'ఎప్పటికైనా హీరో అవుతా..' మాస్టర్ అరుణ్ దేవ్ | National Award winner child artist arun dev comments | Sakshi
Sakshi News home page

35 Chinna Katha Kadhu: 'ఎప్పటికైనా హీరో అవుతా..' మాస్టర్ అరుణ్ దేవ్

Jul 21 2026 6:17 PM | Updated on Jul 21 2026 6:52 PM

National Award winner child artist arun dev comments

35- చిన్న కథ కాదు మూవీతో పాస్ మార్కులు కొట్టేసిన బాలనటుడు అరుణ్ దేవ్. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. ఉత్తమ బాల నటుడుగా మాస్టర్ వరుణ్ జాతీయ అవార్డు అందుకోనున్నారు. దీంతో అరుణ్ దేవ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. జాతీయ అవార్డ్ ప్రకటనతో అందరి కళ్లు వరుణ్‌పైనే పడ్డాయి.

తాజాగా నిర్వహించిన ఈవెంట్‌లో మాట్లాడిన బాలనటుడు అరుణ్ దేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఎప్పటికైనా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన ఆశయమని తెలిపాడు. మా చెల్లి, నా పేరేంట్స్‌ సపోర్ట్‌తోనే ఈ మూవీ చేశానని వెల్లడించాడు. నా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మా స్కూల్‌కు చాలా రుణపడి ఉంటానని చెప్పాడు. 35 చిన్న కథ కాదు... ఇది చాలా పెద్ద కథ.. సున్నాని దాటాము.. నేషనల్ అవార్డుకి చేరుకున్నాం అంటూ మాట్లాడాడు. 

35 కథేంటంటే..

లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే తెలుగు పిల్లాడి కథ. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఉత్తమ బాలల చిత్రం’ గా ఎంపికై నూరు మార్కులు తెచ్చుకుంది. 2024 సెప్టెంబర్‌లో విడుదలై నోటిమాటతో హిట్టయిన ‘35 చిన్న కథ కాదు’. ఇప్పుడు ఢిల్లీలోనూ హిట్‌ కొట్టింది. పిల్లల తెలివిని మార్కులతో కొలవ వద్దనే సందేశం నేటి అవసరంగా భావించి కమిటీ ఈ సినిమాను అవార్డుతో గౌరవించింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement