షాకింగ్‌ వీడియో : ఇతగాణ్ణి పట్టుకోండి! వీసీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం | Hyderabad Police Chief Sajjanar Orders Legal Action Against Auto Driver Using Headphones While Driving, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో : ఇతగాణ్ణి పట్టుకోండి! వీసీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం

Oct 14 2026 3:07 PM | Updated on Oct 14 2026 3:34 PM

Hydrabad CP VC Sajjanar calls stringent legal action auto driver why check here

అత్యంత నిర్లక్ష్యంగా ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన ఆయన  సదరు ఆటో డ్రైవర్‌ను గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమిటంటే.. 

ఈ  వైరల్  వీడియోలో ఆటో డ్రైవర్  ఒక ఫోన్‌లో డెస్టినేషన్‌లో వెళ్లే నావిగేషన్ రూట్ ఉండగా, మరో  మొబైల్‌లో దర్జాగా సినిమా చూస్తున్నాడు. అంతేకాకుండా చెవులకు హెడ్‌ఫోన్లు పెట్టుకున్నాడు.  రోడ్డుమీద డ్రైవింగ్‌పై దృష్టిపెట్టాల్సిన  డ్రైవర్‌ అలా మొబైల్‌ ఫోన్లలో మునిగిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.  ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో ఇప్పటికే చాలా సార్లు స్పందించిన  సజ్జనార్‌ ఈ ఉదంతంపై మరింత  సీరియస్‌ అయ్యారు. ఇతనిపై చర్య తీసుకోవాలని  సంబంధిత అధికారులను కోరుతూ తన ట్విట్‌లో రాసుకొచ్చారు. మరోవైపు ఇది చాలా ప్రమాదకరమని నెటిజన్లు మండిపడుతున్నారు.  ఇది ఆటోలో ప్రయాణిస్తున్న వారికే కాదు, మిగిలిన వాహన చోదకుల ప్రాణలమీదకి తెలుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: బీజేపీ నేతను బంధించి మరీ రూ. 50 లక్షలు చోరీ.. కలకలం

 

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లు! ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం. ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి. వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకం. ఈ క్రమంలో ప్రయాణం ఆటో అయినా, కారు అయినా, బస్సు అయినా ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని వెంటనే ప్రశ్నించండి, వారించండి. ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement