కవిత బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు | Delhi High Court seeks CBI response to K Kavitha bail plea | Sakshi
Sakshi News home page

కవిత బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

May 17 2024 4:40 AM | Updated on May 17 2024 4:45 AM

Delhi High Court seeks CBI response to K Kavitha bail plea

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్‌ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ విచారించారు.

కవిత తరఫు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలోవున్న పిటిషనర్‌ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్‌ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement