సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

Padma Shri Awardee Wrestler Virender Singh Urges Haryana Government To Recognise Deaf Athletes As para Athletes - Sakshi

చంఢీఘడ్‌: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ అలియాస్‌ గుంగా పహిల్వాన్‌.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. 

ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్‌ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్‌.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు.
చదవండి: పాక్‌ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్‌.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top