రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి దుర్మరణం | Godzilla Vs Kong Child Actress Kaylee Hottle Dies In Tragic Car Crash At 18 | Sakshi
Sakshi News home page

Kaylee Hottle: 'బధిర' బాలనటి 18 ఏళ్లకే కన్నుమూత

Jul 22 2026 9:19 AM | Updated on Jul 22 2026 9:41 AM

Hollywood Actor Kaylee Hottle No More

'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాలో జియా అనే పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలనటి కేలీ హాటిల్.. 18 ఏళ్లకే దుర్మరణం పాలైంది. అమెరికాలోని మేరీ‌ల్యాండ్‌లో మంగళవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పుట్టుకతో ఈమెకు వినబడదు.

(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను)

2021లో వచ్చిన 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాలో చెవిటి బాలికగా నటించిన ఈమె.. కింగ్ కాంగ్‌తో అమెరికన్ సైగల భాషలో మాట్లాడే పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.  తర్వాత 2024లో రిలీజైన 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీలోనూ అదే పాత్రను పోషించి మరోసారి మెప్పించింది. వీటితో పాటు 'మాగ్నమ్ పీఐ' అనే వెబ్ సిరీస్‌లోనూ అతిథి పాత్ర చేసింది. అట్లాంటాలోని జార్జియాలో పుట్టిన కేలీ హాటిల్.. తొమ్మిదేళ్ల వయసులోనే చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికి ఉపయోగపడే గ్లైడ్ వీడియో మెసేజింగ్ యాప్‌కి సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించి తన కెరీర్‌ మొదలుపెట్టింది.

ఇకపోతే కూతురు మరణవార్తని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కేలీ తండ్రి జోషువా హాటిల్ పంచుకున్నారు. అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడిన ఈయన.. ప్రమాదం జరిగిన వెంటనే టెక్సాస్ నుంచి మేరీల్యాండ్‌కు చేరుకున్నానని, తొలుత ప్రమాదంలో తన కుమార్తె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు సమాచారమిచ్చారని, తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా కేలీ గుండె ఆగిపోయిందని అధికారులు చెప్పినట్లు ఈయన పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement