యూపీ బీజేపీ నేతను బంధించి మరీ రూ. 50 లక్షలు చోరీ కలకలం | Hours After BJP Elevation Robbers Tie Him Up At Kanpur Farmhouse Loot Rs 50 Lakh | Sakshi
Sakshi News home page

యూపీ బీజేపీ నేతను బంధించి మరీ రూ. 50 లక్షలు చోరీ కలకలం

Oct 14 2026 1:37 PM | Updated on Oct 14 2026 1:44 PM

Hours After BJP Elevation Robbers Tie Him Up At Kanpur Farmhouse Loot Rs 50 Lakh

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇటీవల బీజేపీ నేత రమేష్ యాదవ్‌  బీజేపీ పిచ్డా మోర్చా (వెనుకబడిన తరగతుల విభాగం) నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు.   ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులతో భారీ ఎత్తున పార్టీ జరుపుకున్నారు. ఈ వేడుకలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి.  సోమవారం లక్నోలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాన్పూర్‌కు తిరిగి వచ్చారు. అయితే ఆ రోజు  ఆయనకు ఒక  పీడకలలా మిగిలిపోతుందని అస్సలు ఊహించి ఉండరు. ఆయనను  సొంత ఇంటిలోనే బంధించి, విలువైన వస్తువులు, నగదును దోచుకుని పరారైన ఘటన కలకలం రేపింది.

ఇదీ చదవండి: రూ. 8.28 కోట్ల బంగారం చోరీ, అంతా 12 నిమిషాల్లోనే!

పార్టీలో వచ్చిన ప్రమోషన్‌ని  బాధ్యతలు స్వీకరించి తరువాత  రమేష్ యాదవ్ విశ్రాంతి తీసుకోవడానికి కాన్పూర్ సమీపంలోని తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ముసుగు ధరించిన దుండగులు ఆయన ఫాంహౌస్‌లోకి చొరబడి, ఆయనను బంధించి, రూ. 50 లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు.నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫాంహౌస్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా, సినీ ఫక్కాలో  ముసుగు  దొంగలు  బీభత్సం సృష్టించారు. పోలీసులకు ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం రమేష్ యాదవ్‌ చేతులు కట్టేసి మరీ  ఈ దారుణానికి పాల్పడ్డారు.

పాలక పార్టీకి చెందిన ప్రముఖ నేత నివాసంలో జరిగిన ఈ దోపిడీ పోలీసు శాఖలో కలకలం రేపింది. రాత్రికి రాత్రే సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విపిన్ తాడా, డీసీపీ (సౌత్) దీపేంద్ర నాథ్ చౌదరి , భారీ పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. సీసీటీవీలను పరిశాలిస్తున్నారు. నివేదికల ప్రకారం, నలుగురు సెక్యూరిటీ గార్డులు,నలుగురు గన్‌మెన్‌లు, డ్రైవర్‌తో సహా సుమారు 14 మంది సిబ్బందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు పోలీసులు దొంగలను గుర్తించలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement