కవితకు అస్వస్థత.. నేడు తీహార్‌ జైలుకు కేటీఆర్‌ | KTR Will Meet MLC Kavitha At Tihar Jail | Sakshi
Sakshi News home page

కవితకు అస్వస్థత.. నేడు తీహార్‌ జైలుకు కేటీఆర్‌

Jul 22 2024 10:45 AM | Updated on Jul 22 2024 11:24 AM

KTR Will Meet MLC Kavitha At Tihar Jail

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నేడు తీహార్‌ జైలులో ఉన్న తన సోదరి కవితతో కేటీఆర్‌ ములాఖత్‌ కానున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.

కాగా, కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కవితను కలువనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన కవిత ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కవిత ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్‌ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు.. కొద్దిరోజుల క్రితమే కవితకు ఎయిమ్స్‌ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement