breaking news
Padma Shri awardee
-
ఏఎంఆర్ ముప్పు తప్పించే ఈవీఎం చికిత్సలు!
సాంప్రదాయ పశువైద్య విధానాలకు (ఎత్నోవెటర్నరీ మెడిసిన్–ఈవీఎం) శాస్త్రీయ గుర్తింపు తీసుకురావడంలో విజయం సాధించిన తమిళనాడుకు చెందిన వెటర్నరీ ప్రొఫెసర్ ఎన్. పుణ్యమూర్తి(69) ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు పద్మశ్రీ అందుకున్న ఐదుగురు వెటర్నేరియన్లలో ఒకరు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ మూలికా వైద్యంతో యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది. తద్వారా భవిష్యత్తులో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు అంటున్నారాయన. ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు...→ ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు అంటే?విశ్రాంత వెటర్నరీ ప్రొఫెసర్‌గా నాకున్న శాస్త్రీయ జ్ఞానం, పురాతన సిద్ధ వైద్య రీతిలోని సంప్రదాయం విజ్ఞానాన్ని మేళవించి పాతికేళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నాను. ఇంటి పట్టున దొరికే సాధారణ మూలికలతో రైతులే పశువైద్యం చేసుకోవటానికి తోడ్పడేవే ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు. → సాంప్రదాయ పశువైద్యానికి శాస్త్రీయత ఉందా?ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘మైక్రోబియల్ పాథోజెనిసిస్’లో ఈవీఎం చికిత్సలపై ఇటీవల ప్రచురితమైన తొలి వ్యాసం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నాతో పాటు చాలా మంది శాస్త్రవేత్తలు, వివిధ ప్రభుత్వ పరిశోధన సంస్థలు సాధించిన విజయాలే ఇందుకు దోహదపడ్డాయి. ఉదాహరణకు.. పాడి పశువులకు వచ్చే ముఖ్య వ్యాధుల్లో పొదుగు వాపు ఒకటి. కలబంద ఆకులు 250 గ్రాములు, పసుపు 50 గ్రాములు, సున్నం 15 గ్రాముల మిశ్రమాన్ని వాడితే 85% పశువుల్లో 3–5 రోజుల్లోనే పొదుగువాపు తగ్గిపోతుంది. మొత్తం 34 పశు వ్యాధులకు ఇటువంటి నిర్థారిత ఈవిఎం చికిత్సలు ఉన్నాయి. సాధారణంగా శాస్త్రీయ పరిశోధనల్లో మొక్కల నుంచి ఒకే ఒక అణువును వేరు చేసి పరీక్షిస్తారు. కానీ, ఈ పరిశోధనలో మొదటిసారిగా ఈ మూడు పదార్థాల పూర్తి మిశ్రమాన్ని (హోల్ కాంబినేషన్‌ను) ఒక ‘ఫంక్షనల్ రెమెడీ’గా పరీక్షించి విజయం సాధించాం.→ మీ పరిశోధనలకు నిధులు ఎలా సమకూరాయి?ఎత్నోవెటర్నరీ మెడిసిన్ పద్ధతులు కేవలం అనుభవపూర్వకమైనవి మాత్రమే కావు, వాటి వెనుక బలమైన శాస్త్రీయ ఆధారం కూడా ఉందని మా పరిశోధనలు నిరూపించాయి. ప్రభుత్వాల నిధులతో గత 20 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 2007లో మొదట రూ. 18 లక్షలు, తర్వాత రూ. 13.72 కోట్లు మంజూరు చేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) రూ. 80 లక్షలు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. → ఈవీఎం చికిత్సల క్షేత్రస్థాయి ఫలితాలెలా ఉన్నాయి?నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాడి రైతులతో అమలు చేయిస్తోంది. గుజరాత్‌లోని ‘సాబర్ మిల్క్ యూనియన్’లో ఈ చికిత్సలను ఎన్ డీడీబీ విజయవంతంగా పరీక్షించింది. 2017 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా పాడి పశువుల చికిత్స ఫలితాలతో డిజిటల్ డేటాను ఎన్డీడీబీ సేకరించింది. పొదుగు వాపు వ్యాధి నివారణలో 85% పైగా అద్భుతమైన క్లినికల్ సక్సెస్ రేట్ నమోదైంది. కేవలం 3–5 రోజుల్లోనే పశువులు కోలుకున్నాయి. 34 రకాల పశువ్యాధుల నివారణకు ఎన్ డీడీబీ ఈ చికిత్సలను అనుసరిస్తోంది. → యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కట్టడి అవుతుందా?పశువైద్యంలో యాంటీబయాటిక్స్ వాడకం పెరగటం వల్ల బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని (యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ –ఏఎంఆర్)ను పెంచుకుంటోంది. ఈ మూలికా వైద్యం వల్ల యాంటీబయాటిక్స్ వాడకం తగ్గి, భవిష్యత్తులో ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. ‘స్టాండర్డ్ వెటర్నరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ ’(ఎస్వీటీజీ)లో కూడా ఈవీఎం చికిత్సలను చేర్చారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ భాగస్వామ్యంతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం చికిత్స విధానాన్ని వెటర్నరీ విద్యార్థుల సిలబస్‌లో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇంటర్వ్యూ:పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
కార్తీక్ మహరాజ్‌పై అత్యాచార ఆరోపణలు
కోల్‌కతా: భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన సాధువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహరాజ్ తనపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. టీచర్ జాబ్ ఇప్పిస్తాననే హామీతో ముర్షిదాబాద్‌లోని ఆశ్రమానికి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశారంది. 2013 జనవరి–జూన్ మధ్యలో ఆరు నెలల కాలంలో డజనుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. భయం, నిస్సహాయత వల్లే ఇంతకాలం మౌనంగా ఉన్నట్లు వివరించింది. పోలీసులకు ఈ విషయం చెబితే ఆత్మహత్య చేసుకుంటానని కార్తీక్ మహరాజ్ బెదిరించారంది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలను కార్తీక్ మహరాజ్ తీవ్రంగా ఖండించారు. తమవంటి సన్యాసులకు ఇలాంటి అడ్డంకులు సహజమేనన్నారు. ఈ వ్యవహారాన్ని తమ లాయర్లు చూసుకుంటారని చెప్పారు. కాగా, కార్తీక్ మహరాజ్ బీజేపీకి సన్నిహి తుడని పేరుంది. తమ టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా కార్తీక్ మహరాజ్ పనిచేస్తు న్నారంటూ 2024లో సీఎం మమతా బెనర్జీ ఆరోప ణలు చేశారు. తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సీఎం మమత క్షమాపణ చెప్పా లంటూ కార్తీక్ మహరాజ్ లీగల్ నోటీసు పంపారు. -
128 ఏళ్ల బాబా శివానంద్ కన్నుమూత
వారణాసి: ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత బాబా శివానంద్ ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 128 ఏళ్లని శిష్యులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను ఏప్రిల్ 30న బీహెచ్‌యూ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేసినట్టు శిష్యులు తెలిపారు. 1896 ఆగస్ట్ 8న నేటి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్లో జన్మించిన బాబా శివానంద్ ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం గురువు ఓంకార్‌నాథ్ సంరక్షణ, మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక శిక్షణ పొందారు. అప్పట్నుంచే ఒంటిపూట భోజనం వంటి కఠిన నియమాలను పాటిస్తూ వచ్చారు. నిత్యం తెల్లవారుజామున మూడింటికే మేల్కొని యోగసాధన చేసేవారు. ఆధ్యాతి్మక, యోగసంబంధ అంశాల్లో సేవలకు కేంద్ర ప్రభుత్వం 2022లో ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది. బాబా లేని లోటు పూడ్చలేదంటూ ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. -
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్మనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Heart Breaking: Padma Shri Awardee Mogulaiah Now a Daily Wager.He says his monthly honorarium stopped, and although all respond positively, they do nothing.Mogulaiah was seen working at a construction site in Turkayamanjal near Hyderabad.Darshanam Mogulaiah was honoured… pic.twitter.com/Zru4If7h0x— Sudhakar Udumula (@sudhakarudumula) May 3, 2024 బీఆర్ఎస్ పాలనలో నెలకు 10,000 గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య. అయితే ప్రస్తుతం తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని వాపోయారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని, తనతోపాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 అవసరమవుతాయని చెప్పారు. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.'గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పిటికీ పెండింగ్‌లోనే ఉంది. ' అని అన్నారు.కేటీఆర్ స్పందనతాజాగా మొగులయ్య దీనపరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుంటుంబాన్ని తను వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. Thanks Sucheta Ji for bringing this news to my attention I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6— KTR (@KTRBRS) May 3, 2024 -
ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు. వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
‘మల్లేశం’ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో
-
మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది
‘‘ఇంగ్లీష్‌లో నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనే సామెత ఉంది. కానీ ఈ సినిమాలో ‘మదర్ ఈజ్ నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్’ అని చూపించారు. ఎందుకంటే మల్లేశం గారు తన తల్లి కష్టాన్ని చూసి, తన తల్లి సమస్యతో పాటు ఎంతోమంది తల్లుల సమస్యలను తొలగించారు. ఎంతో మంది యంగ్ ఇన్నోవేటర్స్‌కు ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. రాజ్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్. ఆర్ నిర్మించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించిన ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శనివారం పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు కోసం ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యులెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో అనే ఓ కవిత సినిమాలోని ఎమోషన్ని రెండు గంటలపాటు క్యారీ చేసింది. మనం వెళ్లే దారిలో దారులన్నీ మూసి ఉన్నా ఏదో దారి తెరుచుకుని ఉంటుందనే విషయాన్ని వివరించిందీ చిత్రం. చేనేత కార్మికుల నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలను ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి అద్భుతంగా నటించారు. తెలంగాణ యాసను, భాషలోని మాధుర్యాన్ని రైటర్ అశోక్‌కుమార్ చక్కగా రాశారు. ఈ సినిమాకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని గౌరవ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగారితో, గౌరవ ముఖ్యమంత్రిగారితో మాట్లాడతాను. అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయినా, మరేదైనా నా వంతుగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తా. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలి. చేనేత కార్మిలకు అండగా నిలబడాలనే నినాదంతో యువత ముందుకు అడుగులు వెయ్యాలి’’ అన్నారు. డి. సురేశ్‌బాబు, బి. నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
టెక్సాస్ యూనివర్శిటీలో అశోక్‌కి కీలక పదవి
వాషింగ్టన్ : బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో సభ్యునిగా అశోక్ మగోను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బొట్ నియమించారు. ఈ మేరకు అబ్బొట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, మే 22వ తేదీ వరకు అశోక్ సభ్యునిగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అశోక్ గ్రేటర్ డల్లాస్ ఇండో అమెరికన్ ఛాంబర్స్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అశోక్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. -
పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూత
హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృతాచార్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు (88) బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్ను మూశారు. ఆయన 200కి పైగా సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర గ్రంథాలను రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతిగా, సంస్కృత అకాడమీ సంచాలకుడిగా, సురభారతి కార్యదర్శిగా, సంస్కృత భాషా ప్రచారక్ సమితి కులపతిగా, సంస్కృత భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన తెలుగులోకి అనువదించిన ‘వాల్మీకి రామాయణం’ ప్రతి తెలుగువారి ఇంటా కనిపిస్తుంది. సంస్కృతానికే మారుపేరుగా నిలిచిన రామచంద్రుడు మృతి సంస్కృతాభిమానులను శోకసంద్రంలో ముంచివేసింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజమండ్రి సమీపంలోని కోనసీమలోని ఐనవెల్లి గ్రామంలో జన్మించిన రామచంద్రుడుఆరు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం పుల్లెల శ్రీరామచంద్రుడు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువదించటంతో పాటు.. తెలుగు, సంస్కృతంలో ఆయన రచనలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పుల్లెల సంస్కృత అకాడమీలో దశాబ్దానికి పైగా సేవలు అందించటంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత విభాగం అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. కాగా, పుల్లెల శ్రీరామచంద్రుడు మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.


