365 రోజుల ఛాలెంజ్‌ : రూ. 9.5 లక్షలు గెల్చుకుంది! | Gujarat woman meets MrBeast after 365 day challenge receives USD 10k | Sakshi
Sakshi News home page

365 రోజుల ఛాలెంజ్‌ : రూ. 9.5 లక్షలు గెల్చుకుంది!

Oct 14 2026 6:13 PM | Updated on Oct 14 2026 6:26 PM

Gujarat woman meets MrBeast after 365 day challenge receives USD 10k

యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్‌ను కలవడానికిగుజరాత్‌కు చెందిన మహిళ ఏడాది పాటు చేసిన ప్రయత్నం ఫలించింది. గుజరాత్‌లోని సూరత్‌లో 365 రోజుల ఛాలెంజ్‌ను ప్రారంభించిన  మాయా గుప్తా చివరికి తనకెంతో ఇష్టమైన  క్రియేటర్‌ను కలిసి 10 వేల డాలర్లు (సుమారు రూ. 9.5 లక్షలు) గెల్చుకుంది. ఈ విషయాన్ని మిస్టర్‌బీస్ట్‌ తన ఇన్‌స్టాలో వీడియోపాటు షేర్‌ చేయడం విశేషంగా నిలిచింది. 

ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రియేటర్లలో ఒకరిని కలవాలనే సాధారణ లక్ష్యంతో  మాయా గుప్తా  ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. @mayaforbeast అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె క్రమం తప్పకుండా అప్‌డేట్‌లను పంచుకుంటూ, తన వీడియోలలో ఆయనను ట్యాగ్ చేస్తూ, ఆయన్ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలను రికార్డు చేసింది. రోజులు గడిచేకొద్దీ,  ఆన్‌లైన్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్‌లు ఈ ఛాలెంజ్‌ను ఒక కౌంట్‌డౌన్‌లా మార్చేసాయి.

అయితే, మిస్టర్‌బీస్ట్‌ను కలవడం, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలతో పాటు, ఆమె తన స్థానికంగా ప్రజలకు ఆహారం అందించే సేవలను కూడా పంచుకునేది. అయితే సెప్టెంబర్‌లో ఆమెకు ఒక పెద్ద బ్రేక్ లభించింది. మిస్టర్‌బీస్ట్ తన ఇమెయిల్ చిరునామా, వాట్సాప్ వివరాలను అడిగినట్లు గుప్తా వెల్లడించింది. దీని తరువాత  మిస్టర్‌ బీస్ట్‌ను కలవగలననే ఆశ మరింత  పెరిగింది.  మరింత పట్టుదలగా ప్రయత్నించింది. చివరికి ఆమె ఆశలు ఫలించి 365 రోజుల కృషికి తగిన ఫలితం దక్కింది. ఛాలెంజ్  చివరి రోజు తన అభిమాన యూట్యూబర్‌ను  కలుసుకుంది. ఈ సందర్భంగా  మాయా గుప్తాకు  మిస్టర్‌బీస్ట్ 10వేల డాలర్లను బహుమతిగా ఇచ్చారు. 

 ఈ సందర్భంగా, గత ఏడాది కాలంగా  మాయా గుప్తా చేసిన సమాజసేవను, తనను కలుసుకునేందుకు ఆమె పడిన తపనను తాను గమనించానని మిస్టర్‌బీస్ట్ వివరించారు. "మాయ, గత ఏడాదిగా తన స్థానిక సమాజానికి ఆహారం అందిస్తూ, ఆమె చేసే ప్రతి వీడియోలో నన్ను ట్యాగ్ చేస్తోంది... గత ఏడాది కాలంలో ఆమె సమాజం కోసం చేసిన మంచి పనులన్నీ నేను చూశాను. నేను ఆమెకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను" అని అన్నారు. మాయా  కమ్యూనిటీ సేవలకు గాను  సుమారు రూ. 9.5 లక్షలు అందజేశారు. ఆ డబ్బును తన ఒక్కదానికోసం దాచుకోకుండా అందరితో పంచుకుంటానని, తన సేవలను కొనసాగిస్తానని గుప్తా వెల్లడించింది.

ఇదీ చదవండి: మీరట్‌ బ్లూ డ్రమ్‌ కేసు : దోషులకు మరణ శిక్ష

నెటిజన్ల స్పందన
గుప్తా తన ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు  నెటిజన్లు అభినందించారు. అలాగే ఆమె ప్రయత్నాలను గుర్తించి, కమ్యూనిటీ సేవకు మద్దతు ఇచ్చినందుకు మిస్టర్‌బీస్ట్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. మరొకరు, చివరికి, మాయ కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రూ. 70 కోట్లు : ఇన్‌ఫ్లూయెన్సెర్‌కి చుక్కలు చూపించిన COD ఆర్డర్లు
మిస్టర్‌బీస్ట్ ఎవరు?
పాపులర్‌ అమెరికన్ యూట్యూబర్‌ మిస్టర్‌బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్. అతను నగదు బహుమతులు, ఛాలెంజ్‌లు, గివ్‌అవేలతో  అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అనేక ఛారిటబుల్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆహార పంపిణీ, నిత్యావసర వస్తువులను అందించడం వంటి సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement