సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊర‌ట‌.. బెయిల్ మంజూరు | Delhi CM Arvind Kejriwal granted bail in liquor policy case | Sakshi
Sakshi News home page

Delhi Liquor Case: సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊర‌ట‌.. బెయిల్ మంజూరు

Published Thu, Jun 20 2024 8:05 PM | Last Updated on Thu, Jun 20 2024 8:25 PM

Delhi CM Arvind Kejriwal granted bail in liquor policy case

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్‌కే కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.  

కాగా  లిక్క‌ర్ కేసులో సాధార‌ణ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచార‌ణ జ‌రిపి తీర్పును రిజ‌ర్వు చేసింది.  అనంత‌రం కోర్టు వెకేష‌న్ బెంచ్‌ జ‌డ్జి న్యాయ బిందు  బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

బెయిల్ మంజూరు సంద‌ర్భంగా.. ల‌క్ష రూపాయ‌ల పూచీక‌త్తు బాండ్‌ స‌మ‌ర్పించాల‌ని కోర్టు ష‌ర‌తు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వ‌ర‌కు తీర్పును 48 గంట‌ల‌పాటు స‌స్పెండ్ చేయాల‌ని ఈడీ కోరిన్ప‌టికీ కోర్టు తిర‌స్క‌రించింది. ఇక బెయిల్ ల‌భించ‌డంతో కేజ్రీవాల్ శుక్ర‌వారం తిహార్ జైలు నుంచి బ‌య‌ట‌కు రానున్నారు. 

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనేందుకు మ‌ద్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నిక‌ల త‌ర్వాత జూన్ రెండున కేజ్రీవాల్ మ‌ళ్లీ తిహార్ జైల్లో లోంగిపోయారు. కింది కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తాజాగా నేడు ఆయ‌న‌కు బెయిల్ మంజూరైంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement