పెళ్లి చేసుకున్న ఫేమస్ యూట్యూబర్.. ఏడాదికి రూ.600 కోట్ల సంపాదన | Youtuber Mr Beast Marries Longtime Girlfriend Thea Booysen In Private Island Wedding, Photos Trending On Social Media | Sakshi
Sakshi News home page

Mr Beast Wedding: వరల్డ్ వైడ్ ఫేమస్ యూట్యూబర్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

Jul 22 2026 8:42 AM | Updated on Jul 22 2026 10:21 AM

Youtuber Mr Beast Wedding And Wife Name Details

ప్రపంచంలో ఫేమస్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. రకరకాల గేమ్స్ పెడుతూ దానధర్మాలు చేస్తూ సదరు వీడియోలని పోస్ట్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వీడియోలు, దానికి వచ్చే యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.300 కోట్లు, ఇతర బిజినెస్‌లతో మరో రూ.300 కోట్లు సంపాదించే ఈ ఫేమస్ యూట్యూబర్ ఇప్పుడు సింపుల్‌గా తన ప్రేయసి థియాని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?

(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)

మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్, థియా బూయ్‌సెన్.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2022లో దక్షిణాఫ్రికాకి వెళ్లినప్పుడు గేమర్, రైటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన థియాని బీస్ట్ తొలిసారి కలిశాడు. తర్వాత ట్విటర్‌లో మాట్లాడుకున్నారు. తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే ఏడాది జరిగిన కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో తొలిసారి వీళ్లిద్దరూ జంటగా కనిపించారు. ఇక 2024 క్రిస్మస్ నాడు కుటుంబ సభ్యుల సమక్షంలో జిమ్మీ థియాకు ప్రపోజ్ చేశాడు.

వారం క్రితం అంటే జూలై 14న ప్రముఖ బిజినెస్‌మ్యాన్ రిచర్డ్ బ్రాన్సన్‌కి చెందిన నెకర్ ఐలాండ్‌లో జిమ్మీ-థియా పెళ్లి చేసుకున్నారు. బీస్ట్ చాలా పెద్ద యూట్యూబర్ అయినప్పటికీ పెద్దగా హడావుడి లేకుండా దాదాపు 70 మంది కుటుంబ సభ్యులు, బంధవులు, స్నేహితులు సమక్షంలో ఈ వివాహం చేసుకున్నాడు.వారం పాటు ఈ వేడుకలు సాగినట్లు తెలుస్తోంది. తన పెళ్లి ఫొటోలని బీస్ట్ పోస్ట్ చేయగా.. అభిమానులతో పాటు పలువురు ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు, స్నేహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రపంచంలోనే చాలా ఫేమస్ యూట్యూబర్లలో ఒకడైన మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్.. తన పెళ్లిని మీడియా హడావుడికి దూరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వ్యక్తిగతంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు గతంలో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అలానే చేసుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement