ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్‌ జైలుకు.. | Tihar Jail Kalvakuntla Kavitha hospitalized | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి.. మళ్లీ తీహార్‌ జైలుకు తరలింపు

Jul 16 2024 5:40 PM | Updated on Jul 16 2024 7:43 PM

Tihar Jail Kalvakuntla Kavitha hospitalized

ఢిల్లీ, సాక్షి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్‌ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. 

మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. 

లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్‌ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement