ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం | Delhi Liquor Policy CAG Report RS 2000 Crore Loss Lapses AAP Kickbacks | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం

Jan 11 2025 1:53 PM | Updated on Jan 12 2025 5:58 AM

Delhi Liquor Policy CAG Report RS 2000 Crore Loss Lapses AAP Kickbacks

ఆప్‌ సర్కార్‌ మద్యం పాలసీ నిర్వాకమిది 

లీక్‌ అయిన కాగ్‌ నివేదిక ! 

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఢిల్లీ రాష్ట్ర పరిధిలో అమలుకోసం కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంబంధిత కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదికను జాతీయ మీడియా బయటపట్టింది. 

లీక్‌ అయిన కాగ్‌ నివేదికలో పలు విస్మయకర విషయాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ విధానంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని, నిబంధనలకు నీళ్లొదిలేశారని, ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారని కాగ్‌ నివేదిక పేర్కొంది. తమకు అనుకూలంగా పనిచేసే మ ద్యం విక్రయ సంస్థలకు అయాచిత లబ్ధిచేకూరేలా ఎక్సయిజ్‌ పాలసీలో మార్పులుచేర్పులు, సవరణ లు చేశారని కాగ్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది.   

కాగ్‌ నివేదికలో ఏముంది? 
లీక్‌ అయిన కాగ్‌ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్‌ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయ లై సెన్సులు పొందిన లిక్కర్‌ సంస్థల ఆర్థిక స్థితిగతు లు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు.

 కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.

 జోనల్‌ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదా యం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్‌ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్‌ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది.  అయితే కాగ్‌ నివేదిక ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. 

కేజ్రీవాల్‌ సమాధానం చెప్పాలి: బీజేపీ 
ఆప్‌ తెచ్చిన మద్యం విధానం లోపభూయిష్టమని కాగ్‌ నివేదించిన నేపథ్యంలో శనివారం బీజేపీ నేత అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్‌గేట్‌’కు సూత్రధారి, ఆప్‌ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సమాధానం ఇవ్వాలి. 11 ఏళ్ల క్రితం అవినీతిపై సమాధానం చెప్పాలని సోనియాగాందీని పదేపదే డిమాండ్‌చేసిన కేజ్రీవాల్‌ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు’’అని ఠాకూర్‌ అన్నారు. 


ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement