‘నన్ను కూడా జైలుకి..’ సీజేపీ దీప్కే కొత్త ఆందోళనకు పిలుపు | Lehra do Tiranga CJPs Abhijeet Dipke announces fresh protest in CP on Oct 16 | Sakshi
Sakshi News home page

‘నన్ను కూడా జైలుకి..’ సీజేపీ దీప్కే కొత్త ఆందోళనకు పిలుపు

Oct 14 2026 7:50 PM | Updated on Oct 14 2026 8:08 PM

Lehra do Tiranga CJPs Abhijeet Dipke announces fresh protest in CP on Oct 16

కాక్రోచ్‌ జనతా పార్టీ  (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కొత్త ఆందోళనకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా  నిర్బంధం (అరెస్టు) నేపథ్యంలో అక్టోబర్ 16న ఢిల్లీలోని కానాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. మద్దతుదారులంతా “లెహరా దో తిరంగా” (త్రివర్ణ పతాకాన్నిఎగురవేయండి) ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దిప్కే చేసిన ఈ కొత్త నిరసన పిలుపు, తమ ఆందోళనను ముందుకు తీసుకెళ్లాలనే పార్టీ ప్రణాళికలను సూచిస్తుంది. అంతేకాదు త్వరలోనే తనను కూడా జైలులో పెట్టవచ్చని దీప్కే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదని  నిరూపిస్తామని  అని దిప్కే ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అలాగే ఢిల్లీకి రాలేనివారు తమ తమ నగరాల్లో 'తిరంగా మార్చ్'లు నిర్వహించాలని కోరారు. అధికారిక నిరసన ప్రాంతం జాబితా నుండి తొలగించిన తరువాత జంతర్ మంతర్‌ను చేరుకోవడానికి నిషేధిత ఆస్తిలోకి ప్రవేశించారనే ఆరోపణలపై దాస్, రంకాలను ఐదు రోజుల జ్యుడీషియల్‌  కస్టడీకి తరలించిన తర్వాత  దీప్కే ఈ పిలుపునిచ్చారు. 

ఇదీ చదవండి: మీరట్‌ బ్లూ డ్రమ్‌ కేసు : దోషులకు మరణ శిక్ష

శాంతిభద్రతలను కాపాడాలనే నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఈ ఇద్దరు నేతలపై ఆరోపణలు నమోదైనాయి. ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిరోధక పోలీసు నివేదిక (కలాంద్రా) వివరాలను పరిశీలించిన తర్వాత దాస్, రంకాలను తీహార్ జైలుకు తరలించారు. వారితో ఉన్న మరో  సహచరుడు అజింక్య షిండేను ఆరు నెలల పాటు శాంతిభద్రతలను మరియు మంచి ప్రవర్తనను కొనసాగించేలా కట్టుబడి ఉండేలా చూసి, రూ. 5,000 పూచీకత్తు, వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పదేపదే చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణ లెదుర్కొంటున్న వీరిని బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ చట్టాన్ని అతిక్రమించవచ్చని లేదా ఇతరులను రెచ్చగొట్టవచ్చనే ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: దేశవాళీ వరి సంరక్షకుడు పద్మశ్రీ రామన్‌ కన్నుమూత

కాగా ఎస్‌ఐఆర్‌లో జరిగిన అక్రమాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ ఉద్యమానికి దిగింది. దీంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, ఇతర పార్టీలు కూడా ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని,జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని  డిమాండ్ చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement