సుప్రీంకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ | Kavitha Filed Bail Petition In Supreme court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌

Aug 10 2024 1:53 AM | Updated on Aug 10 2024 1:53 AM

Kavitha Filed Bail Petition In Supreme court

సోమవారం విచారించనున్న జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కుంభకో ణంలో ఆరోపణలపై అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశా లను సవాల్‌ చేస్తూ కవిత తరఫు న్యాయ వాది మోహిత్‌రావు గురువారం క్రిమినల్‌ ఎస్‌ ఎల్‌పీ దాఖలు చేయగా శుక్రవారం రిజిస్ట్రీ వెరిఫై చేసింది.

అనంతరం సోమవారం కేసుల విచా రణ జాబితాలో చేర్చింది. ఈడీ, సీబీఐ కేసు ల్లోనూ బెయిల్‌ కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసో డియాకు బెయిల్‌ మంజూరు చేసిన జస్టిస్‌ బీ ఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల  ధర్మా సనం ముందుకు కవిత పిటిషన్‌ రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement