దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీరట్ బ్లూడ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రధాన నిందితులు మృతుడు సౌరభ్ రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకుమరణ శిక్ష ఖాయమైంది. ఈ మేరకు మీరట్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. హత్య జరిగిన 13 నెలల్లోపే విచారణ పూర్తికాగా, నిందితుల్ని ఇటీవల దోషులుగా తేల్చింది.
126 విచారణలు, 22 మంది సాక్షుల వాంగ్మూలం తర్వాత, డిస్ట్రిక్ట్ జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా రస్తోగి, శుక్లా కలిసి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని తేల్చారు. మృతుడు రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మరణశిక్ష విధించారు. ఇలాంటి నేరాలు సమాజంలో భయాన్ని సృష్టిస్తాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ముస్కాన్ , సాహిల్ ఇద్దరినీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. తమ అల్లుడు చాలా మంచి మనిషని, ఒకవేళ తమ కుమార్తె దోషిగా తేలితే మరణశిక్ష విధిస్తే తాము ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయబోమని ముస్కాన్ తల్లిదండ్రులు న్యాయస్థానానికి తెలిపారు.
బ్లూ డ్రమ్ హత్య కేసు
కాగా పోలీసుల కథనం ప్రకారం యూపీ, మీరట్‌కు చెందిన మాజీ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్ (29) 2025 మార్చి 3న హత్యకు గురయ్యాడు. అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిలు శుక్లా కలిసి ఆహారంలో మత్తుమందు కలిపిం అతడిని హతమార్చారు. అనంతరం మృతదేహం కుళ్ళి దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు, వారు ఆ శరీర భాగాలను ఒక పెద్ద నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో ఉంచి, దానిని ఇసుక, నీరు మరియు సిమెంట్ మిశ్రమంతో నింపి సీల్ చేశారని దర్యాప్తులో తేలింది. ఆ జంట మరుసటి రోజే హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయింది. రాజ్‌పుత్ బతికే ఉన్నాడని, వ్యాపార పని మీద ప్రయాణం చేస్తున్నాడని నమ్మించేలా రస్తోగి అతని మొబైల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశాలు పంపింది. ఘటన జరిగిన కొన్ని రోజులకు పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఈ హత్య వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ముస్కాన్ ఆడబిడ్డకు జైల్లోనే జన్మనిచ్చింది. ఈమెకు ఆరేళ్ల పాప కూడా ఉంది.
ఇవీ చదవండి: బీజేపీ నేతను బంధించి మరీ రూ. 50 లక్షలు చోరీ.. కలకలం
రూ. 70 కోట్లు : ఇన్ఫ్లూయెన్సెర్కి చుక్కలు చూపించిన COD ఆర్డర్లు


