సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసిన చిలిపి పని మదురైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరమణికి చుక్కలు చూపించారు నెటిజన్లు. దీపావళి సందర్భంగా స్వీట్లు వస్తాయని ఆశించి తన చిరునామాను ఆన్లైన్లో షేర్ చేశాడు. అదే అతనికి భారీ తలనొప్పులు తెచ్చిపెట్టింది. దెబ్బకి ఊరు వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. తనకెదైన వింత అనుభవాన్ని, గోడును వెళ్లబోసుకుంటూ సోషల్ మీడియాలోపోస్ట్ చేసిన వీడియోలు వైరల్గా మారాయి.
రానున్న దీపావళి పండుగ సందర్భంగా, తనకు ఎవరైనా సరే ఒక స్వీట్ బాక్స్ పంపాలని కోరుతూ వీరమణి ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. పంపుతారనే ఆశతో వీరమణి తన ఫోన్ నంబర్, ఇంటి చిరునామాను సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇక అంతే ఆయన పేరు మీద నకిలీ 'క్యాష్-ఆన్-డెలివరీ' (COD) ఆర్డర్ల వెల్లువ మొదలైంది. ఇందులో టెలివిజన్లు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలు ఉన్నట్లు సమాచారం. ఒక టెలివిజన్ ఆర్డర్ విలువ రూ. 1.69 లక్షలు ఉంటుందని తెలిపారు. అంతేకాదు రూ. 70 కోట్ల విలువైన T-90 మిలిటరీ ట్యాంక్, అంబులెన్స్, రాకెట్ కోసం కూడా సీవోడీ రావడంతో వీరమణి బెంబేలెత్తిపోయాడు. ఇక ఆపండిరా బాబోయ్ అంటూ ఆయన మొత్తు కున్నాడు.
utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇదీ చదవండి: బీజేపీ నేతను బంధించి మరీ రూ. 50 లక్షలు చోరీ.. కలకలం

ఈ ప్రాంక్ తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తూ వీరమణి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాను ఎప్పుడూ ఆర్డర్ చేయని వస్తువుల కోసం డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి పెరగడంతోపాటు డెలివరీ సిబ్బంది కూడా అనవసరంగా ఆయన ఇంటికి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ కష్టాలను అర్థం చేసుకోవాలని వీడియోలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : షాకింగ్ వీడియో : ఇతగాణ్ణి పట్టుకోండి! వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం
అయినా సరే తగ్గేదే లే అన్నట్టు ఆర్డర్లు వరద కొనసాగుతూనే ఉంది. దీంతో తీవ్ర మానసికవేదనకు గురైన వీరమణి ప్రస్తుత ఇంటిని ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి మకాం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొంతమంది నెటిజన్లు నిజంగానే స్వీట్లు పంపడం విశేషం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం చెప్పకనే చెప్పింది.


