మొగులయ్యకు ఇచ్చే స్థలం అంత దూరమా? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అసంతృప్తి!

BRS MLA Guvvala Balaraju dissatisfied Kinnera Mogulaiah house site - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై అచ్చంపేట(నాగర్‌కర్నూల్‌) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇవాళ కొందరికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా..  ప్రముఖ కళాకారుడు.. కిన్నెర వాయిద్యకారుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు .. బీఎన్‌రెడ్డి కాలనీలో స్థలం కేటాయించారు.

గతంలో మొగులయ్యను ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకొచ్చినప్పుడు.. ఇళ్ల స్థలం కేటాయింపజేసే బాధ్యతను గువ్వల బాలరాజుకు అప్పగించారు సీఎం. అయితే ఇవ్వాళ్టి ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీకి అసలు తనని పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు గువ్వల బాలరాజు. మొగులయ్యను ఢిల్లీ తీసుకెళ్లి ఆయన కళను గుర్తు చేసింది తానేనని, ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉందని బాలరాజు గుర్తు చేశారు. 

కొందరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మొగులయ్యకు మాత్రం BN రెడ్డి కాలనీలో కేటాయించడం సరికాదని, క్రీడాకారులకు కేటాయించిన జాగలతో పోలిస్తే.. మొగులయ్యకు కేటాయించిన స్థలం విలువ తక్కువని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top