
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు.
ఇటీవల రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని కేజ్రీవాల్‌లో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఢిల్లీ హైకోర్టు సంపూర్ణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే దానిపై పరిశీలన చేస్తామని పేర్కొంది. తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక.. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు.. సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది.
ఇక.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దర్యాప్తు సంస్థ ఈడీ స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై నిన్న(ఆదివారం) సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.