ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని అపవాదుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయం, ధర్మం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, నిజం నిలకడ మీద ప్రజలకు తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసమస్యలపై జరిగే పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. తాను కేసీఆర్ బిడ్డనని వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని అన్నారు. నా చెల్లెలు ఫైటర్అంతకుముందు బుధవారం ఉదయం కవిత హస్తినలో బిజీబిజీగా గడిపారు. ఆమె విడుదల విషయాన్ని తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదున్నర నెలల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. కేటీఆర్, కవితలతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇటీవలి పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన విశేషాలను వివరించారు. హైదరాబాద్ బయలుదేరే ముందు సోదరుడు కేటీఆర్‌తో కవిత కొద్దిసేపు ముచ్చటించారు. మరోసారి కవితను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా చెల్లెలు ఫైటర్ .. పట్టు వదలని విక్రమార్కురాలు..’ అంటూ ఆశీర్వదించారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా
ఢిల్లి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు వేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్ 11 తేదీకి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. బుధవారం ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టును కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను వారికి అందజేయాలని జడ్జి కావేరి భావేజా అదేశించారు. -
కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్ బయలుదేరిన కవిత..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. కేటీఆర్, భర్త అనిత్, కుటుంబ సభ్యులతో కలిసి కవిత విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. నిజం కచ్చితంగా గెలుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకోవాల్సి ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | BRS leader K Kavitha along with party leader and her brother KT Rama Rao in Delhi(Video source: BRS) pic.twitter.com/xYedikX7Ee— ANI (@ANI) August 28, 2024నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.జైలు నుంచి విడుదల..ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.నా తప్పు లేకున్నా.. కేవలం రాజకీయాల కోసం నన్ను జైల్లో పెట్టారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు.నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతా.. తప్పకుండా నిర్దోషిగా నిరూపించుకుంటా.- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3RTl9uPaFS— BRS Party (@BRSparty) August 27, 2024 -
ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిందితురాలు అయినప్పుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకే కేసులో ఉన్న ఇద్దరిలో ఆమె నిందితురాలు అయినప్పుడు ఆయన సాక్షి ఎలా అవుతారో తెలపాలంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని, ఆ విషయంలో భిన్నంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థల్ని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బదులిస్తూ.. కవిత ఫోన్లు ధ్వంసం చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడటమే కారణం అని తెలిపారు. మేజి్రస్టేట్ ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చి0దన్నారు. పాలసీలో భాగస్వామ్యం కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎంపీ మాగుంట కలిశారని, అయితే కవితను కలవాలని కేజ్రీవాల్ సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తన నివాసానికి కవిత రమ్మని ఫోను చేశారంటూ ఎంపీ మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవిత ఫోను ధ్వంసం చేయాల్సి వ0చ్చిదని ఎస్వీ రాజు తెలిపారు. పాలసీ అనుకూలంగా ఉండడానికి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని రూ. 50 కోట్లు తనకు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నట్లు రాజు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అభిõÙక్ బోయినపల్లి, బుచ్చిబాబులకు తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా రూ. 25 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అని ప్రశ్నించింది. కవిత నిందితురాలు అయినప్పుడు మాగుంట సాక్షి ఎలా అవుతారో చెప్పాలంది. ఈ సమయంలో కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కల్పించుకొని మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారడంతోనే బెయిలు వచ్చి0దన్నారు. ఇలాంటి ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని రోహత్గి తెలిపారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌కు ఏ కేసులో బెయిలు వచ్చి0దనే విషయాలు జస్టిస్ బీఆర్ గవాయి ఆరా తీశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని మాగుంట రాఘవ రూ. 25 కోట్లు బుచ్చిబాబు, అభిõÙక్కు ఇచ్చారని అంటున్నారు మరి మనీలాండరింగ్ కేసులో రాఘవ లేరని ఎలా అంటారని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. నేరారోపణ చేసిన వ్యక్తినే సాక్షిగా మార్చారు? రేపు ఇష్టానుసారం మరో వ్యక్తిని తీసుకొస్తారా? ఇదా దర్యాప్తు సంస్థల పారదర్శకత అని ప్రశి్నంచారు.కవితకు బెయిల్ మంజూరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళగా కవిత బెయిలుకు అర్హురాలని తేల్చి చెప్పింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45ను అర్థం చేసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందని పేర్కొంది. సహ నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు కాకుండా నేరంలో కవిత పాత్ర ఉందన్న ఆధారాలు ఇంకేమీ దర్యాప్తు సంస్థలు చూపకపోవడాన్ని గుర్తు చేస్తూ బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా.. దర్యాప్తు పూర్తి, చార్జిషీటు దాఖలు, మహిళ అనే మూడు అంశాల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. సుమారు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా ఇరుపక్షాలు వాదించాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిలును ధర్మాసనం మంజూరు చేసింది. ‘‘జులై 1న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు క్వాష్ చేస్తున్నాం. రెండు కేసుల్లోనూ చెరో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలి. సాక్షుల్ని బెదిరించడం, ఆధారాలు ట్యాంపర్ చేయడం చేయరాదు. ట్రయల్ కోర్టులో పాస్‌పోర్టు డిపాజిట్ చేయాలి. పిటిషనర్ ట్రయల్ కోర్టుకు రెగ్యులర్‌గా హాజరవుతూ.. దర్యాప్తు వేగవంతానికి సహకరించాలి’’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
కేసీఆర్ బిడ్డను.. తప్పు చేయను: కవిత
మంగళవారం రాత్రి 9.11 గంటలు.. తిహార్ జైలు ప్రాంగణం.. అంతటా ఉద్వేగపూరిత వాతావరణం.. సుమారు ఐదున్నర నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలై.. జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ.. కుమారుడిని, భర్తను, అన్న కేటీఆర్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఐదున్నర నెలలు అక్రమంగా జైలులో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా’నంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు..కవితకు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయి, చార్జిïÙట్లు దాఖలైనా ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుపడుతూ.. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్‌రావులకు ఫోన్ చేస్తూ.. ఆమె బయటికి ఎంతసేపట్లో వస్తుంది, వెంట ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. జైలు బయట భర్తతో కలసి అభివాదం చేస్తున్న కవిత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిహార్ జైలు వద్దకు చేరుకుని.. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఢిల్లీ వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఇన్ని రోజులు ఒక తల్లిగా పిల్లలకు ఏనాడూ దూరంగా ఉండలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారికి కచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెబుతాను’’ అంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. రాత్రి సరిగ్గా 9.11 గంటలకు తీహార్ జైలు నుంచి పిడికిలి బిగించి, జై తెలంగాణ అంటూ బయటకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గేటు బయటకు రాగానే పెద్ద కుమారుడు ఆదిత్యను చూసిన కవిత భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సోదరుడు కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, కేటీఆర్ కవిత నుదిటిపై ముద్దుపెట్టారు. భర్త అనిల్, హరీశ్‌రావులతో ఆలింగనం అనంతరం అక్కడున్న బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాలోతు కవిత తదితరులను ఆప్యాయంగా పలకరించారు. కవిత విడుదల అవుతున్నారని తెలుసుకున్న ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్, కవిత కడిగిన ముత్యం, కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. నన్ను జగమొండిని చేశారు కవిత జైలు బయట ఉన్న మీడియా, కార్యకర్తలనుద్దేశించి రెండు నిమిషాలు ప్రసంగించారు. ‘ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు. నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న కవితకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆటోలో కేటీఆర్: కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు కోర్టు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు వెంటపడుతున్న సమయంలో.. అందరికీ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. ఆ సమయంలో కారు అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటో మాట్లాడుకుని దీన్‌దయాల్ మార్గంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. పది నిమిషాలకోసారి కేసీఆర్ ఫోన్ బెయిల్ మంజూరు అని తెలిసినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్, కవిత భర్త అనిల్‌లకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటిలోగా బయటకు తెస్తారు, కవితమ్మ వెంట ఎవరెవరు ఉంటారు, జైలు వద్దకు ఎప్పుడు వెళతారంటూ కేసీఆర్ ఆరా తీస్తూనే ఉన్నారు. అక్రమంగా జైలులో పెట్టారు కవిత జైలు నుంచి నేరుగా వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కవిత వెంట కారులో కేటీఆర్, కుమారుడు ఆదిత్య, భర్త అనిల్, పార్టీ నేతలు సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత ఉన్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పది నిమిషాలకే పార్టీ నేతలతో కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్ అని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తనను టార్గెట్ చేసుకుని జైలుకు పంపారంటూ ఆమె నేతలతో చర్చించారు.నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..⇒ 08–03–2023న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది ⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ ⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ ⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్ ⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్ ⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు ⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ ⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు ⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు ⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం ⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు ⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా ⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా ⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా ⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా ⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు ⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. -
కవితకు బెయిల్ ఆలస్యమైనా.. న్యాయం గెలిచింది: బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.కవిత బెయిల్‌పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కేసులు వేస్తామని, బెయిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు. బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారుకేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారుబండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?- మాజీ మంత్రిగంగుల కమలాకర్. -
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు.కాగా సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోవైపు కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాల్గో అనుబంధ ఛార్జీషీట్ పైన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై సెప్టెంబర్ 3న విచారణ జరగనుంది.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు. -
కవితకు బెయిల్ సుప్రీం కోర్టు ఆంక్షలు
-
కవితకు భారీ ఊరట, ఎప్పుడు.. ఏం జరిగింది? (ఫొటోలు)
-
తీహార్ జైలు నుంచి కవిత విడుదల
Updates: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కానున్న కవితకవిత విడుదల ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ కోర్టుషూరిటీ పత్రాలు సమర్పించిన కవిత భర్త అనిల్, ఎంపీ రవిచంద్రరిలీజ్ వారెంట్ తో తీహార్ జైలుకు వెళ్లిన కవిత న్యాయవాదులుతీహార్ జైలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షంరోడ్లన్నీ జలమయం, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులున్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ‘‘సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తు సంస్థల దర్యాప్తు పూర్తైన నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఈ మూడు ప్రధానాంశాల ఆధారంగా నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. కవిత బెయిల్‌కు షరతులుఒక్కో కేసుకు రూ.10 లక్షల పూచీకత్తు చొప్పున.. రెండు షూరిటీల సమర్పణపాస్పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలిసాక్షులను ప్రభావితం చేయకూడదుఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణకు సహకరించాలికవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు.. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు. ఈడీ,సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యింది. దర్యాప్తు కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ కేసులో 57 మంది నిందితులు ఉన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదు. సిసోడియాకు బెయిల్ ఇచ్చి కవితకు ఇవ్వకపోవటం సరికాదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది. ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. 5 నెలలకు పైగా ఈడీ కేసులో, 4 నెలలుగా సీబీఐ కేసులో కవిత జైలులో ఉన్నారు. రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ, సీబీఐ ఆరోపించాయి. కానీ, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు.జస్టిస్ గవాయి వ్యాఖ్యలు..కవిత నిరక్షరాస్యులు కాదుఏది మంచి,ఏది చెడు కాదో తెలియదా?అప్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు?కవిత దుర్బల మహిళ కాదు అని ఢిల్లీ హై కోర్టు అన్నది కదా ఉన్నత స్థాయి మహిళ కు, దుర్బల మహిళకు తేడా ఉంది కదా ?సీబీఐ వాదనలు.. కవిత తన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేశారు. సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. కుట్రపూరితంగానే ఫోన్లో డేటా డిలీట్ చేశారు. గౌతమ్ గుప్తాతో చేసిన చాటింగ్‌ను డిలీట్ చేశారు. ఈడీ తరపు వాదనలు.. కవిత సాక్షాలను ట్యాంపర్ చేశారు. యాపిల్ ఫోన్ ఫేస్ టైంలో డేటా ఎందుకు లేదు?. నాలుగు అయిదు నెలల నుంచి ఫోన్ వినియోగిస్తే అందులో డేటా ఎలా మాయం అయ్యింది?. క్లిక్ చేయండి: కవిత అరెస్ట్ టూ బెయిల్ధర్మాసనం వ్యాఖ్యలు..ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేయటం సహజమే కదా: సుప్రీం కోర్టుమెసేజ్లు డిలీట్ చేయడాన్ని ఎలా తప్పుబడతారు?అరుణ్ పిళ్ళై తొలుత ఇచ్చిన వాంగ్మూలమే మేము పరిగణనలోకి తీసుకుంటాం ఉపసంహరించుకున్న వాగ్మూలం పట్టించుకోంఈడీ తరఫు వాదనలు..మెసేజ్‌లు డిలీట్ చేయటం కానీ ఫార్మాట్ చేయటం సహజం కాదుకవిత బెదిరింపుల వల్లే పిళ్లై స్టేట్మెంట్ విత్‌డ్రా చేసుకున్నారు.అరుణ్ పిళ్ళై 120రోజుల తర్వాత తన స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారుకవితని విచారణకు పిలిచినప్పుడే అరుణ్ పిళ్ళై అప్రూవర్ స్టేట్మెంట్ ఉపసంహరించడం వెనుక ఎవరు ఉన్నారు?కవిత, అరుణ్ పిళ్ళైలను కలిపి విచారణ జరుపుతాం అనగానే స్టేట్మెట్ రిట్రీట్ చేశారువంద కోట్ల రూపాయల కిక్ బ్యాగ్స్‌కు ఆప్ పార్టీకి ఇవ్వడంలో కవితది కీలకపాత్రఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారులిక్కర్ బిజినెస్‌పై అరవింద్ కేజ్రీవాల్‌ను కలిస్తే కవితను కలవమని చెప్పారుకవితను కలిస్తే లిక్కర్ బిజినెస్ కోసం ఆప్‌కు వంద కోట్లు ఇవ్వాలని చెప్పారుఇందులో 50 కోట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇవ్వాలని కవిత చెప్పారుఈ డేటా మొత్తం ఫోన్ నుంచి డిలీట్ చేశారు.ఈడీపై న్యాయమూర్తుల ఆగ్రహంపిళ్లై సీబీఐ కస్టడీలో ఉంటే కవిత ఎలా బెదిరిస్తారు?మీకు ఇష్టమొచ్చిన వాళ్లను సాక్షులుగా పెడతారా?మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదుకవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎలా అవుతారు?జస్టిస్ గవాయి వ్యాఖ్యలు:మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారుఇదేనా పారదర్శకత ?బుచ్చిబాబు, ముత్త గౌతమ్ కేసులో నిందితులుగా ఉన్నారా ?విచారణ పారదర్శకంగా జరుగుతోందా? పక్షపాతం లేకుండా ఉందా ?మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాందర్యాప్తు పూర్తి అయ్యిందిచార్జిషీట్ ఫైలింగ్ పూర్తి అయ్యింది కదా493 మంది సాక్షుల విచారణ ఇప్పుడే పూర్తి కాదుసుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ హర్షంకవితకు బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు విచారణ నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావు సహా పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. తీర్పు అనంతరం ఆటోలో వాళ్లు వెళ్లిపోయారు. అయితే.. సాక్షి టీవీతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. ‘‘సాయంత్రం కల్లా కవిత బెయిల్‌పై బయటకు వస్తారని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత వ్యతిరేకంగా ఇలాంటి సాక్షాలు లేవు. ఇన్నాళ్లకు మా న్యాయపోరాటం ఫలించింది. జైల్లో కవిత ఇబ్బందులు పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించింది అని అన్నారాయన. -
బెయిల్ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.మంగళవారం కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌లు న్యాయవాది మోహిత్‌రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్‌పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండిపీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.పీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
కవితకు హైబీపీ
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ఆరోపణ లను ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత హైబీపీతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఎ యిమ్స్ ఆసుపత్రిలో ఆమె కు జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ టెస్టులతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్టులను చేశారు. బీపీ పరీక్షించగా, 186/103 ఉన్నట్లు తెలిసింది. జైలులోకి వెళ్లిన రెండు రోజులకే కవిత హైబీపీకి గురి అయినట్లు సమాచారం.జైలు అధికారులు రెండు పూటలా బీపీ ట్యాబ్లెట్లు ఇస్తున్నా రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంపై ఆమె కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క జ్వరం కూడా తగ్గకపోవడం, ఒకేసారి పది కేజీల బరువు తగ్గడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైలులోకి వెళ్లే ముందు కవిత 70 కేజీల బరువు ఉండగా, ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పరీక్షల సందర్భంలో ఆమె బరువు 59.5 కేజీలు ఉన్నట్లు సమాచారం. వీటికి తోడు దీర్ఘకాలికంగా ఆమెకు ఉన్న గైనిక్ సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవడం వలన మరింత అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.హరీశ్‌రావు పరామర్శ: తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. ఆ కేసులో దర్యాప్తు సంస్థలు కావాలనే కవితను ఇబ్బంది పెడుతున్నాయని హరీశ్ ఆరోపించారు. బెయిల్ విషయంలో దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని హరీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీబీఐ ఎఫెక్ట్.. కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తదుపరి విచారణ సెప్టెంబర్ ఐదో తేదీన జరుగనుంది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక, విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఉద్దేశ్యపూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందన్నారు.ఈ క్రమంలో సీబీఐ కౌంటర్ దాఖలుకు గడువు ఇస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మసనం తదుపరి విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
కవితకు మళ్లీ నిరాశే!
-
ఇన్ని నెలలు జైల్లో ఉంటానని ఊహించలేదు: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఇటీవల తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల అనంతరం ఆగష్టు 9న జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ఇంత కాలం తాను జైలులో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. విచారణను పొడిగించాలనే ఉద్ధేశ్యంతోనే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళ్తానని ఊహించలేదని తెలిపారు. ‘రాజకీయాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. కాబట్టి నాకు లోపల నుంచి నమ్మకం ఉండేది. ఒక వ్యక్తిని జైలుకు పంపడం లేదా అరెస్టు చేయడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని భావించాను.సంస్కరణలు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలని క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వారికి రెడ్ కార్పెడ్ పరిచి స్వాగతం లభిస్తుందని ఎప్పుడూ ఆశించకూడదు. అదే విధంగా నేను కూడా మానసికంగా సిద్ధమయ్యాను. కానీ మరీ 17 నెలల పాటు మద్యం పాలసీ కేసులో జైలులో నేను ఎప్పుడూ అనుకోలేదుఆరోపణలు కల్పితమే..పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ నామీద కేసులు పెట్టింది. ఈ చట్టం ప్రధానంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులను ఆపడానికి ఉద్దేశించిందిది. ఈ చట్టం ప్రకారం బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. ముఖ్యంగా నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను జైలులో ఉండటం నాకు, నా కుంటుబానికి ఇబ్బందిగా ఉండేది. . అయితే నేను కృంగిపోకూడదని బలంగా నిశ్చయించుకున్నాను.జైలులో ఉన్నప్పుడు, దాదాపు 15 నుంచి 16 గంటలు, సెల్లో ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితోనూ సంభాషణకు అవకాశం ఉండదు. అందుకే నాతో నేను స్నేహం చేయడం అలవాటు చేసుకున్నాను.’ అని తెలిపారు.మళ్లీ డిప్యూటీ సీఎంగా..కాగా ఢిల్లీ ప్రభుత్వంలో తిరిగి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సిసోడియా స్పందిస్తూ.. ప్రస్తుతానికి, పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందని, పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని అన్నారు.‘నేను జైలు నుంచి బయటకు వచ్చి నాలుగు రోజులైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తిరిగి వస్తాడు. ఆయన వచ్చాక నేను పార్టీ ప్రమోషన్లో ఉండాలా లేదా ప్రభుత్వంలో ఉండాలా అని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది. ’ అని తెలిపారు. -
లిక్కర్ కేసు: సీఎం కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం వెల్లడించింది.వీరిద్దరికి గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్, కవితను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇక ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఆమె తిహార్ జైల్లో శిక్షననుభవిస్తున్నారు. -
కవితకు దక్కని ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దర్యాప్తు సంస్థల వాదన విన్నాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి వాదనలు వినిపిస్తూ.. కవిత ఐదునెలలుగా జైలులో ఉన్నారని, దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసిన సుమారు 500 మంది సాక్షుల్ని విచారించారన్నారు. ఈ కేసు కూడా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరుల కేసులాంటిదేనని వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. కవిత మహిళ కావడంతో పీఎంఎల్ఏ సెక్షన్ 45 ఇచ్చే మినహాయింపు వర్తిస్తుందని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ధర్మాసనం కొద్దిసేపు చర్చించుకొని ఈ కేసు పరిశీలిస్తాం అని చెప్పింది. కవిత విద్యావంతురాలు, రాజకీయ నాయకురాలు అని జస్టిస్ బీఆర్. గవాయి వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ అయినంత మాత్రాన పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళకు రక్షణ కల్పించడానికి వీలు లేదనడం సరికాదన్నారు. ‘కవిత సాధారణ మహిళ కాదు అని ఢిల్లీ హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది కదా’అని జస్టిస్ బీఆర్.గవాయి స్పష్టం చేశారు. ఈ వర్గానికి చెందినవారు, ఆ వర్గానికి చెందిన వారు అని వాస్తవంగా ఎలా వ్యాఖ్యానించగలుగుతామని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. దీంతో ప్రతివాదులైన దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రోహత్గి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు సంస్థల వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20కు వాయిదా వేసింది. -
కేజ్రీవాల్ జైలు నిబంధనలు ఉల్లంఘన!
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు లేఖ రాయడాన్ని జైలు అధికారులు తప్పు పట్టారు. జైలు నిబంధనలు ఉల్లంఘించటమేని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయజెండాను ఎగరవేస్తారని తెలుపుతూ సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. దీనిపై తిహార్ జైలు నంబర్ 2, సుపరింటెండెంట్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసి ఢిల్లీ జైలు నింబంధనలు-2018ను ఉల్లంఘించారని అన్నారు. ఆయన రాసిన లేఖకు సంబంధించిన సమాచారం మీడియాలో రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనుమతిలేని చర్యలు పాల్పడితే.. జైలులో సీఎంకు ఉన్న అధికారాలను కూడా కుదించాల్సి వస్తుందని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్ ఆగస్టు 6వ తేదీన ఎల్జీకి లేఖ రాసినట్లు జైలు అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం. ఇక. ఈడీ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు ఆయను బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ఆరెస్ట్ చేయగా ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖ తమకు చేరలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉండగా.. స్వాతంత్ర్య దినోత్సవం (అగస్టు15) సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. -
నేడు కవిత బెయిలుపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బెయిలు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటి షన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖ లు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కు కూడా బెయిలు దక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయి లు ఇచ్చిన సమయంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిలు అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. -
నియంతృత్వంపై పోరాడదాం: సిసోడియా
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నియంతృత్వాన్ని ప్రశి్నస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై బిగ్గరగా గర్జిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. నిజాయతీకి ప్రతిరూపమైన కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం ‘ఆప్’ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయం తన భార్యతో కలిసి తేనీరు సేవిస్తున్న ఫొటోను మనీష్ సిసోడియా శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయాన మొదటి తేనీరు అని పేర్కొన్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్
-
Supreme Court: సిసోడియాకు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో 17 నెలల క్రితం అరెస్టయి తిహార్ జైలులో విచారణ ఖైదీగా గడుపుతున్న ఆప్ నేత, నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికింది. సుదీర్ఘకాలంపాటు కేసు దర్యాప్తును సాగదీసి విచారణ ఖైదీకుండే హక్కులను కాలరాయలేమని శుక్రవారం బెయిల్ ఉత్తర్వులిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సిసోడియాకు బెయిల్‌ను మంజూరుచేస్తూ 38 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ ఆరో తేదీన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌చేసి ఆగస్ట్ 9వ తేదీన వెలువరించింది.వైకుంఠపాళి ఆడించారు.. ‘‘బెయిల్ అనేది నియమం. బెయిల్‌ను తిరస్కరించి విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయడం అనేది ఒక మినహాయింపు’’ మాత్రమే అనే సూత్రాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బెయిల్ విషయంలో విచారణ కోర్టులు, హైకోర్టులు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. మనీశ్‌పై సీబీఐ, ఈడీలు దర్యాప్తు పూర్తిచేసి జూలై 3 కల్లా చార్జ్షీట్లు సమర్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. సిసోడియాను ట్రయల్ కోర్టుకు, అక్కడి నుంచి హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, మళ్లీ ట్రయల్ కోర్టుకు తిప్పుతూ ఆయనతో వైకుంఠపాళి ఆట ఆడించారు. బెయిల్ అనివార్యమైన కేసుల్లోనూ బెయిల్ తిరస్కరించడంతో సంబంధిత పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువలా వస్తున్నాయి. సమాజంతో మమేకమైన సిసోడియా లాంటి వ్యక్తులను శిక్ష ఖరారు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధించి ఉంచకూడదు. స్వేచ్ఛగా, వేగవంతమైన విచారణను కోరడం నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే కేసు విచారణ నత్తనడకన సాగడానికే సిసోడియానే కారణమన్న కిందికోర్టు అభిప్రాయం వాస్తవదూరంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో సిసోడియాకు బెయిల్‌ను తిరస్కరిస్తూ మే 21వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ‘‘రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి మరో రెండు షూరిటీలను సమర్పించాలి. పాస్ట్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టులో ఇచ్చేయాలి. సాక్ష్యాధారాలను ధ్వంసంచేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు అధికారి ఎదుట ప్రతి సోమ, గురు వారాల్లో ఉదయం 10–11 గంటల మధ్య హాజరు కావాలి’’ అని కోర్టు షరతులు విధించింది. తొలుత సీబీఐ.. ఆ తర్వాత ఈడీడిఫ్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను మద్యం కేసులో 2023 ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్‌చేసింది. తర్వాత రెండు రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 9న మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసి ఈడీ సైతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను అరెస్ట్‌చేసింది.అంబేడ్కర్‌కు రుణపడ్డా: సిసోడియాతీర్పు నేపథ్యంలో శుక్రవారం తీహార్ జైలు నుంచి సిసోడియా విడుదలయ్యారు. పెద్దసంఖ్యలో జైలు వద్దకొ చ్చిన ఆప్ కార్యకర్తలు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ‘‘ నిరంకుశ కేంద్రప్రభుత్వ చెంప చెళ్లు మనిపించేందుకు రాజ్యాంగ అధికారాలను వినియోగించిన కోర్టుకు నా కృతజ్ఞతలు. శక్తివంతమైన రాజ్యాంగం, ప్రజా స్వామ్యం వల్లే బెయిల్ పొందగలిగా. ఈ బెయిల్ ఉత్తర్వు చూశాక జీవితాంతం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రుణపడిపోయా. ఈ అనైతిక యుద్ధానికి రాజ్యాంగబద్ధంగా తార్కిక ముగింపు పలికాం. ఏదో ఒక రోజు ఈ చెడు సంస్కృతి అంతమవుతుంది. అప్పుడు బెయిల్‌పై కేజ్రీవాల్ కూడా విడుదల అవుతారు’’ అని సిసోడియా అన్నారు.ఆప్ హర్షంసిసోడియాకు బెయిల్‌పై ఆప్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. ‘‘ సత్యమేవ జ యతే. ఢిల్లీలో విద్యా విప్ల వానికి నాంది పలికిన సిసోడియాకు ఇది గొప్ప విజయం. ఇది విద్యా విజయం, విద్యా ర్థుల విజయం’’ అని ఢిల్లీ మహిళా మంత్రి అతిశి వ్యాఖ్యానించారు. -
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కుంభకో ణంలో ఆరోపణలపై అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశా లను సవాల్ చేస్తూ కవిత తరఫు న్యాయ వాది మోహిత్‌రావు గురువారం క్రిమినల్ ఎస్ ఎల్పీ దాఖలు చేయగా శుక్రవారం రిజిస్ట్రీ వెరిఫై చేసింది.అనంతరం సోమవారం కేసుల విచా రణ జాబితాలో చేర్చింది. ఈడీ, సీబీఐ కేసు ల్లోనూ బెయిల్ కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసో డియాకు బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మా సనం ముందుకు కవిత పిటిషన్ రానుంది. -
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం(ఆగష్టు 12) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరిస్తూ.. న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా లిక్కర్ కేసులోనే ఆప్ నేత మనీష్ సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 17 నెలల జైలు జీవితం అనంతరం నేడు సాయంత్రం తిహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరో నేత సత్యేంద్ర జైన్ ఇంకా జైలులోనే ఉన్నారు. -
17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. శుక్రవారం సాయంత్రం తిహార్‌జైలు నుంచి బయటకు వచ్చారు. సిసోడియాకు ఘన స్వాగతం పలికేందుకు ఆప్ నేతలు అతిషి, సంజయ్ సింగ్.. పార్టీ కార్యకర్తలు జైలు గేటు వద్దకు భారీగా చేరకున్నారు.జైలు నుంచి విడుదలైన సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజల ప్రేమ, దేవుడి ఆశీర్వాదం, నిజానికి ఉన్న శక్తి కారణంగానే నేడు తాను జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. అన్నింటికి మించి తనను దేశ రాజ్యాంగమే రక్షించింనట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.నియంతృత్వ ప్రభుత్వాలు, చట్టాల ద్వారా ప్రతిపక్షనాయకులను కటకటాల వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తే.. రాజ్యాంగం వారిని తప్పక కాపాడుతుంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కల. రాజ్యాంగ శక్తితోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.#WATCH | Former Delhi Deputy CM and AAP leader Manish Sisodia greets party leaders and workers who have gathered outside Tihar Jail to welcome him. He was granted bail by Supreme Court today, in Delhi excise policy case. pic.twitter.com/lZTDT5iH3l— ANI (@ANI) August 9, 2024కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.కాగా లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆ తరువాత రెండు వారాలకే ఈడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. .దాదాపు 17 నెలల జైలు శిక్ష అనంతరం నేడు బెయిల్‌పై విడుదలయ్యారు.#WATCH | Former Delhi Deputy CM and AAP leader Manish Sisodia walks out of Tihar Jail. He was granted bail in Delhi excise policy case by Supreme Court today. pic.twitter.com/pBEEkvQZXz— ANI (@ANI) August 9, 2024 -
‘మా హీరోకి బెయిల్ వచ్చింది’.. అంత సంబరపడిపోకండి.. ఆప్‌పై బీజేపీ సెటైర్లు
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 17 నెలల క్రితం అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనిష్ సిసోడియాకు భారీ ఊరట దక్కింది. శుక్రవారం (ఆగస్ట్ 09) ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ నేతలు మా ఢిల్లీ హీరోకి బెయిల్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తుంటే..అంత సంబరపడిపోకండి అంటూ’బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సుప్రీం ధర్మాససం ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని వ్యాఖ్యానించింది. చివరికి సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.సుప్రీం కోర్టులో సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్‌తో పాటు ఇతర ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మా హీరో మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది. ఆయనకు బెయిల్ రావడంపై ఈ రోజు దేశమంతా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. - రాఘవ్ చద్దామరో ఆప్ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి సంతోషం వ్యక్తం చేశారు. అదే మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ఈ కేసు నుంచి విముక్తి కలుగుతుందని అన్నారు.నిజం గెలిచింది. 17 నెలల తర్వాత సిసోడియాకు ఈ రోజే బెయిల్ వచ్చింది. ఇది ఢిల్లీ ప్రజల విజయం. తర్వలోనే కేజ్రీవాల్‌కు సైతం బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.- అతిషిమద్యం పాలసీ కేసులో అరెస్టై ఆరునెలల జైలు శిక్షను అనుభవించి.. బెయిల్‌పై విడుదలైన ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. నియంతృత్వానికి ఈ తీర్పు చెంపదెబ్బలాంటిందని స్పష్టం చేశారు. - సంజయ్ సింగ్#WATCH | On Supreme Court granted bail to AAP leader Manish Sisodia, Delhi BJP President Virendraa Sachdeva says, "Getting bail does not mean that someone is not guilty. Manish Sisodia has got bail but the investigation is still on and the BJP has always respected the court's… pic.twitter.com/qtmea7H7oG— ANI (@ANI) August 9, 2024అదే సమయంలో ఆప్ నేతల్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ‘సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందంటూనే .. కేసులో నిందితుడికి బెయిల్ రావడం అంటే అభియోగాల నుండి విముక్తి పొందడం కాదు’అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ‘విచారణలు జరుగుతున్నాయి.. త్వరలో కోర్టు సాక్ష్యాలను చూస్తుంది’ అని మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లేదా ఇతరులు ఎవరైనా సరే.. మద్యం పాలసీ కుంభకోణానికి మధ్యవర్తిత్వం వహించారని, ఈ అంశం ప్రజా కోర్టులో అందరి ముందు ఉందని పునుద్ఘాటించారు. -
కవిత బయటకు వస్తుంది.. వచ్చే వారంలో బెయిల్: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని చెప్పుకొచ్చారు ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.కాగా, కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ.. తీహార్ జైలులో ఉన్న కవిత ఆరోగ్యం క్షీణించింది. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతోంది. వచ్చే వారంలో బెయిల్‌కు వస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందనే వార్తలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితకు ఇప్పటికే కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది. -
సిసోడియాకు బెయిల్.. కేజ్రీవాల్ కేసుకు కూడా ప్రయోజనం: లాయర్
న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు మంజూరు చేసింది. దీంతో సిసిఓడియా రేపు తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు.ఈ సందర్భంగా సిసోడియా తరపున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మీడియాతో మాట్లాడుతూ. విధివిధానాలు పూర్తయిన తర్వాత సిసోడియా శనివారం తిహార్ జైలు నుండి విడుదల కానున్నారని తెలిపారు. ఈ తీర్పు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.అయితే లిక్కర్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీని ఆగష్టు 20వరకు కోర్టు పొడిగించింది. కాగా లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు అయ్యారు. ఆ తరువాత రెండు వారాలకే ఈడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. 18 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా.. సుదీర్ఘకాలం ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదు. అది ఆ వ్యప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు. ‘బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది’. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ప్రస్తుతం జైలు నంబర్ 1లో ఉన్న ఆయన.. ఖైదీలను విడుదల చేయడానికి సాధారణంగా ఉపయోగించే గేట్ నంబర్ 3 ద్వారా బయటకు అవకాశం ఉందని తీహార్ జైలు వర్గాలు సూచించాయి. అయితే, భద్రతాపరమైన సమస్యలు ఏవైనా ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. సిసోడియా విడుదలకు సమయం బెయిల్ ఆర్డర్ ప్రాసెసింగ్‌పై ఆధారపడి ఉండనుంది. -
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్
-
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కస్టడీ నేటితో ముగియటంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి ఆగస్ట్ 20వరకు పొడిగించింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సరైన కారణాలు లేకుండా అరెస్ట్ చేసిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు -
కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు
ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది. మీరు(ఈడీ) ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టుకు ఇచ్చిన బెయిల్‌ను ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈడీ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ విషయంలో నేను అయోమయంలో ఉన్నాను. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా..మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. కాగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలను వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. -
లిక్కర్ స్కాం: సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు షాక్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణం లేకుండానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పలేమని విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. అయితే ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.Aam Aadmi Party (AAP) says, "Arvind Kejriwal will approach Supreme Court, challenging the order of the Delhi Court. At Supreme Court, he will challenge his arrest by the CBI as well as appeal for bail." https://t.co/Ry9m0zxCft— ANI (@ANI) August 5, 2024కాగా లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు నేడే
ఢిల్లీ:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టిన తీర్పును ఇవాళ(సోమవారం) ఇవ్వంది. లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ‘‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. -
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలు పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలని గతంలోనే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ముఖ్యపాత్ర పోషించారని, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐలు తమ వాదనల్ని వినిపించాయి. అందుకు తగిన ఆధారాల్ని కోర్టు ముందుంచాయి. దీంతో ట్రయల్ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై జూలై 22న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కేసును సోమవారానికి (ఆగస్టు 5)కి వాయిదా వేశారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది. -
లిక్కర్ స్కాం: కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ పొడిగించింది ట్రయల్ కోర్టు. రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్ కోర్టు. ఇదిలా ఉంటే.. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీలను సైతం కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో.. దర్యాప్తు సంస్థ ప్రవేశపెట్టిన ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగష్టు 9వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత ఏ17గా ఉన్నారు. కవితతో పాటు మిగతా నిందితులను కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. అయితే.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరీ బవేజా, కవిత లాయర్‌కు గుర్తు చేశారు. చివరకు.. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేశారు. -
కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
సాక్షి,ఢిల్లీ : ఢీల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన సీబీఐ అరెస్ట్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది.ఢిల్లీ లిక్కర్ కేసులో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ ప్రారంభిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ దర్యాప్తులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయన ఇంకా తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి వచ్చింది. సీబీఐ కేసులో బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సెంట్రల్ బ్యూరో ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వటాన్ని సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఇవాళ సీబీఐ కేసులో హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ విచారణ చేపట్టనున్నారు.ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. జూన్ 26న సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు అనుమతితో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక.. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కేజ్రీవాల్ ఒకరని సీబీఐ అభియోగాలు మోపింది. కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్ అనేక మంది మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అయితే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. అనంతరం ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేయటంతో తిహార్ జైలులోనే ఉన్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ నేటితో ముగియగా.. తిహార్ జైలులో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగించింది. ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ మే 10న మధ్యంత బెయిల్ పొందారు. బెయిల్ గడువు ముగిసిన అనంతరం జూన్ 2ను ఆయన మళ్లీ తిహార్ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
కవితకు అస్వస్థత.. నేడు తీహార్ జైలుకు కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నేడు తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితతో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.కాగా, కేటీఆర్ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కవితను కలువనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కవిత ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు.. కొద్దిరోజుల క్రితమే కవితకు ఎయిమ్స్ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి రాజకీయ మలుపు తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్ట్నెట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆప్ పార్టీ నేతల మధ్య విమర్శలు తీవ్రం అయ్యాయి.సీఎం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగానే బరువు తగ్గుతున్నారని, అందుకు తగ్గట్టుగా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తాజాగా ఆరోపించడంతో వివాదం ముదిరింది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారని ఎల్జీ ఆరోపణలు మాత్రమే చేయలేదు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ఛీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ రిపోర్టుల్లో గ్లూకోమీటర్, సీజీఎంఎస్ ( రక్తంలో చక్కెర మోతాదులు నిరంతరం గుర్తించి నమోదు చేసే పరికరం. కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటరింగ్) వివరాల్లో తేడాలు ఉన్నాయి. జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కేజీల బరువు తగ్గారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారు. జూన్ 2 కంటే ముందు ఆయన 63. 5 కేజీల బరువు ఉండగా... ఇప్పుడు రెండు కేజీలు తగ్గి 61.5 కిలోలకు చేరింది.’ అని ఎల్జీ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన బరువు, బ్లడ్ షుగర్ తగ్గుతోందని ఇటీవలే ఆప్ మంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోల్సిన అంశం. అయితే...ఎల్జీ వీకే సక్సెనా చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఎల్జీ ఆరోపణలను ఖండించింది. ‘ఎల్జీ సార్.. మీరు ఎలాంటి జోక్ వేస్తున్నారు?. ఎవరైనా రాత్రికి రాత్రి తమ షుగర్ వెవల్స్ తగ్గించుకుంటారా? ఇది చాలా ప్రమాదకరం. మీకు ( ఎల్జీ) ఈ వ్యాధి గురించి ఏమి తెలియదు. మీలాంటి వారు ఇలాంటి లేటర్ రాయటం సరికాదు. ఇటువంటి పరిస్థితి మీకు రావొద్దని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఎల్జీపై విమర్శలు చేశారు. ‘ఎల్జీ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ, ఆయన డయాబెటిస్‌లో స్పెషలైజ్ ఎప్పుడు అయ్యాడో నాకు తెలియదు’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎల్జీపై సెటైర్లు వేశారు. -
క్షీణించిన కవిత ఆరోగ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరో గ్యం క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తిహార్ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్ కంటతడి పెట్టారు. ఎయిమ్స్‌లో ఆమెను చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచి్చంది. పదికిలోల బరువు తగ్గిన కవిత భర్త అనిల్ సమక్షంలో కవితకు ఎయిమ్స్ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. కవిత నీరసంగా ఉండటం, ఇంకా జ్వరంతో బాధపడటం, బరువు తగ్గడంపై అనిల్ చలించిపోయారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పది కిలోల బరువు తగ్గిన విషయాన్ని తండ్రి కేసీఆర్, తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్‌రావుకు తెలిసి ఆమె అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన కనబరుస్తున్నట్లు సమాచారం. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సోమవారం ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ అనారోగ్యానికి గురైన కవితను రెండు పర్యాయాలు దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి, ఒకసారి ఎయిమ్స్‌కు తరలించిన తిహార్ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి రానున్నారు. -
కవిత కస్టడీ పొడిగింపు.. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో జూలై 22వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కవితకు అస్వస్థత నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇక, లిక్కర్ కేసులో విచారణ కోసం కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు జైలు అధికారులు. ఈ సందర్భంగా తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్షా ఫలితాల్లో(ల్యాడ్ టెస్టులు) వ్యత్యాసాలను కవిత న్యాయమూరి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో, కవితకు వైద్యపరీక్షలకు కోర్టు అనుమతించింది. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్టును కోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రెండు క్రితం జైలులో కవిత అస్వస్థతకు గురికావడంతో దీన్‌దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కాగా, కవితకు ప్రైవేటు ఆసుపత్రిలో చెకప్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దరఖాస్తు చేయడంతో కోర్టు దీనికి అంగీకరించింది. -
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థత కు గురయ్యారు. మంగళవారం ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో జైలు అధికారులు ఢిల్లీలోని హరినగర్ లో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రభుత్వ ఆస్ప త్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రక్త పరీక్షలు, గైనిక్ సంబంధ సమస్యల టెస్టులు చేయించి.. తిరిగి జైలుకు తరలించారు. నిజానికి కవితకు మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొన్నాళ్లుగా గైనిక్ సమస్యతో సతమతంఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న కవితను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యు డీషియల్ కస్టడీపై జైలులో ఉన్నారు. ఇటీవల ఆమె పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రా థోడ్ తదితరులు జైలులో కవితను పరామర్శించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అయితే కవిత గైనిక్ (స్త్రీ సంబంధిత) సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. మంగళవారం దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు సంబంధిత వైద్య పరీక్షలు చేశారని.. బుధవారం ఉదయానికల్లా రిపోర్టులను జైలు అధికారులకు పంపనున్నారని సమాచారం. తనకు గైనిక్ సమస్య ఉందని, బెయిల్ ఇవ్వాలని కవిత గతంలోనే పిటిషన్లు వేసినా.. కోర్టుల నుంచి సానుకూల తీర్పురాలేదు.ఇంటి ఫుడ్ తినట్లేదంటున్న బీఆర్ఎస్ వర్గాలుతిహార్ జైలులో ఉన్న కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నాలుగైదు రోజులపాటు ఇంటి భోజనం చేసిన కవిత.. తర్వాత భోజనం తీసుకురావొద్దని కుటుంబ సభ్యులకు, తమ న్యాయవాదికి చెప్పారు. జైలులో అందరు ఖైదీలకు పెట్టే ఆహారాన్నే కవిత తీసుకుంటున్నారు.కవిత కోసం ఇంటి నుంచి తీసుకొస్తున్న భోజనాన్ని తనిఖీ పేరుతో నలుగురైదుగురు చేతులు పెట్టి పరిశీలిస్తున్నారని.. అలా చేస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉండటంతోనే ఆమె ఇంటి భోజనం వద్దన్నారని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ఇంటి భోజనం తినకపోవడం, గతంలో ఉన్న గైనిక్ సమస్యల కారణంగా.. కవిత అస్వస్థతకు గురైనట్టు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. -
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్ జైలుకు..
ఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై వదంతులు!
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లినప్పటి నుండి 8.5 కిలోల బరువు తగ్గారని అంటున్నారు. ఆప్ నేతల వ్యాఖ్యలపై తీహార్ జైలు అధికారులు స్పందిస్తూ కేజ్రీవాల్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్‌ను విడుదల చేశారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మద్యంతర బెయిల్ మీద బయటకొచ్చి లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేశారు. ఏప్రిల్ 1వ తేదీన తీహార్ సెంట్రల్ జైలు నెం.2లోకి ప్రవేశించిన రోజు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే మే 10 నుంచి జూన్ 2వరకు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. తాత్కాలిక బెయిల్ వచ్చిన సమయంలో కేజ్రీవాల్ బరువు 64 కిలోలు. తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత అంటే జూన్ 2న కేజ్రీవాల్ బరువు 63.5గా ఉంది. ఆయన, ప్రస్తుత బరువు 61.5కిలోలుగా ఉందని వివరణిచ్చింది. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడంకాగా, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం లేదా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం తగ్గినట్లు అని జైలు వైద్యాధికారి చెప్పినట్లు జైలు నిర్వహాణ విభాగం అధికారులు తెలిపారు. కేజ్రీవాల్‌కు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని, జైలుకు చెందిన మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆయనకు మందులు ఇస్తారని అని విడుదల చేసిన అధికారిక నోట్లో పేర్కొంది.గతంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు 70 కిలోల బరువు ఉన్నారని, ఆ బరువు 61.5 కిలోలకు తగ్గిందని చెప్పారు.ఇలా బరువు పెరగడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమని వ్యాఖ్యానించారు.నిరంతరం వైద్యుల పర్య వేక్షణలోజైలులో ఉన్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ చాలాసార్లు పడిపోయిందన్న ఆప్ నేతల వాదనను తిప్పికొడుతూ ‘ప్రస్తుతం, కేజ్రీవాల్ బ్లడ్ షుగర్‌ను మెడికల్ బోర్డు సలహా మేరకు పర్యవేక్షిస్తున్నాం. బోర్డ్ సలహా మేరకు చికిత్స, ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. రక్తపోటు, బ్లడ్ షుగర్, బరువును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని, ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పిన తీహార్ జైలు అధికారులు.. రోజుకు మూడుసార్లు ఇంట్లో వండిన ఆహారాన్ని తింటున్నారని జైలు అధికారులు నివేదించారు.నిరాధార ఆరోపణలు సరికాదుఆప్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు ఆరోపిస్తున్నారు. అటువంటి ఆరోపణలు, తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. జైలు పరిపాలనను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీహార్ జైలు నివేదికపై స్పందించిన సంజయ్ సింగ్తీహార్ జైలు నివేదికపై స్పందించిన ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ బరువు తగ్గారని, కేజ్రీవాల్ రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినట్లు పడిపోయిందని జైలు నివేదిక నిర్ధారిస్తుంది. షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే, నిద్రలో కోమాలోకి జారిపోవచ్చు.బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అన్నారు. ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ యూనిట్ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న వీరేంద్ర సచ్‌దేవా, ఆప్ నాయకులు కోర్టును తప్పుదోవ పట్టించడానికి, కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేలా చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. -
కేజ్రీవాల్ ప్రాణాలతో బీజేపీ చెలగాటం: ఆప్ ఎంపీ సంజయ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ బరువు 8. 5 కేజీలు తగ్గారని, అదేవిధంగా ఆయన షుగర్ లెవల్స్ 5 సార్లు 50 ఎంజీ/డీఎల్ కిందికి పడిపోయాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ జైలులో తీవ్రమైన అనారోగ్యంతో బాధపెట్టాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలా చేయటం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు.‘‘మార్చి 21 తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్ట్ చేసేనాటికి ఆయన బరువు 70 కేజీలు, కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్ బరువు 61. 5 కేజీలకు పడిపోయింది. అంటే 8. 5 కేజీల బరువు తగ్గారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను చిత్రహింసలకు గురిచేసి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కేజ్రీవాల్‌ను బాధ పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా బరువు తగ్గటంపై ఎటువంటి పరీక్షలు నిర్వహించటం లేదు. బరువు తగ్గటం, షుగర్ లేవల్స్ పడిపోవటం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు. ఇప్పటికే ఐదుసార్లు షుగర్ లేవల్స్ లెవల్స్ పడిపోయాయి. 50 ఎంజీ/డీఎల్ కంటే కిందికి పడిపోతే ఆరోగ్యం క్షీణించి కోమాకు వెళ్తారు. కేజ్రీవాల్‌పైనే ఎందుకు ఇలా చేస్తున్నారు?’అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయటంతో కేజ్రీవాల్ ఏప్రిల్1 నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ అరెస్ట్ కేసులో శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. అయినా కూడా కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. లిక్కర్ కేసులో ఆయన్ను దర్యాప్తు కోసం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంతోపాటు తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రౌజ్‌ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 22కు విచారణను వాయిదా వేశారు. కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, సీబీఐ చార్జిïÙట్లో తప్పులున్నాయని కవిత తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ.. తప్పులు లేవన్నారు. డిఫాల్ట్ బెయిల్, చార్జిషీట్లో తప్పులపై విచారణ జరిగేవరకు చార్జిïÙట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయి దా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టు కు విజ్ఞప్తి చేశారు. అయితే.. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబంధం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కాగా, ‘60 రోజుల తర్వాత తప్పులతో కూడిన చార్జిïÙట్ను దాఖ లు చేయడం తన క్లయింట్ డిఫాల్ట్ బెయిల్ హక్కులను కాలరాయడమే’అని కవిత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనల అనంతరం 22న కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. -
లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్.. బీజేపీ కుట్రలు బహిర్గతం: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ.. ఇదే లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కస్టడీ పొడిగించడంతో ఆయన జూలై 25 వరకు జైలులోనే ఉండనున్నారు.అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. సుప్రీంతీర్పుపై ఆప్ సంబరాలు చేస్తోంది. బీజేపీ కుట్రలను న్యాయస్థానం బట్టబయలు చేసిందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ.. సత్యమేవ జయతే అంటూ కేజ్రీవాల్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్న చిత్రాన్ని ఆప్ షేర్ చేసింది.हर सरकार की कोई ना कोई उपलब्धि होती है।मोदी सरकार की सबसे बड़ी उपलब्धि यही है कि मोदी और अमित शाह अगर किसी को चुनाव में हरा नहीं सकते तो उसे फ़र्ज़ी केस में Jail में डाल देते हैं।मैं मोदी और अमित शाह से यही कहना चाहता हूँ कि वो इस गंदी राजनीति को बंद कर दिल्ली और देश का समय… pic.twitter.com/9qt9IqFUH4— AAP (@AamAadmiParty) July 12, 2024 తీర్పు అనంతరం విలేకరుల సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. ఢిల్లీలో పాలన ఆపేందుకు సీఎం కేజ్రీవాల్‌ను తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ సర్కస్‌గా అభివర్ణించారు. బీజేపీ పన్నిన మద్యం కుంభకోణాన్ని సుప్రీంకోర్టు కూల్చివేసిందని ఆయన అన్నారు.सत्यमेव जयते 🇮🇳 pic.twitter.com/dG5o2eHB0l— AAP (@AamAadmiParty) July 12, 2024 అయితే ఆప్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేజ్రీవాల్‌కు కోర్టు మాత్రమే ఇచ్చిందని, నిర్ధోషిగా విడుదల కాలేదని చురకలంటించింది. మధ్యంతర బెయిల్ పొందడం అంటే నేరం నుంచి విముక్తి పొందడం కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ముద్దాయి అని మొత్తం స్కాం వెనుక ఆయనే సూత్రధారి అని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను సీఎం లూటీ చేశాడని, సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
లిక్కర్ స్కాం.. సీబీఐ కేసులో కవిత విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జూలై 22 వాయిదా వేసింది.కోర్టులో వాదనలు సందర్భంగా.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ తప్పులు లేవని చెప్పారు.చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్‌షీట్‌లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని నితీష్ రాణా తెలిపారు.డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌పై తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలన్న నితీష్ రాణా వాదించారు. అయితే చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబందం లేదన్న సీబీఐ వాదించింది. చార్జ్‌షీట్ పూర్తిగా లేదని తాము వాదించడం లేదని, తప్పుగా ఉందని మాత్రమే చెబుతుననట్లు నితీష్ రాణా పేర్కొన్నారు.దీనికి సీబీఐ స్పందిస్తూ.. తాము సరైన పద్దతిలో చార్జ్‌షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. 60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్‌షీట్ దాఖలు చేయడం కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేనని కవిత న్యాయవాది ఆరోపించారు. అనంతరం కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్షీట్నుపరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది. -
కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే.. కస్టడీ పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో, కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనల అనంతరం కేజ్రీవాల్ కస్టడీని జూలై 25వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని కోర్డు పొడిగించింది. దీంతో, ఆయన మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. Delhi Excise policy CBI case: Rouse Avenue Court has extended judicial custody of CM Arvind Kejriwal in the CBI case till July 25.(file pic) pic.twitter.com/HpehzDbDE5— ANI (@ANI) July 12, 2024 ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరు ముగ్గురే కీలకమని ఈడీ గట్టిగా వాదిస్తోంది. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ,సాక్షి: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో జైల్లోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్ అరెస్టుకు తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే 90 రోజులపాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేయాలా లేదా అన్నది ఆయన (కేజ్రీవాల్) నిర్ణయానికే వదిలేస్తున్నాం అని వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం ఈడీ కేసులో సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ దక్కినా..ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆయన జ్యుడిషయల్ కస్టడీ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు. ఈనెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఈడీ అరెస్ట్ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మార్చి 21న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అక్రమమని ఈడీని సవాల్ చేస్తూ ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది. అందులో ఎలాంటి చట్టవిరుద్దం లేదని, కేసు నిమిత్తం దర్యాప్తుకు రావాలని కోరుతూ పదే పదే జారీ చేసిన సమన్లపై స్పందించ లేదు కాబట్టే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సమర్దించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు ఈడీ స్పందన కోరింది. విచారణ సందర్భంగా,మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అతనికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువడిన తర్వాత,కేజ్రీవాల్ అరెస్టుకు ముందు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాలని, సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఈడీకి సూచించింది.ఈ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా,దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు ఇవాళ వెలువరించింది. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌కు జడ్జిమెంట్ డే
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు (శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేయడాన్ని సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది.మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్ చేయాగా.. జూన్ 25న ఢిల్లీ హైకోర్టు ట్రాయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది. -
కేజ్రీవాల్ ఛార్జిషీట్లో కవిత పేరు "ఆ 100 కోట్ల ముడుపుల లెక్క"
-
కేజీవాల్‌పై ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం జూలై 15కి వాయిదా వేసింది.ఈ కేసులో కేజ్రీవాల్ ప్రతిస్పందనకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఈ కేసును జూలై 15కి వాయిదా వేసింది.కాగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. 232 పేజీల ఛార్జ్ షీట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ కేసులో కేజ్రీవాల్‌ను కింగ్‌పిన్‌గా, కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. లిక్కర్ స్కాంలో పొందిన డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఆరోపించింది. కేజ్రీవాల్, వినోద్ చౌహన్తో వాట్సాప్ చాట్లను ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కవిత పేరును కూడా ప్రస్తావించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ ద్వారా రూ. 25 కోట్ల లావాదేవిలు జరిగినట్లు ఈడీ తెలిపింది. కవిత దగ్గర నుంచి రెండు బైకుల్లో నగదు తీసుకెళ్ళి దినేష్ అరోరాకు అప్పగించారు. ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరారోలు కలుసుకున్నారు. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడు. ముత్త గౌతమ్ సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయి.అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌తో కలిసి ఏడు కోట్ల రూపాయలను అవార్ల ద్వారా అరవింద్ సింగ్ ఇచ్చారు. 45 కోట్ల రూపాయలను గోవాకు హవాలా ద్వారా సాగర్ పార్టీలకు చేరవేశారు. ముత్త గౌతమ్‌కు సంబంధించిన చారియట్ మీడియా ద్వారా మీడియా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగాయి. చారియట్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు తోపాటు చాలామందికి లింకులు ఉన్నాయని ఈడీ పేర్కొంది.మరోవైపు కేజ్రీవాల్, ఆప్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం విచారణకు తీసుకుంది. కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.కాగా మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, జూన్ 26న అవినీతి కేసులో ఆప్ అధినేతను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో గత వారం ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు దర్యాప్తు సంస్థకు కోర్టు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది.. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను ఢిల్లీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ 7వ సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. తాజా ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జూలై 12వ తేదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. తనను సీబీఐ అరెస్ట్ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది. -
నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ
సాక్షి,న్యూఢిల్లీ : నేడు లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఏముందిఢిల్లీ మద్యం పాలసీలో మార్చి 15న ,2024న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మద్యం కేసులో కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.ఈడీ,సీబీఐ ఆధారాల్ని తోసిపుచ్చలేంకోర్టు విచారణ సమయంలో సీబీఐ, ఈడీలు కొత్త ఆధారాల్ని వెలికితీయడం, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయం ఉందని నిరూపించేలా ఈడీ,సీబీఐ ఆధారాలు సేకరించిందని, వాటిని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూఈ నేపథ్యంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాలసీ కేసుకు సంబంధించి తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, మరోసారి విచారించేందుకు అనుమతి కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో తెలిపింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఒకవేళ సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టు సానుకూలంగా స్పందిస్తే.. దానికి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసి.. కేసుకు సంబంధిత కొత్త ఆధారాల్ని కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. -
కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత.. సీజేఐకు 150 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్‌లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్‌పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్‌ను హోల్డ్‌లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
-
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ కేసులో కవిత కస్టడీని జులై 18 వరకు పొడగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించిందిరౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జులై 18 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు.అదే విధంగా ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఆప్ నేత మనిష్ సిసోడియా కస్టడీని జులై 25వ తేదీకి పొడిగిస్తూ బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరస్తూ న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నారు. -
కవిత జ్యూడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ కస్టడీని కోర్టు మళ్లీ పొడిగించింది. కస్టడీ ముగియడంతో బుధవారం ఉదయం ఆమెనుతీహార్ జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. దీంతో జడ్జి జులై 25వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్ నివాసంలో ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత కస్టడీని పలుమార్లు పొడిగించింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె చేస్తున్న అభ్యర్థనలను న్యాయస్థానాలు తోసిపుచ్చుతూ వస్తున్నాయి. కవితతో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని సైతం అదే తేదీ దాకా పొడిగించింది. -
కవిత బెయిల్ తీర్పు.. ఉత్కంఠ
-
కవిత బెయిల్ పిటిషన్లపై సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు(సోమవారం) తీర్పు వెల్లడించనుంది. మూడు నెలలుగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు.ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జులై1కు రిజర్వు చేసింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. -
సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్: ప్యాంట్ బెల్ట్‌కు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో అవినీతి వ్యవహారం జరిగిందని, ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు సంస్థ అంటోంది. అయితే.. సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది.ఇంటి భోజనానికి అనుమతించాలని, అలాగే.. కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరారు. అలాగే.. ప్యాంట్ బెల్ట్ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని, జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని, కాబట్టి దానిని కూడా అనుమతించాలని కోరారాయన. వీటన్నింటికి కోర్టు అనుమతించింది. ఈ విజ్ఞప్తులతో పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను.. ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసన అనంతరం కేజ్రీవాల్‌ను జూన్ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్‌లో కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను.. విచారణ జరిపి మరీ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు.. కొత్త పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ సెంట్రల్ జైలులో జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు తొలుత ఆయనను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో అవినీతి వ్యవహారాలపై విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజ్ఞాపన సమరి్పంచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనను కోర్టుకు తెలియజేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని, తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈ కేసుతో సంబంధం లేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్‌కు సిసోడియాను బాధ్యుడిని చేస్తూ తాను సీబీఐకి స్టేట్మెంట్ ఇచి్చనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిసోడియాకు గానీ, ఇతరులను గానీ వ్యతిరేకంగా తాను సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. అరెస్టు ఇప్పుడే ఎందుకంటే.. తాము నిజాలు మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి ఉందని తమ విజ్ఞాపనలో సీబీఐ పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఇప్పుడే అరెస్టు చేయాలని ఎందుకు భావిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వేచి చూశామని, ఎన్నికలు ముగియడంతో అరెస్టు చేసి, విచారణ కొనసాగించాలని నిర్ణయించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సిఫార్సు చేసినట్లు కేజ్రీవాల్ సేŠట్‌ట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అనంతరం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి, మూడు రోజులపాటు కస్టడీలో ఉంచి విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అమితాబ్ రావత్ అనుమతి ఇచ్చారు. బయటకు రాకుండా కుట్రలు: సునీతా తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా మొత్తం వ్యవస్థ కుట్రలు సాగిస్తోందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో చట్టం అమల్లో లేదని, కేవలం నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనూ సింఘ్వీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. -
సిసోడియా అమాయకుడు, ఆయన్ను నిందించలేదు: కోర్టులో కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాయి. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది.విచారణ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కింద నగరంలో మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే సిఫార్సు చేశారని సీఎం కేజ్రీవాల్ తమ విచారణలో చెప్పినట్లు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు.అయితే సీబీఐ ఆరోపణలు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, తమ పరువు తీయడమే దర్యాప్తు సంస్థల లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.కేజ్రీవాల్ తిరస్కరణను తిప్పికొట్టిన సీబీఐ.. తాము వాస్తవాలను మాట్లాడుతున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ వాదనలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనను తాము చదివామని ఆయన ఆ విధంగా చెప్పలేదని కోర్టు పేర్కొంది.ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సీబీఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింకేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. -
లిక్కర్ కేసులో కేజ్రీవాలే కీలకం: సీబీఐ
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ హైడ్రామా నడిచింది. కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టాలంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని వాదించింది. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ కోరింది. లిక్కర్ కేసులో సోమవారం నాడు తీహార్ జైల్లోనే సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బుధవారం ఉదయం తీహార్ జైలు అధికారులు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం.. కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే.. కేజ్రీవాల్‌ను ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ తరఫు లాయర్. అయితే.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి అందుకు అభ్యంతరం తెలిపారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన అవసరానికి గల కారణాలను సీబీఐ, న్యాయమూర్తికి వివరించారు.‘‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాలే కీలకం. ఆయన నివాసంలోనే మద్యం పాలసీ తయారైంది. సౌత్‌లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారు. రూ.338 కోట్లు ేతులు మారినట్లు ఆధారాలున్నాయి. అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీబీఐ వాదించింది. విచారణ జరుగుతున్న సమయంలో.. కేజ్రీవాల్ కళ్లు తిరుగుతున్నాయని, టీ-బిస్కెట్ కావాలని కోరారు. దీంతో ఆయన షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని నిర్ధారించుకున్న అధికారులు.. కోర్టు అనుమతితో ఆయన్ని మరో గదిలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. #WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal being produced at the Rouse Avenue Court by CBI for a hearing in the liquor policy case. pic.twitter.com/ruFdQNecu4— ANI (@ANI) June 26, 2024 -
నేడే తీర్పు: సీఎం కేజ్రీవాల్ ఊరట దక్కేనా?
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్ కేసులో రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై ఈడీ పిటిషన్ వేయటంతో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ట్రయిల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేపై సీఎం కేజ్రీవాల్ ఆదివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టి.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఆప్ నేతల్లో టెన్షన్ నెలకొంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఇటీవల రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని కేజ్రీవాల్లో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఢిల్లీ హైకోర్టు సంపూర్ణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే దానిపై పరిశీలన చేస్తామని పేర్కొంది. తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక.. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది.ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు.. సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇక.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దర్యాప్తు సంస్థ ఈడీ స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై నిన్న(ఆదివారం) సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. -
‘కేజ్రీవాల్ బరువు 8 కేజీల తగ్గి.. ఆరోగ్యం క్షీణిస్తోంది’
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన మార్చి 21 నుంచి సుమారు 8 కేజీల బరువు తగ్గినట్లు ఆప్ చెబుతోంది. అరెస్ట్‌కు ముందు ఆయన బరువు 70 కేజీలు ఉండగా.. అనంతరం ఆయన బరువు జూన్ 22 వరకు 8 కేజీలు తగ్గి 62 కేజీలకు పడిపోయిందని ఆప్ నేతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో అరవింద్ కేజ్రీవాల్ 8 కేజీల బరువు తగ్గారని తెలిపారు. ఇలా బరువు తగ్గటంపై అసలైన కారణం తెలుసుకోవటం కోసం వెంటనే ఆయన డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గటంపై ఎయిమ్స్ వైద్యులు ఆయనకు ఇచ్చే ఆహారంలో పూరీలు, పరాటాలు చేర్చాలని సూచింనట్లు ఆప్ పేర్కొంది.ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు వారం రోజులు పాటు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాక్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేసీ.. బరువు తగ్గడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారని ఆప్ తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ట్రయిల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. -
Delhi liquor scam: జైల్లోనే కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సు«దీర్‌కుమార్ జైన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్‌ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. -
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్
-
Delhi Liquor Scam: సీబీఐ కేసులో కవిత కస్టడీ మరోసారి పొడిగింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. జూలై 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. తొలుత ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు.అనంతరం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. -
కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. రిలీజ్‌పై స్టే
న్యూఢిల్లీ, సాక్షి: న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఆయన రెగ్యులర్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీంతో కాసేపట్లో జైలు నుంచి విడుదల కావాల్సిన ఆయన.. బయటకు రాకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరింది. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తాము విచారణ జరిపేంతవరకు కేజ్రీవాల్ రిలీజ్‌ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.లిక్కర్ కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిన్న పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు గురువారం సాయంత్రం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్ బిందు ఆదేశించింది. అలాగే.. తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.ఈ క్రమంలో.. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్‌పై ఆంక్షలు విధించింది ట్రయల్ కోర్టు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే ఈ ఉదయం కేజ్రీవాల్ విడుదల నేపథ్యంలో.. నీటి సంక్షోభంపై పోరాటం చేద్దామని ఉత్సాహంతో ఉన్న ఆప్ శ్రేణులకు ఆయన రిలీజ్‌పై స్టే ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా ఢీలా పడిపోయింది.ఈడీ వాదనల్ని పట్టించుకోని కోర్టుకేసులో సహనిందితులు పొందిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని ఈడీ వాదించింది. 2021 నవంబరు 7న కేజ్రీవాల్ గోవాలోని గ్రాండ్హయత్ హోటల్లో బస చేసినప్పుడు ఆయన తరఫున రూ.లక్ష బిల్లును చెల్లించిన చరణ్‌ప్రీత్ సింగ్ కూడా సహ నిందితుడేనని తెలిపింది. వేర్వేరు మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు అందినట్లు ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వాటిని పట్టించుకోలేదని, తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది.ఇక.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అందాయని ఆరోపించినా దానికి ఆధారాలు లేవని, కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ట్రయల్‌కోర్టు ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు. -
నేడు కేజ్రీవాల్ విడుదల.. నీటి సంక్షోభంపై ఆప్ నిరసన
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. గురువారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు అయింది. అయితే బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి న్యాయ బిందు ఆదేశాలను జారీ చేశారు.దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆదేవించారు. అంతేగాక అవసరం ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. అయితే48 గంటల పాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.ఎట్టకేలకు బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ నేడు(శుక్రవారం) తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. సీఎం విడుదల నేపథ్యంలో ఆప్ నేతలు నేడు ఆయన్ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో మంత్రి అతిషి, భార్య సునీతా, ఇతర ఆప్ నేతలు తీహార్ జైలుకు వెళ్లనున్నారు.మరోవైపు దేశ రాజధానిలో నెలకొన్ని నీటి సంక్షోభంపై అధికార ఆప్ ప్రభుత్వం ఆందోళనలకు సిద్ధమవుతోంది. నేటి సాయంత్రం కేజ్రీవాల్ విడుదలకు ముందేనీటి కొరతపై నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ ఆందోళనల్లో మంత్రి అతిషి, కేజ్రీవాల్ సతీమణి సునీతా రాజ్ ఘాట్‌ను సందర్శించనున్నారు, అక్కడ నిరవధిక నిరాహారదీక్ష చేశారు. కాగా దేశ రాజధానికి నీటిని రాకుండా పొరుగున ఉన్న హర్యానా అడ్డుకుంటోందని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.హర్యానా యమునా నదికి నీటిని విడుదల చేయనంత వరకు ఢిల్లీలో నీటి కొరత కొనసాగుతుందని అతిషి పేర్కొన్నారు. మునక్ కెనాల్‌కు చాలా తక్కువ నీరు వస్తోందని, వజీరాబాద్ బ్యారేజీకి నీరు రావడం లేదని అన్నారు. యమునా నుంచి నీరు నీటి శుద్ధికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ ప్రజలకు సరాఫరా అవుతోందన్నారు. అయితే యమునాలో నీటి శాతం తక్కువ ఉందని పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ తాను హర్యానా ప్రభుత్వం ముందు చేతులు కట్టుకుని నిలబడి అర్థిస్తున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా నీటి సమస్యతో పాటు హస్తీనాను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు, వడదెబ్బలతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 20 మందికి పైగా ప్రాణాలు విడిచారు. -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Delhi Court: కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు విధించింది. అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్‌కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు. ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్‌గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది. ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈడీది అంతులేని దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్‌పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్‌వర్డ్‌ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు. ‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్‌కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్‌కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం.. జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం. ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు. అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు. ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్. ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మే 10: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం. మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్. జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ. జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు. -
Delhi Liquor Case: సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌కే కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ కేసులో సాధారణ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. అనంతరం కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి న్యాయ బిందు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇక బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల తర్వాత జూన్ రెండున కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైల్లో లోంగిపోయారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా నేడు ఆయనకు బెయిల్ మంజూరైంది. -
లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.కాగా, కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు(గురువారం) రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందని స్పష్టం చేసింది. అలాగే, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడంలేదని తెలిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొదని కోర్టును కోరింది. #WATCH | Delhi: On Delhi CM Arvind Kejriwal's bail plea hearing, ASG SV Raju says, "Mainly, we have shown his role as pointed earlier, regarding demand of Rs 100 Crores and how the money went to Angadias. We have shown that Angadias sent this money to Goa to Chanpreet Singh of… pic.twitter.com/bkRfliTWsQ— ANI (@ANI) June 20, 2024 బుధవారం జరిగింది ఇది.. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ లంచంగా రూ.100 కోట్లను డిమాండ్ చేశారని ఈడీ ఆరోపించించి. రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ముద్దాయిగా చేర్చడాన్ని సమర్ధించుకుంది. రాజకీయ పార్టీ నేరానికి పాల్పడిందంటే దానికి పార్టీ అధినేతే కారణంగా ఉంటారని పేర్కొంది.కాగా, కేజ్రీవాల్‌కు ఇదివరకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో బుధవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. జులై 3 వరకు కస్టడీ గడువును పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి న్యాయ్ బిందు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌పైనా ఇరుపక్షాల వాదనలను జడ్జి విన్నారు. పార్టీకి అవసరమైన నిధుల కోసం రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా సౌత్గ్రూప్ను కేజ్రీవాల్ డిమాండ్ చేశారని ఈడీ ఆరోపించింది. ఈ మొత్తం హవాలా మార్గంలో గోవాకు చేరిందని తెలిపింది.మరోవైపు.. ఈడీ వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. కేజ్రీవాల్ కేసు మొత్తం వాంగ్మూలాలపైనే ఆధారపడి ఉందని, అంతకుమించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఆ వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులందరూ ఇదే కేసులో నిందితులుగా, అప్రూవర్లుగా ఉన్నారని గుర్తు చేశారు. మరి కొందరైతే అరెస్టు చేయబోమనే హామీని దర్యాప్తు సంస్థ నుంచి పొందారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించడం తగదని వాదించారు. దీంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. -
కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
MLC Kavitha: తీహార్ జైలులో కవితను కలిసిన సబిత, సత్యవతి రాథోడ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లి తీహార్ జైలులో ఉన్న కవితలో ములాఖత్ అయ్యారు.మరోవైపు.. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్.. కవితను కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుతున్నారని సమాచారం.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. కవిత గత 80 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.అనంతరం, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్‌సింగ్, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని జూన్ మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. -
21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
కేజ్రీవాల్‌కు మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. కాగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. -
వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ను సాధించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏడింటినీ గెలుచుకుంది. జైలు నుంచి వచ్చి ప్రచారం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సానుభూతితో ఓట్లు తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. 2009లో ఢిల్లీలో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ 2014, 2019తోపాటు ప్రస్తుత ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ గెలిచి సత్తా చాటింది.ఓట్లు రాబట్టని ప్రసంగంఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఇండియా కూటమిని గెలిపిస్తే కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదంటూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నించారు. ప్రతిచోటా ఇదే ప్రసంగంతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, అవి ఫలించలేదు.తగ్గిన బీజేపీ ఓటింగ్ శాతంవరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీలో బీజేపీ తన అధిపత్యాన్ని కనబరిచింది. 2009 ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 35.23% ఓట్లు తెచ్చుకుంది. 2014లో 46.40శాతం, 2019లో 56.85 శాతం ఓట్లతో వరుసగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో మాత్రం బీజేపీ 54.30 శాతం ఓట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో బీజేపీ 2.55శాతం ఓట్లను కోల్పోయింది. డీలా పడ్డ కాంగ్రెస్ గ్రాఫ్2009 ఎన్నికల్లో 57.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచిన కాంగ్రెస్, 2014కు వచ్చేసరికి ఓటమిని చవి చూసింది. కేవలం 15.10% ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచిన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో 22.63% ఓట్లతో పుంజుకుంది. తాజా ఎన్నికల్లో 19.11% ఓట్లతో తృతీయ స్థానానికి చేరింది. ఇక 24.02% ఓట్లతో ఆప్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ రెండు పార్టీలు ఓట్ల శాతాన్ని పెంచుకున్నా సీట్ల సాధనలో విఫలమయ్యాయి. -
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితపై ఈడీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలులిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టుఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టురూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీరూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారుకవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీసీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపుమరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్‌ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. -
కేసీఆర్‌పై ఏబీఎన్ తప్పుడు కథనాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యక్తిత్వాన్ని దిగ జార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై కూడా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో, ఇతర చానళ్లపై బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనల్లో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్‌లు, వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ‘మార్గదర్శి మా నాన్న.. మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు’ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్న ట్లు ఈడీ తేల్చిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసిందని వివరించారు.ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదును పెన్‌డ్రైవ్ ద్వారా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వార్త పూర్తి సారాంశాన్ని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసే సమ యంలో కేసీఆర్, కవిత ఫొటోలతో పాటు ఈడీ, మద్యం సీసాల క్లిప్పింగులను జత చేశారని తెలి పారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్‌రావు.. కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపై ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నింది తుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత, కేసీఆర్‌కు ఆపాదిస్తూ ఏబీఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు.కేసీఆర్, కవిత, బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. న్యాయవిచారణ అంశాల ను కూడా ఏబీఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యా నాలతో తప్పుదోవ పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశా రని పేర్కొన్నారు. దీంతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరక్టర్ భానుకృష్ణ, ఈడీ పి.వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణ కు మార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్‌తో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.కేసీఆర్ ఇమేజీని దెబ్బ తీసేందుకే..వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ స్థాయి, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన తెలంగాణ భవన్లో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ 6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ టీవీ, బీఆర్కే, డైలీ న్యూస్, జర్నలిస్టు సాయి చాన ల్, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్, ఆర్ టీవీ, రాజ్‌న్యూస్, రెడ్ టీవీ, వైల్డ్ ఓల్ప్.. తది తర 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై పోలీసు లకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. -
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్ అన్నారు. -
ప్రచారానికి కేజ్రీవాల్ ఆరోగ్యం అడ్డురాలేదా?: కోర్టులో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సాధారణ బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయస్థానం మద్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యతిరేకించింది. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆయన ఆరోగ్యం అడ్డురాలేదని పేర్కొంది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారని .. అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన బెయిల్ ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్‌లో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌కు ఆయన ఆరో గ్యం ఆటంకం కలిగించలేదని అన్నారు. ‘ఇప్పటి వరకు సీఎం చాలా ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషయంలో బెయిల్ దాఖలు చేశారు. అయన ప్రవర్తన బెయిల్‌కు అర్హత కాదు’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదపరి విచారణను జూన్1కు వాయిదా వేసింది.కాగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాలని ఆదేశించింది.అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని వివరించింది. దీంతో ఈ కేసులో మధ్యంతర, సాధారణ బెయిల్‌ను కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ తిరిగి తిహార్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..
-
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం
-
కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను మరో వారం పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని బుధవారం ఉదయం స్పష్టం చేసింది.లిక్కర్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు ఇదివరకే అనుమతి లభించింది. అందుకే ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ చెల్లదని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అంతకు ముందు.. మంగళవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనకు సైతం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ, దిగువ కోర్టులో బెయిల్ వేసేందుకు అనుమతి ఉండడంతో.. సుప్రీం విచారణ చేపట్టమని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యుడీషియల్ రిమాండ్ కింద ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ తరఫున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. జూన్ 1వరకు బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.కానీ, ఈలోపే ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని ఆయన మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్లో కోరారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే.. మంగళవారం విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు గత వారం ఈ అభ్యర్థనను ఎందుకు ప్రస్తావించలేదని ఆప్ నేత తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని వెకేషన్ బెంచ్ ప్రశ్నించింది. ‘ఈ పిటిషన్‌పై సీజేఐ నిర్ణయం తీసుకోవడమే సముచితం. ఆయన వద్దకు దీనిని పంపిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్న వైద్యుడి సూచనలు రెండు రోజుల క్రితమే అందినందున జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదని సింఘ్వి వెకేషన్ బెంచ్‌కు తెలిపారు. వర్చువల్ విధానంలో అయినా సరే ఆ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తామంటే అభ్యంతరం లేదని సింఘ్వి వాదించారు. ప్రధాన పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉన్నందున బెయిల్ పొడిగింపు అభ్యర్థన లిస్టింగ్‌పై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావన రాలేదు
-
ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్
-
కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.ఈడీ వాదనలుఇండియా ఎహెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు.ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.కవితకు బెయిల్ ఇవ్వొద్దు.సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.గోప్యత హక్కును భంగపరచలేదుసీబీఐ వాదనలు:మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుందిసాక్షులను ప్రభావితం చేస్తుందికవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవుకవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు. ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలుకవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలులిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడికవిత కేసులో కీలక పాత్రధారి దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. -
బెయిల్ పొడిగింపు.. కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించటాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్.. చీఫ్ జస్టిస్‌కు డీవై చంద్రచూడ్‌కు పంపించింది. తదుపరి ఈ పిటిషన్ లిస్ట్‌కు రావటం అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంత బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ జూన్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును కోరాను. తన అనారోగ్యం రీత్యా వైద్య పరీక్ష చేయించుకోవటం కోసం బెయిల్ పొడగించాలని కోరారు. ఈ మేరకు తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు.‘‘ఇది అరవింద్ కేజ్రీవాల్ విషయం. ఆయనకు మరో ఏడు రోజులు బెయిల్ పొడగించాలి’’ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ‘‘ బెయిల్ పొడగింపు పిటిషన్ ఇప్పుడు అత్యవసరంగా విచారించటం వీలు కాదు. అందుకే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ముందుకు పంపుతున్నాం. ఆయన ఈ పిటిషన్ లిస్ట్ చేయటంపై నిర్ణయం తీసుకుంటారు’’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది. -
కవిత లిక్కర్ కేసు: నేడు ఈడీ, సీబీఐ కౌంటర్ వాదనలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ( మంగళవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలి. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి రూ. 50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగింది. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారు’’ అని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సోమవారం వాదనలు వినిపించించారు. ఇది వరకే ఈడి, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టయి రెండు నెలలకుపైగా కవిత తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించిన వాదనలు..కవితను అరెస్ట్ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత -
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Delhi Liquor Case May 27 Updates👉 కవిత బెయిల్ విచారణ రేపటికి వాయిదాలిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదారేపు మధ్యాహ్నాం 12గం. వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్ట్ ఇవాళ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవిత తరఫున ముగిసిన వాదనలు40 నిమిషాల పాటు వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాదిరేపు వాదనలు వినిపించనున్న ఈడీ, సీబీఐరేపు వాదనలు పూర్తయ్యాక.. తీర్పు రిజర్వ్ చేస్తానని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ 👉కేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్ స్వర్ణ కాంతమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి?: జస్టిస్ స్వర్ణకాంతకేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్ స్వర్ణకాంతకవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు.. దాని వల్ల ఈడీకి వచ్చి లాభం ఏమిటి ?: కవిత తరఫు లాయర్ కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు పూర్తి👉పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?కవితను అరెస్ట్ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితకవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి👉కేసు ఫైల్ చేసినప్పుడు పేరేది?మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుకవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరిఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభంలిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్ట్ లో విచారణ ప్రారంభంకవిత బెయిల్ పిటిషన్ విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మవిచారణకు హాజరైన కవిత భర్త అనిల్👉లిక్కర్ స్కామ్ కేసు.. కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. తద్వారా తాము వాదనలకు సిద్ధమని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన కవితను.. సీబీఐ కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. లిక్కర్ కేసులో కవితని కింగ్ పిన్ అని పేర్కొంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) నిరాకరించింది. దీంతో.. ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. మే 24 శుక్రవారం నాటి విచారణ సందర్భంగా.. కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించగా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగించేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈడీ, సీబీఐలకు వాదించేందుకు అవకాశం ఇచ్చింది.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేసి వాదనలకు సిద్ధమని ప్రకటించింది. అయితే సీబీఐ మాత్రం కౌంటర్‌కు, ఛార్జీషీట్ దాఖలుకు గడువు కోరింది. చెప్పినట్లుగానే సీబీఐ ఇవాళ కౌంటర్ వేసింది.లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంలో కేజ్రీవాల్ పిటిషన్ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. PET-CT స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో బెయిల్‌ను మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. అయితే ఇప్పటికే ఆయనకు మాక్స్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో కోర్టు బెయిల్ పొడిగిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.హైకోర్టుకే వెళ్లండి.. పిళ్లై బెయిల్‌పై సుప్రీంసుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు వింది. మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని పిళ్లైకి సూచించింది. అదే సమయంలో.. గతంలో ఇచ్చిన ఆదేశాల తో సంబంధం లేకుండా మధ్యంతర బెయిల్ పిటిషన్ పరిశీలన చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సైతం సుప్రీం సూచించింది.గతంలో తాను కవిత బినామీనేనంటూ అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇచ్చి.. ఆ తర్వాత ఆ మాట మార్చాడు పిళ్లై. అయితే ఇండో స్పిరిట్ లో కవిత తరఫున పిళ్లై భాగస్వామిగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తెలిపారు. తమ కౌంటర్ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు. -
‘కవిత అరెస్ట్‌లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయగా.. కౌంటర్‌కు సీబీఐ గడువు కోరింది. ఇవాళ కవిత తరఫున లాయర్ వాదనలు వినిపించగా.. సోమవారం కూడా ఆ వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు కవిత బెయిల్‌పై కేంద్ర దర్యాప్తుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో తాము వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఈడీ అరెస్ట్ చేసిన విధానం.. కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కవిత అరెస్ట్‌లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి.దానిపై సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ చేశాం.. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.ఆ కేసు జూలైకి వాయిదా పడింది. ఈలోగా బెయిల్ కోసం దరఖాస్తు చేశాం.మహిళకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణ కింద కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. 2022 ఆగస్టు 7న సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు కవిత పేరు రాలేదు.శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారని అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండో స్పిరిట్‌లో వాటా కోసం ఇచ్చారని చెప్పారు.అప్పుడు తొలి సారిగా కవిత పేరు తెరపైకి వచ్చింది. అరుణ్ పిళ్లై ఆ తర్వాత తన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు .అభిషేక్ బోయినపల్లి ఈ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని సీబీఐ చెప్పింది.విచారణ జరపకుండా ఈ విషయం రిమాండ్ రిపోర్టులో పెట్టారు.ముందుగా సీబీఐ సీఆర్పీసీ160 నోటీసు ఇచ్చి నవంబర్ 2022 ఆమె ఇంట్లో 7 గంటలు విచారణ జరిపారు. ఈడీ మార్చి 2023లో విచారణ జరిపింది. మహిళను కార్యాలయంలోకి పిలవద్దని, సీఆర్పీసీ160 ప్రకారం నడుచుకోవాలని చెప్పినా ఈడీ వినకుండా కార్యాలయానికి పిలిచింది. అరెస్టు చేసిన వ్యక్తితో కలిపి విచారణ జరపాలని ఢిల్లీకి పిలిచారు. కవిత ఫోన్లు సీజ్ చేశారు. అని కవిత లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. స్పందించిన న్యాయస్థానం దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సీబీఐని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్లపై సోమవారం, మంగళవారం రెండు రోజుల్లో ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. అంతకు ముందు.. మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. అదే విధంగా జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు వెల్లడించింది. సోమవారం నాడు రెండు కేసుల్లో కవిత తరఫున వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. మంగళవారం నాడు ఈడీ, సీబీఐ వాదనలు వింటామని తెలిపింది. -
కవిత కేసులో నేడు ఏం జరగనుందో?
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్ తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారామె. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్‌తో ఊరట ఇవ్వాలని పిటీషన్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదన్నారు.అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్ పిటిషన్‌పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. జూన్ 3 వరకు కవిత జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది. -
ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషిటుపై ఈనెల 29న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రెండోరోజూ మంగళవారం ఈడీ వాదనలు విన్నారు. ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా ఈ కేసులో కవిత పాత్రపై మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.శరత్‌రెడ్డి, బుచి్చబాబు, శ్రీనివాస్‌ల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్‌పిన్‌గా వ్యవహరించిన ట్లు తెలిసిందన్నారు. హవాలా రూపంలో డబ్బులు తరలించడంలో ఎవరెవరి పాత్ర ఏంటనేది వివరించారు. వాదనల అనంతరం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషిటును పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్‌కుమార్, చరణ్‌ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ
-
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
Delhi Liquor Scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్షీట్లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది. 38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్చేస్తున్నాం. -
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్‌లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
Supreme Court: ఎలాంటి మినహాయింపులు లేవు!
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు బెయిల్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టంచేసింది. అయితే తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరిని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు బెయిల్ తర్వాత ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చేస్తున్న ప్రసంగాలను తప్పుబడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనలను, ప్రసంగాలను సమరి్థస్తూ కేజ్రీవాల్ తరఫు లాయర్లు చేసి వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. ‘‘ ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయంగా తోచిందో దానిని ఉత్తర్వుల రూపంలో మేం వెల్లడించాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ అభ్యర్థన తిరస్కరణ ‘‘ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే జూన్ రెండో తేదీన తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోండి’’ అని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీనిపై కోర్టు..‘ అది అంతా ఆయన ఊహ మాత్రమే. ఈ విషయంలో మేం ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’’ అని ఈడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ‘‘తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరికి అడ్డుచెప్పం. తీర్పుపై విమర్శలను మేం స్వాగతిస్తున్నాం. ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏ రోజున లొంగిపోవాలనేది మా ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్. ఈ ఉత్తర్వు ద్వారానే చట్టం అమలవుతుంది’’ అని కోర్టు తెలిపింది. ‘‘ సొంత ఊహలతో బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నారు. ఆయన ఏం చేద్దామనుకుంటున్నారు? వ్యవస్థకు చెంపపెట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. ‘‘ ఆయన జూన్ రెండో తేదీన తప్పకుండా లొంగిపోవాల్సిందే. అయితే ఈ కేసు గురించి ఆయన మాట్లాడొచ్చు అనిగానీ మాట్లాడకూడదు అని గానీ మేం బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. అమిత్ షా సంగతేంటి?: కేజ్రీవాల్ లాయర్ ‘‘సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక ట్రీట్మెంట్ జరిగినట్లు అనిపిస్తోంది. ఈయన బెయిల్ ఇతరుల సాధారణ బెయిల్ మాదిరి కనిపించట్లేదు. నేనే కాదు దేశంలో చాలా మంది ఇలాగే భావిస్తున్నారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న మాటలను కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోర్టుకు గుర్తు చేశారు. ఆయన సంగతేంటి?అని ప్రశ్నించారు. ఆ విషయం జోలికి తాము వెళ్లదల్చుకోలేదని ధర్మాసనం తెలిపింది. ‘‘ ఆప్‌కు ఓటేయకపోతే జైలుకు వెళ్లక తప్పదేమో అని కేజ్రీవాల్ అనలేదు. కావాలంటే ఆమేరకు కోర్టులో అఫిడవిట్ సైతం సమరి్పస్తాం’’ అని సింఘ్వీ తెలిపారు. మద్యం కేసులో కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ వేస్తాం: ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ దాఖలుచేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సందర్భంగా కోర్టుకు ఈడీ ఈ విషయం తెలిపింది. ఈడీ కేసులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చుతామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు సైతం ఈడీ తెలిపింది. అమిత్ షా వ్యాఖ్యలు అభ్యంతరకరం: కపిల్ సిబల్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో స్పెషల్ ట్రీట్మెంట్ జరిగి ఉండొచ్చని అమిత్ షా మాట్లాడటం చాలా అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీల ఉద్దేశాన్నే ప్రశ్నిస్తున్నారు. జనం ఇలా అనుకుంటున్నారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. జనం మాటను మీరు(అమిత్) నమ్మకపోతే ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం ఏమొచి్చంది? జనం మాటను మీరు నమ్మితే మీ అభిప్రాయంగానే ఇంటర్వ్యూలో చెప్పాలిగానీ జనాన్ని ఎందుకు మధ్యలో లాగుతారు?’’ అని నిలదీశారు. -
కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్‌ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేసి, తిరిగి జైలుకు పంపాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీకోర్టు తోసిపుచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఓటేస్తే.. తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పని లేదంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దీనిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈడీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ‘సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రచారంలో భాగంగా ఆప్‌కి ఓటు వేస్తే, తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు విధించిన షరతులను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఇది న్యాయవ్యవస్థకు చెంపదెబ్బగా పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మను స్పందిస్తూ.. పలువురు కేంద్ర మంత్రులు (పేర్లు ప్రస్తావించకుండా) తన క్లైయింగ్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై వ్యతిరేకంగా రకరకాల ప్రకటనలు చేశానే విషయాన్ని ఎత్తిచూపారు.ఇరుపక్షాల వాదనలపై కోర్టు స్పందిస్తూ.. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని, అదంతా అతని ఊహేనని ఈడీకి తెలిపింది. దానిపై తాము మాట్లాడటానికి ఏం లేదని పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి జైలుకు రావాలంటూ తాము స్పష్టమైన ఆదేశం ఇచ్చామని వెల్లడించింది. అదే ఈ కోర్టు నిర్ణయమని, తాము చట్టబద్ధమైన పాలన ద్వారా నడుచుకుంటామని స్పష్టం చేసింది.‘కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు, తమ తీర్పుపై విశ్లేషణను, విమర్శలను స్వాగతిస్తున్నాం. కానీ మేము ఈ విషయంలో జోక్యం చేసుకోము. మా ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. తిరిగి జైలుకొచ్చే తేదీలు వెల్లడించాం. మధ్యంతర బెయిల్ మంజూరుకు కారణాలు కూడా చెప్పాం’ అని పేర్కొంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు. -
కవిత బయటకు వచ్చేనా?.. కాసేపట్లో బెయిల్‌పై విచారణ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరుగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజైన కవిత బెయిల్ దొరుకుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదే ధర్మాసనం గత శుక్రవారం విచారించి ఈడీ సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు సౌత్ గ్రూప్ తరఫున కవిత ఆప్ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్న కారణంతో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న ఆమెను అరెస్ట్ చేశాయి. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసుకున్న దరఖాస్తులను రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టివేశారు. ఈ క్రమంలో ఈనెల 6న తీర్పునిచ్చారు. ఈ మొత్తం కుంభకోణంలో ఈమెదే ప్రధానపాత్ర అని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
Amit Shah: కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ !
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాధారణ ‘ప్రక్రియ’లాగా లేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. బుధవారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..జడ్జీలు ఇది గమనించాలి‘‘కేజ్రీవాల్‌కు ఎన్నికల సందర్భంగా బెయిల్ రావడం చూస్తుంటే సుప్రీంకోర్టు ఆయన విషయంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ మాట నేను అనట్లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం రాదని బెయిల్ తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కారమే. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే వాళ్లను సుప్రీంకోర్టు జైలుకు పంపదని ఆయన మాటల్లోని అసలు అర్థం. ఆయన మాటలు విన్నాక అయినా ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జీలు.. కేజ్రీవాల్ బెయిల్‌ను ఎలా వాడుకుంటున్నారు, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి’’ అని షా విజ్ఞప్తిచేశారు.బెయిల్ తీర్పుపై..‘‘చట్టాన్ని ఏ కేసుల్లో ఎలా ఆపాదించాలో సర్వోన్నత న్యాయస్థానానికి బాగా తెలుసు. అయితే ఈ ఒక్క కేజ్రీవాల్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పు మిగతా తీర్పుల్లా సాధారణంగా అనిపించట్లేదు. దేశ జనాభాలో చాలా మంది మససుల్లో ఇలాంటి భావనే నెలకొంది. తిహార్ జైలు అమర్చిన కెమెరాల సీసీటీవీ ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్దం. ఎందుకంటే తిహార్ జైలు కేంద్రం అధీనంలో ఉండదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది అని వివరించారు.ప్రధానిగా మోదీ రిటైర్మెంట్పై‘‘వచ్చే ఏడాదికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. 75కి చేరినందుకు బీజేపీ నియమావళి ప్రకారం మోదీని పక్కనబెట్టి అమిత్‌షాను ప్రధాని చేయాలని చూస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అదంతా అబద్ధం. ఇప్పుడు, ఎప్పుడూ మోదీయే మా ప్రధాని అభ్యర్థి. మేం గెలిచాక 2029 ఏడాదిదాకా మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. ఆయన సారథ్యం, మార్గదర్శకత్వంలోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాం’’ అని అమిత్ అన్నారు. -
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ను ప్రత్యేక ట్రీట్మెంట్గా అమిత్ షా అభివర్ణించారు.ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఆప్ అధినేతకు లభించిన బెయిల్ సాధారణ తీర్పు కాదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ప్రత్యేక సౌలభ్యం కల్పించినట్లు దేశంలో చాలామంది ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై అమిత్ షా మండిపడ్డారు.కేజ్రీవాల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందని అన్నారు. ‘ఎన్నికల్లో విజయం సాధిస్తే.. కేసుల్లో దోషులుగా తేలిన వారిని కోర్టు జైలుకు పంపదని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. బెయిల్ తీర్పును ఎలా ఉపయోగించుకుంటున్నారో లేదా దుర్వినియోగం చేస్తున్నారో మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలి’ అని షా పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీహార్ జైల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి తన కదలికలను పర్యవేక్షిస్తుందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. ‘తిహార్ జైలు పాలన అధికారం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉంది. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఎలాంటి సంబంధం లేదు. కేజ్రీవాల్ కావాలనే అబద్ధాలు చెబుతున్నారు. బెయిల్ మార్గదర్శకాల ప్రకారం, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సెక్రటేరియట్‌ను కూడా సందర్శించలేరు. కేసు గురించి వ్యాఖ్యానించవద్దని లేదా సాక్షులెవరితోనూ సంభాషించవద్దని కూడా కోర్టు తెలిపింది. జూన్ 2లోగా జైలు అధికారులకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది. మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సిందే.’ అని మండిపడ్డారు.కాగా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఆప్ పార్టీ అధినేతగా ఉన్న ఆయన..లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎ మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరో ఐదు రోజుల పాటు.. ఈ నెల 20 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు.తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై దాఖలు చేసిన ఆప్పీల్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిసోడియాపై ఉన్న ఆరోపణలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.ఇక.. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) గతేడాది మార్చి 9న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తిహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీపై ఉంటున్నారు.గత నెల 30న సిసోడియాకు రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జడ్జి బవేజా కొట్టివేశారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని ఈడీ తెలిపింది. -
కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..
-
ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
లిక్కర్ కేసు: నేడు కోర్టుకు కవిత
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే.కాగా, ఆమె జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇలావుండగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
Aravind Kejriwal: నేను వచ్చేశా...
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు. ‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’ – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘హనుమాన్జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’ – సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’ – శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత -
లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్ ఈ బెయిల్ వర్తించనుంది. అప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు లిక్కర్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, మద్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించింది.కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.జూన్ ఒకటో తేదీ వరకు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.జూన్ రెండవ తేదీన కేజ్రీవాల్ లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టులిక్కర్ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని కోర్టును కోరిన ఈడి తరపు న్యాయవాది.మీరు కూడా అంతకంటే గట్టిగ కౌంటర్ ఇవ్వాలని సూచించిన ధర్మాసనం.కేజ్రీవాల్ 21 రోజులు జైల్లో ఉన్నా.. బయట ఉన్నా.. పెద్ద తేడా లేదన్న ధర్మాసనం.కేజ్రీవాల్ కు జూన్ 4 వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన కేజ్రీవాల్ తరపు న్యాయవాది.కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనంఅంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. తాజాగా కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ షరతులు:ఢిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర గురించి బయట మాట్లాడకూడదుఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షులతో మాట్లాడకూడదుఢిల్లీ లిక్కర్ కేసు అధికారిక ఫైల్స్ చూడకూడదుఎలాంటి అధికారిక పత్రాలపై సంతకాలు చేయకూడదుసీఎం ఆఫీస్ కు, సెక్రటేరియట్ కు వెళ్లకూడదు50వేల షూరిటీ బాండ్, ఒకరి పూచికత్తు సమర్పించాలి -
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం 1,149 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ స్యూర్యకాంత శర్మ శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు (రౌజ్ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్ పిటిషన్‌ను నిరాకరిస్తూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది. కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్ ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్ ఏడోది కానుంది. -
కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ పేర్కొంది. కనీసం రాజ్యాంగపరమైన లేదా చట్టబద్దమైన హక్కు కూడా కాదని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్ మంజూరు కాలేదని తెలిపింది. తన పార్టీ అభ్యర్థుల కోసం కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు పంపడం జనాల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని అభిప్రాయ పడింది.అయితే కేజ్రీవాల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది. అంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.