కష్టాల్లో 'ప‌ద్మ శ్రీ మొగిల‌య్య'.. సాయం చేసిన బుల్లితెర నటి | Actress Jyothi Rai Help To Kinnera Mogilaiah | Sakshi
Sakshi News home page

కష్టాల్లో 'ప‌ద్మ శ్రీ మొగిల‌య్య'.. డబ్బు సాయం చేసిన బుల్లితెర నటి

May 10 2024 5:07 PM | Updated on May 11 2024 7:49 AM

Actress Jyothi Rai Help To Kinnera Mogilaiah

బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఆమె మరింత పాపులర్‌ అయింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్‌ సిరీస్‌లలో కూడా మెప్పిస్తుంది. ఈ క్రమంలో  టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లో ఆమె ఫుల్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఆమె పర్సనల్‌ వీడియో లీక్‌ అంటూ కన్నడ పరిశ్రమలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని ఆమె తిప్పికొట్టింది. అక్షయ తృతీయ సందర్భంగా అందరూ బంగారం కొంటారు. కానీ, జ్యోతీరాయ్‌ ఆ డబ్బుతో ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ 12 మెట్ల కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిల‌య్యకు సాయం చేసి తన గొప్ప మనసు చాటుకుంది.

కిన్నెర మొగిల‌య్యకు సాయం
తెలంగాణకు చెందిన కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిల‌య్యకు ప‌ద్మ శ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే, పేదరికంతో ఉన్న మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పించన్‌ ఆగిపోవడంతో కొద్దిరోజుల నుంచి కూలీ ప‌ని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. 

మొగిలయ్యను తన టీమ్‌ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది. తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలచివేసిందని ఆమె పేర్కొంది. ఆయన ప్రతిభకు తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని ఆమె తెలిపింది.  అనంతరం మొగలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్‌ ఆశీర్వాదం తీసుకుంది. మొగిలయ్యకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొంది. అమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా జ్యోతిరాయ్‌ మంచి మనుసును మెచ్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పర్సనల్‌ వీడియో లీక్‌పై ఫస్ట్‌ రియాక్షన్‌
కొద్దిరోజులుగా జ్యోతిరాయ్‌ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు అంటూ కన్నడ సోషల్‌ మీడియాలో భారీగా వార్తలు వచ్చాయి. ఆమెను కొందరు కావాలనే టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలిసింది. అయితే తొలిసారి తన సోషల్‌ మీడియా ద్వారా ఈ అంశం మీద రియాక్ట్‌ అయింది.

'నా పేరుతో ఒక వీడియోను క్రియేట్‌ చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. ఇదీ ఎంత వరకు కరెక్ట్‌..? చదువు, సంపాదలేని కొందరు వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లందరూ చిల్లరగాళ్లు. నన్ను కొందరు కావాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చీకట్లోకి నెట్టాలని చూస్తున్నారు. నన్ను ఎంతలా అణిచివేసినా కూడా ఫీనిక్స్‌ పక్షిలా మళ్లీ తిరిగి వస్తాను. అని జ్యోతిరాయ్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement