కార్తీక్‌ మహరాజ్‌పై  అత్యాచార ఆరోపణలు | Padma Shri Awardee Kartik Maharaj Accused of molestation | Sakshi
Sakshi News home page

కార్తీక్‌ మహరాజ్‌పై  అత్యాచార ఆరోపణలు

Jun 29 2025 3:42 AM | Updated on Jun 29 2025 3:42 AM

Padma Shri Awardee Kartik Maharaj Accused of molestation

కోల్‌కతా: భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌కు చెందిన సాధువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్‌ మహరాజ్‌ తనపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. టీచర్‌ జాబ్‌ ఇప్పిస్తాననే హామీతో ముర్షిదాబాద్‌లోని ఆశ్రమానికి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశారంది. 2013 జనవరి–జూన్‌ మధ్యలో ఆరు నెలల కాలంలో డజనుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. 

భయం, నిస్సహాయత వల్లే ఇంతకాలం మౌనంగా ఉన్నట్లు వివరించింది. పోలీసులకు ఈ విషయం చెబితే ఆత్మహత్య చేసుకుంటానని కార్తీక్‌ మహరాజ్‌ బెదిరించారంది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలను కార్తీక్‌ మహరాజ్‌ తీవ్రంగా ఖండించారు. 

తమవంటి సన్యాసులకు ఇలాంటి అడ్డంకులు సహజమేనన్నారు. ఈ వ్యవహారాన్ని తమ లాయర్లు చూసుకుంటారని చెప్పారు. కాగా, కార్తీక్‌ మహరాజ్‌ బీజేపీకి సన్నిహి తుడని పేరుంది. తమ టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా కార్తీక్‌ మహరాజ్‌ పనిచేస్తు న్నారంటూ 2024లో సీఎం మమతా బెనర్జీ ఆరోప ణలు చేశారు. తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సీఎం మమత క్షమాపణ చెప్పా లంటూ కార్తీక్‌ మహరాజ్‌ లీగల్‌ నోటీసు పంపారు. 

Advertisement
 
Advertisement
Advertisement