‘ది ప్యారడైజ్‌’మూవీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు | Venu Swamy Interesting Comments On The Paradise Movie | Sakshi
Sakshi News home page

‘ది ప్యారడైజ్‌’మూవీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

Sep 26 2026 2:28 PM | Updated on Sep 26 2026 3:44 PM

Venu Swamy Interesting Comments On The Paradise Movie

వేణుస్వామి పేరు సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలతోనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆయన తొలిసారి ఓ సినిమా గురించి స్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న నాని ‘ది ప్యారడైజ్‌’పై వేణుస్వామి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలోని ఓ ప్రత్యేక అంశం తనను థియేటర్‌ వరకు తీసుకెళ్లిందని చెప్పడంతో ఆయన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సాధారణంగా సినిమా చూడటానికి హీరో, కథ, దర్శకుడు లేదా ట్రైలర్‌ వంటి అంశాలు కారణమవుతుంటాయి. కానీ ‘ది ప్యారడైజ్‌’ విషయంలో తనకు పూర్తిగా భిన్నమైన కారణం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. దశమహావిద్యల్లో ఒకరిగా భావించే ధూమావతి అమ్మవారి నేపథ్యాన్ని సినిమాలో ఉపయోగించారని తెలియడంతో ఈ చిత్రంపై తనకు ఆసక్తి కలిగిందన్నారు.

ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్‌’లో ధూమావతి అమ్మవారి ప్రతీకను చూపించిన ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని వేణుస్వామి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సన్నివేశంలో ధూమావతి ప్రతీకతో పాటు కాకిని కూడా ఉపయోగించారని, బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రోచ్ఛారణను పోలిన శబ్దాలను వినిపించారని తెలిపారు.  దశమహావిద్యల్లో ఒకరిగా భావించే ధూమావతి అంశాన్ని సినిమాలో టచ్‌ చేయడం సాధారణ విషయం కాదని, ఇందుకు ఎంతో ధైర్యం అవసరమని వ్యాఖ్యానించారు.

ఇక మంత్రాలు, ఆవాహన వంటి ఆధ్యాత్మిక అంశాలను సరైన అవగాహన లేకుండా ఉపయోగించడంపై తనకున్న విశ్వాసాలను కూడా వేణుస్వామి వెల్లడించారు. ముఖ్యంగా ధూమావతి అమ్మవారికి సంబంధించిన అంశాలను తెరపై చూపించేటప్పుడు వాటి నేపథ్యం, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్యారడైజ్ లో ధూమావతి అమ్మవారిని అలా ఎలా చూపిస్తారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement