దేశవాళీ వరి సంరక్షకుడు పద్మశ్రీ రామన్‌ కన్నుమూత | Padma Shri awardee Cheruvayal Raman passed away at 74 | Sakshi
Sakshi News home page

దేశవాళీ వరి సంరక్షకుడు పద్మశ్రీ రామన్‌ కన్నుమూత

Oct 14 2026 6:48 PM | Updated on Oct 14 2026 7:01 PM

Padma Shri awardee Cheruvayal Raman passed away at 74

కేరళలోని వాయనాడ్ చెందిన సాంప్రదాయ వరి రకాల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన గిరిజన రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రామన్ (74) కన్ను మూశారు. కోజికోడ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రామన్‌ అస్తమయంపై పలువురు సంతాపం ప్రకటించారు. 

మనంతవాడికి చెందిన కమ్మనం గ్రామానికి చెందిన రామన్, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న 45కి పైగా దేశవాళీ (సాంప్రదాయ) వరి రకాలను కాపాడి, సంరక్షించడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన దశాబ్దాలుగా సాంప్రదాయ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ, ఆ ప్రాంతపు వ్యవసాయ వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కృషి చేశారు.

1952 జూన్ 6న తలక్కర చెరియ రామన్‌గా జన్మించిన  రామన్‌, కమ్మనం నవోదయ లోయర్ ప్రైమరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న అనంతరం 10 ఏళ్ల వయస్సులోనే పూర్తిస్థాయిలో వ్యవసాయంపైనే దృష్టి సారించారు. రామన్ చిన్నతనంలోనే తన మామయ్యతో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆయన మరణానంతరం, మామయ్య పండించిన ఆరు రకాల వరి పంటలను పరిరక్షించడం ద్వారా రామన్ ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. 

ఇదీ చదవండి: మీరట్‌ బ్లూ డ్రమ్‌ కేసు : దోషులకు మరణ శిక్ష <

వ్యవసాయంపై ఆయనకున్న మక్కువతో 1969లో కన్నూర్ డీఎంఓ (DMO) ఆఫీసులో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా తిరస్కరించారు.  తన కృషికి గాను జాతీయ ప్లాంట్ జీనోమ్ అవార్డు , కేరళ జీవవైవిధ్య బోర్డు గ్రీన్ అవార్డు గెలుచుకున్నారు. 2023లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మశ్రీ'తో ప్రభుత్వం ఆయనను  సత్కరించింది.

"ప్రజలకు ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని అందించడమే నా ప్రయత్నం. మంచి ఆహారం, నీరు, నేల మీదే నా దృష్టి ఉంది. విలాసవంతమైన జీవితం గడపడానికి నా మనసు ఒప్పకోదు’’  అనేవారు రామన్. 

 ఇదీ చదవండి: 365 రోజుల ఛాలెంజ్‌ : రూ. 9.5 లక్షలు గెల్చుకుంది!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement