breaking news
MrBeast
-
365 రోజుల ఛాలెంజ్ : రూ. 9.5 లక్షలు గెల్చుకుంది!
యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ను కలవడానికిగుజరాత్కు చెందిన మహిళ ఏడాది పాటు చేసిన ప్రయత్నం ఫలించింది. గుజరాత్‌లోని సూరత్‌లో 365 రోజుల ఛాలెంజ్‌ను ప్రారంభించిన మాయా గుప్తా చివరికి తనకెంతో ఇష్టమైన క్రియేటర్‌ను కలిసి 10 వేల డాలర్లు (సుమారు రూ. 9.5 లక్షలు) గెల్చుకుంది. ఈ విషయాన్ని మిస్టర్‌బీస్ట్ తన ఇన్‌స్టాలో వీడియోపాటు షేర్ చేయడం విశేషంగా నిలిచింది. ఇంటర్నెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రియేటర్లలో ఒకరిని కలవాలనే సాధారణ లక్ష్యంతో మాయా గుప్తా ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. @mayaforbeast అనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె క్రమం తప్పకుండా అప్డేట్లను పంచుకుంటూ, తన వీడియోలలో ఆయనను ట్యాగ్ చేస్తూ, ఆయన్ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలను రికార్డు చేసింది. రోజులు గడిచేకొద్దీ, ఆన్లైన్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్‌లు ఈ ఛాలెంజ్‌ను ఒక కౌంట్డౌన్లా మార్చేసాయి.అయితే, మిస్టర్బీస్ట్ను కలవడం, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలతో పాటు, ఆమె తన స్థానికంగా ప్రజలకు ఆహారం అందించే సేవలను కూడా పంచుకునేది. అయితే సెప్టెంబర్‌లో ఆమెకు ఒక పెద్ద బ్రేక్ లభించింది. మిస్టర్‌బీస్ట్ తన ఇమెయిల్ చిరునామా, వాట్సాప్ వివరాలను అడిగినట్లు గుప్తా వెల్లడించింది. దీని తరువాత మిస్టర్ బీస్ట్‌ను కలవగలననే ఆశ మరింత పెరిగింది. మరింత పట్టుదలగా ప్రయత్నించింది. చివరికి ఆమె ఆశలు ఫలించి 365 రోజుల కృషికి తగిన ఫలితం దక్కింది. ఛాలెంజ్ చివరి రోజు తన అభిమాన యూట్యూబర్‌ను కలుసుకుంది. ఈ సందర్భంగా మాయా గుప్తాకు మిస్టర్‌బీస్ట్ 10వేల డాలర్లను బహుమతిగా ఇచ్చారు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) ఈ సందర్భంగా, గత ఏడాది కాలంగా మాయా గుప్తా చేసిన సమాజసేవను, తనను కలుసుకునేందుకు ఆమె పడిన తపనను తాను గమనించానని మిస్టర్‌బీస్ట్ వివరించారు. "మాయ, గత ఏడాదిగా తన స్థానిక సమాజానికి ఆహారం అందిస్తూ, ఆమె చేసే ప్రతి వీడియోలో నన్ను ట్యాగ్ చేస్తోంది... గత ఏడాది కాలంలో ఆమె సమాజం కోసం చేసిన మంచి పనులన్నీ నేను చూశాను. నేను ఆమెకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను" అని అన్నారు. మాయా కమ్యూనిటీ సేవలకు గాను సుమారు రూ. 9.5 లక్షలు అందజేశారు. ఆ డబ్బును తన ఒక్కదానికోసం దాచుకోకుండా అందరితో పంచుకుంటానని, తన సేవలను కొనసాగిస్తానని గుప్తా వెల్లడించింది.ఇదీ చదవండి: మీరట్ బ్లూ డ్రమ్ కేసు : దోషులకు మరణ శిక్షనెటిజన్ల స్పందనగుప్తా తన ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు నెటిజన్లు అభినందించారు. అలాగే ఆమె ప్రయత్నాలను గుర్తించి, కమ్యూనిటీ సేవకు మద్దతు ఇచ్చినందుకు మిస్టర్‌బీస్ట్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. మరొకరు, చివరికి, మాయ కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ. 70 కోట్లు : ఇన్ఫ్లూయెన్సెర్కి చుక్కలు చూపించిన COD ఆర్డర్లుమిస్టర్బీస్ట్ ఎవరు?పాపులర్ అమెరికన్ యూట్యూబర్ మిస్టర్‌బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. అతను నగదు బహుమతులు, ఛాలెంజ్‌లు, గివ్అవేలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అనేక ఛారిటబుల్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆహార పంపిణీ, నిత్యావసర వస్తువులను అందించడం వంటి సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంటారు. -
‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్ బీస్ట్.. ఇదేం ట్విస్ట్ బాస్..
ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నవంబర్ 06న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలపైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌కు ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ పాల్గొన్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇండియాలో మిస్టర్ బీస్ట్..మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఇటీవల భార్య థియా బోయ్సెన్తో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడ ఆయనను చూసిన అభిమానులు ఫొటోల కోసం ఎగబడ్డారు. ఓ చిన్నారి తన చేతితో తయారు చేసిన స్కెచ్బుక్ను మిస్టర్ బీస్ట్‌కు అందించడం కూడా వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’మూవీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలురామాయణ టీమ్‌తో భేటీ?మిస్టర్ బీస్ట్ ఇండియా పర్యటన రామాయణ ప్రమోషన్స్ కోసమే వచ్చారన్న టాక్ నిజమైంది. ఈరోజు(సెప్టెంబర్ 26)రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి మిస్టర్ బీస్ట్ ముంబైలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న రవీ దూబే కూడా ఈ ఇంటరాక్షన్‌లో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా..‘రామాయణ’ కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న మిస్టర్ బీస్ట్‌తో కలయిక సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత రీచ్ తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. నవంబర్‌లో ‘రామాయణ’..నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. #MrBeast, alongside #NamitMalhotra, #SaiPallavi and #RanbirKapoor at a #Ramayana event in Mumbai. pic.twitter.com/o9R9I7oEll— Variety India (@VarietyIndia) September 26, 2026 -
పెళ్లి చేసుకున్న ఫేమస్ యూట్యూబర్.. ఏడాదికి రూ.600 కోట్ల సంపాదన
ప్రపంచంలో ఫేమస్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. రకరకాల గేమ్స్ పెడుతూ దానధర్మాలు చేస్తూ సదరు వీడియోలని పోస్ట్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వీడియోలు, దానికి వచ్చే యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.300 కోట్లు, ఇతర బిజినెస్‌లతో మరో రూ.300 కోట్లు సంపాదించే ఈ ఫేమస్ యూట్యూబర్ ఇప్పుడు సింపుల్‌గా తన ప్రేయసి థియాని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్, థియా బూయ్‌సెన్.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2022లో దక్షిణాఫ్రికాకి వెళ్లినప్పుడు గేమర్, రైటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన థియాని బీస్ట్ తొలిసారి కలిశాడు. తర్వాత ట్విటర్లో మాట్లాడుకున్నారు. తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే ఏడాది జరిగిన కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో తొలిసారి వీళ్లిద్దరూ జంటగా కనిపించారు. ఇక 2024 క్రిస్మస్ నాడు కుటుంబ సభ్యుల సమక్షంలో జిమ్మీ థియాకు ప్రపోజ్ చేశాడు.వారం క్రితం అంటే జూలై 14న ప్రముఖ బిజినెస్‌మ్యాన్ రిచర్డ్ బ్రాన్సన్‌కి చెందిన నెకర్ ఐలాండ్‌లో జిమ్మీ-థియా పెళ్లి చేసుకున్నారు. బీస్ట్ చాలా పెద్ద యూట్యూబర్ అయినప్పటికీ పెద్దగా హడావుడి లేకుండా దాదాపు 70 మంది కుటుంబ సభ్యులు, బంధవులు, స్నేహితులు సమక్షంలో ఈ వివాహం చేసుకున్నాడు.వారం పాటు ఈ వేడుకలు సాగినట్లు తెలుస్తోంది. తన పెళ్లి ఫొటోలని బీస్ట్ పోస్ట్ చేయగా.. అభిమానులతో పాటు పలువురు ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు, స్నేహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రపంచంలోనే చాలా ఫేమస్ యూట్యూబర్లలో ఒకడైన మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్.. తన పెళ్లిని మీడియా హడావుడికి దూరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వ్యక్తిగతంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు గతంలో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అలానే చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by MrBeast (@mrbeast)


