పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్‌ స్పందన | Padma shree awardee darshana mogul Toils As Daily wager | Sakshi
Sakshi News home page

పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్‌ స్పందన

May 3 2024 12:40 PM | Updated on May 3 2024 5:43 PM

Padma shree awardee darshana mogul Toils As Daily wager

సాక్షి, హైదరాబాద్‌: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్మనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు.  హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 బీఆర్ఎస్‌ పాలనలో నెలకు 10,000 గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య. అయితే  ప్రస్తుతం తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని వాపోయారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని, తనతోపాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 అవసరమవుతాయని చెప్పారు. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

'గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పిటికీ పెండింగ్‌లోనే ఉంది. ' అని అన్నారు.

కేటీఆర్‌  స్పందన

తాజాగా మొగులయ్య దీనపరిస్థితిపై కేటీఆర్‌ స్పందించారు. మొగులయ్య కుంటుంబాన్ని తను వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement