ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నవంబర్ 06న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలపైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌కు ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ పాల్గొనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇండియాలో మిస్టర్ బీస్ట్..
మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఇటీవల భార్య థియా బోయ్‌సెన్‌తో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడ ఆయనను చూసిన అభిమానులు ఫొటోల కోసం ఎగబడ్డారు. ఓ చిన్నారి తన చేతితో తయారు చేసిన స్కెచ్‌బుక్‌ను మిస్టర్ బీస్ట్‌కు అందించడం కూడా వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’మూవీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
రామాయణ టీమ్‌తో భేటీ?
మిస్టర్ బీస్ట్ ఇండియా పర్యటన రామాయణ ప్రమోషన్స్ కోసమే వచ్చినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈరోజు(సెప్టెంబర్ 26)రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి మిస్టర్ బీస్ట్ ముంబైలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న రవీ దూబే కూడా ఈ ఇంటరాక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా..
‘రామాయణ’ కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న మిస్టర్ బీస్ట్‌తో కలయిక సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత రీచ్ తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే మిస్టర్ బీస్ట్ భేటీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నవంబర్‌లో ‘రామాయణ’..
నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
MR BEAST ✖️ RAMAYANA
MrBeast already in India! 🇮🇳
Tomorrow SPECIAL CHAT SHOW in
will be hosted in Prime Focus studios,
Film City Mumbai 🎬
Live streaming on @WorldOfRamayana
all social media platforms, Media and
special guests invited #Ramayana is
going to be Global… pic.twitter.com/wjjQpB0Wuk— vikas Pandey (@vikaspandey017) September 25, 2026
Ramayana Special Event in Presence of RK - Sai Pallavi - Nitesh Tiwari - Namit Malhotra.
Mr Beast is Attending Too.
Pic credit: @Its_CineHub pic.twitter.com/LsqeRbJW9s— RK🐰 (@rksbunny) September 25, 2026


